కళ్యాణలక్ష్మి_పథకం https://te.wikipedia.org/wiki/కళ్యాణలక్ష్మి_పథకం కళ్యాణలక్ష్మి పథకం తెలంగాణ రాష్ట్రం లోని నిరుపేద (దళిత, గిరిజన, బీసీ, ఓబీసీ కులాలకు చెందిన) యువతుల వివాహాల కోసం రూ.1,00,116 చొప్పున ఆర్థిక సాయం అందించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014, అక్టోబర్ 2న ప్రవేశపెట్టిన పథకం. 2017, మార్చి 13న ప్రవేశపెట్టిన 2017-18 తెలంగాణ బడ్జెట్ లో ఈ పథక ఆర్థిక సాయాన్ని రూ.51వేల నుండి రూ.75,116 లకు పెంచారు. 2018, మార్చి 19న రూ.1,00,116 కు పెంచారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అక్టోబరు 2, 2014 నుంచి ఈ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చారు. 18ఏళ్లు వయోపరిమితి ఉన్న బీసీ, ఓబీసీ యువతులకు ఈ పథకం వర్తిస్తుంది. గ్రామాల్లో ఆదాయం రూ.లక్షన్నర, పట్టణాల్లో రూ.2 లక్షల ఆదాయం ఉన్న వారు ఈ పథకానికి అర్హులు. ఈ పథకానికి 2014-15 బడ్జెటులో 230 కోట్ల రూపాయలు, 2016-17 బడ్జెటులో 738 కోట్ల రూపాయలు కేటాయించబడింది. 2018 మార్చి 19న ఆర్థిక సహాయం ₹75,116 నుండి ₹1,00,116కి పెంచబడింది. ఇది పెళ్లి సమయంలో వధువు కుటుంబానికి పెళ్లి ఖర్చుల కోసం అందించబడుతుంది. 2018–19 సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ లో ₹1450 కోట్లు కేటాయించబడింది. కల్యాణలక్ష్మి పథకం కింద 2020-21 సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌లో ₹1850 కోట్లు కేటాయించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల కింద 2021, సెప్టెంబరు 18వ తేదీనాటికి 7,14,575 మంది ఆడపిల్లలకు లబ్ధిచేకూరింది. దీనికోసం ప్రభుత్వం రూ.5,556.54 కోట్లు వెచ్చించింది. అర్హులైన యువతులు తమ వివాహానికి నెల రోజుల ముందు మీ-సేవ కేంద్రాల నుంచి దరఖాస్తు చేసుకోవాలి దళిత, గిరిజన, బీసీ, ఓబీసీ కులాలకు చెందిన యువతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు ధరఖాస్తుదారులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. వారి కుటుంబ సభ్యుల ఆదాయం రూ. 2 లక్షలకు మించకూడదు వివాహ సమయానికి అమ్మాయి వయసు 18 సంవత్సరాలు పూర్తయి ఉండాలి బ్యాంకు ఖాతా పుస్తకం (వధువు పేరు మీద ఏదైనా జాతీయ బ్యాంకు నుంచి తీసుకున్న బ్యాంకు ఖాతా పుస్తకంపై వధువు ఫొటో తప్పనిసరిగా ఉండాలి)పుట్టిన తేదీ ధృవపత్రం (మీసేవ ద్వారా సంబంధిత అధికారులు జారీ చేసినది) కులం ధృవీకరణ పత్రం (మీసేవ ద్వారా సంబంధిత అధికారులు జారీ చేసినది) ఆదాయ ధృవీవకరణ పత్రం (వివాహం జరుగు తేదీ నాటికి 6 నెలలలోపు మీ-సేవ ద్వారా సంబంధిత అధికారిచేత జారీ చేసినది) పెళ్లికూతురు, పెళ్ళికుమారుడికి చెందిన ఇద్దరి ఆధార్ కార్డులు బ్యాంకు ఖాతా పుస్తకం (వధువు పేరు మీద ఏదైనా జాతీయ బ్యాంకు నుంచి తీసుకున్న బ్యాంకు ఖాతా పుస్తకంపై వధువు ఫొటో తప్పనిసరిగా ఉండాలి) వివాహ ఆహ్వాన పత్రికతెలంగాణ ఈపాస్లో ధరఖాస్తు చేసుకోవాలి. పెళ్ళికి 10 రోజుల ముందు ఆర్థిక సహాయం అందేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. వివాహం జరిగిన తరువాత కళ్యాణలక్ష్మి పథకం కింద ఆర్థిక సాయం చేయాలనే నిబంధనను మార్చి, పెళ్ళి అవసరాలకోసం డబ్బును ముందే అందించాలన్న ఉద్దేశంతో దరఖాస్తు చేసిన కొద్ది రోజులలోనే ఆ దరఖాస్తు ఫారాలను పరిశీలించి, రూ.1,00,116 ఆర్థిక సాయం వధువు పేరుమీద ఉన్న బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమశాఖ కార్యాలయంలో, లేదా దగ్గరలోని తహసీల్దార్ కార్యాలయంలో పూర్తి సమాచారం పొందవచ్చు. ఈ పథకం ద్వారా మార్చి 2018 నాటికి 3,65,000 మందికి లబ్ధి చేకూరింది. 2020లో 1.67 లక్షల పైచిలుకు మందికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు అందాయి.