భారత_రాష్ట్రపతి_ఎన్నికల_విధానం https://te.wikipedia.org/wiki/భారత_రాష్ట్రపతి_ఎన్నికల_విధానం భారతదేశం లో అత్యుత్తమ పదవి అయినా రాష్ట్రపతి ఎన్నికల విధాన్నాన్ని భారత రాజ్యాంగ పరిషత్ ఐర్లాండ్ దేశం నుండి ఆదర్శంగా తీసుకున్నారు. ప్రతి ప్రాంతంలోని జనాభాను, ఆ ప్రాంత విస్తీర్ణాన్ని ప్రాతిపదికంగా తీసుకొని ఎన్నికలను నిర్వహిస్తారు. ఆర్టికల్-54 లో రాష్ట్రపతి ఎన్నికల ప్రస్తావన ఉంది. ఎలక్ట్రోరల్ కాలేజి సభ్యులు ఓటర్లుగా ఉంటారు. ఎలక్ట్రోరల్ కాలేజి లో అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ఎమ్మెల్యే లు, పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు ఓటర్లుగా ఉంటారు. 1992 లో 72 వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రపాలిత ప్రాంతాల ఎమ్మెల్యేలకు ఓటు హక్కు కల్పించారు. దీన్ని భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. ఎలక్ట్రోరల్ కాలేజిలో మొత్తం ఓట్ల విలువ = 10,98,990. అందులో 50 శాతం ఎంపిలకు, 50 శాతం ఎమ్మెల్యేలకు ఉంటుది. ప్రస్తుతం ఎలక్ట్రోరల్ కాలేజిలో 776 (544+223) మంది ఎంపీలు. 4120 మంది ఎమ్మెల్యేలు ఓటర్లుగా ఉంటారు.దేశంలోని మొత్తం ఎమ్మెల్యేల ఓట్ల విలువ 54,9495. దీన్ని ఎంపీల సంఖ్య 776 తో భాగిస్తారు. అదే 708.112 వస్తుంది. దాన్నే 708 గా ఖరారు చేశారు.ఎమ్మెల్యేలకు మాత్రం ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా ఉంటుంది. దీన్ని నిర్ణయించడానికి 1971 జనాభా ను ప్రాతిపదికన తీసుకుంటారు. 1971 నాటి మొత్తం జనాభాను ఆ రాష్ట్ర ఎమ్మెల్యేల సంఖ్యతో భాగిస్తారు. దానిని వేయితో భాగిస్తారు.ఉదాహరణ: తెలంగాణ రాష్ట్రం మొత్తం జనాభా (1971 జనాభా లెక్కల ప్రకారం) 1,56,02,122. దీన్ని 119 ఎమ్మెల్యేలతో భాగించగా 131950.650 వస్తుంది. దాన్ని 1000 తో భాగిస్తే 131.95 వస్తుంది. దీన్ని ఓటు విలువ 132 గా నిర్ణయించారు.