వేబిల్లు https://te.wikipedia.org/wiki/వేబిల్లు వేబిల్ (Waybill) అనేది వస్తువుల యొక్క సరుకు రవాణాకు సంబంధించిన వివరాలను, సూచనలను తెలియపరస్తూ వాహకునికి జారీ చేయబడే పత్రం. సాధారణంగా ఇది సరకు పంపిన వ్యక్తి యొక్క సరకు తీసుకొనే వ్యక్తి యొక్క పేర్లను, సరుకు యొక్క మూలంను, దాని గమ్యస్థానమును వాహనము పయనించవలసిన మార్గమును చూపిస్తుంది. చాలా వరకు సరుకు రవాణా పంపే వ్యక్తులు ట్రక్కింగ్ కంపెనీలు హౌస్ బిల్ అని పిలువబడే అంతర్గత వేబిల్‌ను ఉపయోగిస్తాయి. ఇవి సాధారణంగా "క్యారేజ్ ఒప్పందం యొక్క షరతులను" కలిగి ఉంటాయి, ఇవి బాధ్యత ఇతర నిబంధనలు షరతులకు పరిమితులను కలిగి ఉంటాయి. వేబిల్ అనేది కొరియర్ రశీదు వంటిది, దీనిలో సరకు పంపిన వ్యక్తి యొక్క సరకు తీసుకొనే వ్యక్తి యొక్క పేర్లు, సరుకు యొక్క మూలం, ఆ సరుకు చేరవలసిన గమ్యస్థానము ఆ సరుకును తరలించే వాహనము యొక్క వివరాలు, ఆ వాహనము పయనించవలసిన మార్గము, సరుకును తీసుకొనే సమయం, చేర్చవలసిన సమయం తదితర అంశాలు ఉంటాయి. చాలా విమానయాన సంస్థలు ఎయిర్ వేబిల్ అని పిలువబడే వేరే రూపాన్ని ఉపయోగిస్తాయి, ఇది విమానాశ్రయం గమ్యం, విమాన సంఖ్య సమయం వంటి అదనపు సమాచారమును జాబితా చేస్తుంది.