ఉద్యోగుల_భవిష్య_నిధి_పథకం https://te.wikipedia.org/wiki/ఉద్యోగుల_భవిష్య_నిధి_పథకం ఉద్యోగుల భవిష్య నిధి పథకం 1952 (Employees’ Provident Fund Scheme -1952 ) : 20 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగాస్తులుగా కలిగిన అన్ని ఫ్యాక్టరీలు, పరిశ్రమలు, సంస్థలు తప్పనిసరిగా ఈ పథకం కిందికి వస్తాయి. అటువంటి సంస్థలలో రూ.15000 అంతకంటే తక్కువ ప్రాథమిక వేతనం (Basic Wages) కలవారు తప్పనిసరిగా సభ్యులుగా చేరవలసి ఉంటుంది. వేతనం రూ.15000 కంటే ఎక్కువ ఉన్నవారు కూడా యాజమాన్య - ఉద్యోగ పరస్పర అంగీకారంతో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థకు అభ్యర్ధన పత్రం సమర్పించి సభ్యులుగా చేరవచ్చు. ఉద్యోగుల భవిష్య నిధి పథకం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా|ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ద్వారా నిర్వహింపబడుతున్న ౩ పథకాలలో ముఖ్యమైనది. మిగతా రెండు పథకాలు ఉద్యోగుల పించను పథకం, ఉద్యోగుల జమ ఆధారిత బీమా పథకం . ప్రతి నెలా సభ్యుల ప్రాథమిక వేతనం, కరువు భత్యం (Dearness Allowance) (అత్యధికంగా రూ.15000) లలో 12% సంస్థకు జమ చేయాల్సివుంటుంది. యాజమాన్యం కూడా సమానమైన మొత్తం జమ చేస్తుంది. యాజమాన్య – కార్మిక పరస్పర అంగీకారంతో రూ.15000 కంటే ఎక్కువ వేతనంపై కూడా12% చెల్లించవచ్చు. అలా జమచేయబడిన 24%లో 8.33% (యాజమాన్య 12 శాతం నుండి ) పించను పథకానికి మరలిస్తారు. మిగిలిన మొత్తం సభ్యుడి ఖాతాలో జమచేయబడుతుంది. అలా జమచేయబడిన మొత్తం పై ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ వడ్డీ ఇస్తుంది. 2014-15 సంవత్సరానికి గాను వడ్డీ 8.75 శాతంగా నిర్ణయింపబడ్డది . ప్రతీ సంవత్సరం అలా వచ్చిన వడ్డీ కూడా అదే ఖాతాకు జమ అయ్యి దానిపై కూడా వడ్డీ వస్తుంది. ఆ విధంగా ఖాతా లోని మొత్తంపై చక్రవడ్డీ లభిస్తుంది. ఉద్యోగస్తుల వేతనంలోనుండి చెల్లించే ఈ 12% మొత్తం పొదుపుగా పరిగణించబడి ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు పొందుతుంది (అత్యధికంగా రూ.1,50,000). ఖాతా లోని మొత్తంపై వచ్చే వడ్డీపై కూడా ఎటువంటి పన్ను ఉండదు. అలా సభ్యుడి ఖాతా లోని మొత్తం అతడు పదవీ విరమణ పొందినప్పుడు కానీ (58 సంవత్సరముల పైబడి), దురదృష్టవశాత్తూ చనిపోయినప్పుడుకానీ, ఉద్యోగం నుండి నిష్క్రమించినపుడుకానీ (రాజీనామా లేదా మరే కారణంగానైనా) ఆ సభ్యుడికిగానీ, అతని కుటుంబ సభ్యులకు కానీ చెల్లిస్తారు. ఉద్యోగం నుండి నిష్క్రమించినపుడు ఆ సభ్యుడు రెండు నెలల పాటు నిరుద్యోగాస్తుడిగా ఉన్నట్లైతేనే ఖాతా లోని మొత్తం తీసుకోవడానికి వీలవుతుంది. ఆ రెండు నెలలో వేరే ఉద్యోగంలో చేరినట్టయితే అతని ఖాతా లోని మొత్తాన్ని కొత్త ఉద్యోగం యొక్క భవిష్య నిధి ఖాతాకు తరలిస్తారు. ఒక సభ్యుడు ఒక ఉద్యోగం వదిలేసిన తరువాత ఎప్పుడు వేరే ఉద్యోగంలో చేరినా తన భావిషయనిధిని కొత్త ఉద్యోగం యొక్క భవిష్యనిధి ఖాతాకు తరలించుకోవచ్చు. రుణ సదుపాయం: అవసరమైన సందర్భాలలో సభ్యులు తమ ఖాతా నుండి రుణం తీసుకోవచ్చు. సెక్షన్ 68B: గృహ నిర్మాణం, ఇంటికై భూమి కొనడం, కొత్త ఇంటిని కొనడం సెక్షన్ 68K: ఉన్నత విద్యాభ్యాసం, వివాహ నిమిత్తం సెక్షన్ 68H: ఆరోగ్య వ్యవహారాల రీత్యా. అవసరమైన సందర్భాలలో సభ్యులు తమ ఖాతా నుండి రుణం తీసుకోవచ్చు. సెక్షన్ 68B: గృహ నిర్మాణం, ఇంటికై భూమి కొనడం, కొత్త ఇంటిని కొనడం సెక్షన్ 68K: ఉన్నత విద్యాభ్యాసం, వివాహ నిమిత్తం సెక్షన్ 68H: ఆరోగ్య వ్యవహారాల రీత్యా కేంద్ర ప్రభుత్వం కోవిడ్ 19 నేపథ్యంలో ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గర్ యోజన పథకాన్ని ఈపీఎఫ్‌వో ద్వారా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా కంపెనీలపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు ప్రభుత్వమే నేరుగా ఉద్యోగులకు ఊరట కలిగే చర్యలు చేపట్టింది. ఈపీఎఫ్‌వో చట్టం కింద రిజిస్టర్ అయిన కంపెనీలకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. రిజిస్ట్రేషన్ గడువు మార్చి 31, 2022. ఉద్యోగుల భ‌విష్య నిధి (పీఎఫ్‌)పై వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గిస్తూ కేంద్రం 2022 జూన్ 3న కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌స్తుతం పీఎఫ్‌పై 8.5 శాతం వ‌డ్డీ ఇస్తుండ‌గా ఆ వ‌డ్డీ శాతాన్ని ఏకంగా 8.1%కి త‌గ్గించింది. ప్రజా భవిష్య నిధి