కాల_నిర్ణయం https://te.wikipedia.org/wiki/కాల_నిర్ణయం కాల నిర్ణయం (క్రోనొలాజికల్ డేటింగు లేదా డేటింగు) అనేది గతానికి చెందిన ఒక వస్తువు లేదా సంఘటనకు ఒక తేదీని ఆపాదించే ప్రక్రియ. కాల నిర్ణయం చేయడంతో, ఆ వస్తువు లేదా సంఘటనను ఈసరికే స్థాపించబడిన కాల రేఖలో ఇముడ్చడానికి వీలౌతుంది. దీని కోసం ఒక "డేటింగ్ పద్ధతి" అవసరం. విభిన్న ప్రమాణాలు, పద్ధతులను బట్టి అనేక డేటింగ్ పద్ధతులు ఉన్నాయి. ఇటువంటి పద్ధతులను ఉపయోగించే విభాగాలు కొన్ని: చరిత్ర, పురావస్తు శాస్త్రం, భూ శాస్త్రం, పాలియోంటాలజీ, ఖగోళ శాస్త్రం, ఫోరెన్సిక్ సైన్స్ వగైరాలు. సాపేక్ష డేటింగు (రెలెటివ్), సంపూర్ణ డేటింగు (యాబ్సల్యూట్) అనే రెండు డేటింగు పద్ధతులు ఉన్నాయి. సాపేక్ష డేటింగ్ పద్ధతులు ఒక వస్తువు లేదా సంఘటన యొక్క సంపూర్ణ (యాబ్సల్యూట్) వయస్సును నిర్ణయించలేవు. కానీ సంపూర్ణ తేదీ బాగా తెలిసిన మరొక సంఘటనతో పోల్చి దాని కంటే ముందు జరగడం లేదా తరువాత జరగడం అసాధ్యమని నిర్ణయిస్తుంది. ఈ సాపేక్ష డేటింగ్ పద్ధతిలో, యాంటె క్వెమ్, పోస్ట్ క్వెమ్ అనే లాటిన్ పదాలను అత్యంత పురాతన, అత్యంత ఇటీవలి సమయాలను సూచించేందుకు వాడుతారు. ఈ పద్ధతి అనేక ఇతర విభాగాలలో కూడా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు, షేక్స్పియర్ నాటకం హెన్రీ V ను, 1587 కి ముందు రాయలేదని చరిత్రకారులకు తెలుసు. ఎలాగంటే, ఈ నాటకానికి ప్రాధమిక మూలమైన రాఫెల్ హోలిన్షెడ్ రాసిన క్రానికల్స్ యొక్క రెండవ సంచిక 1587 కు ముందు ప్రచురించబడలేదు కాబట్టి. ఈ విధంగా, షేక్స్పియర్ నాటకం హెన్రీ V యొక్క పోస్ట్ క్వెమ్ డేటింగు 1587. అంటే ఈ నాటకం 1587 తర్వాతే రాసాడని సందేహాతీతంగా చెప్పవచ్చు. అదే విధానాన్ని పురావస్తు శాస్త్రం, భూగర్భ శాస్త్రం, పాలియోంటాలజీలలో అనేక విధాలుగా ఉపయోగిస్తారు. ఉదాహరణకు, సంపూర్ణ డేటింగు చేసేందుకు ఇబ్బందు లున్నచోట లేదా భూమి పొరల్లో అస్పష్టత ఉన్నచోట్ల, ఆ పొరల్లో కనిపించే పుప్పొడిని అధ్యయనం చేసి పాలియోపాలినాలజీ ద్వారా సాపేక్ష సాపేక్ష కాల నిర్ణయం చెయ్యవచ్చు. కొన్ని వృక్ష జాతుల - అంతరించినవైనా, కాకపోయినా - కాలం బాగా తెలిసినదే కాబట్టి ఈ పద్ధతి అనుసరణీయమే. కొన్ని సాపేక్ష డేటింగు పద్ధతుల జాబితా క్రింద చూడవచ్చు: క్రాస్ కట్టింగ్ రిలేషన్‌షిప్స్ హారిస్ మాట్రిక్స్ లా ఆఫ్ ఇంక్లూడెడ్ సెగ్మెంట్స్ లా ఆఫ్ సూపర్ పొజిషన్ ప్రిన్సిపుల్ ఆఫ్ ఒరిజినల్ హారిజాంటాలిటీ ప్రిన్సిపుల్ ఆఫ్ లేటరల్ కంటిన్యుటీ ప్రిన్సిపుల్ ఆఫ్ ఫౌనల్ సక్సెషన్ మెల్ట్ ఇంక్లూజన్స్ నైట్రోజన్ డేటింగ్ ఫ్లోరిన్ శోషణ డేటింగ్ సీరియేషన్ (పురావస్తు శాస్త్రం) సీక్వెన్స్ డేటింగ్ (ఒక రకమైన సీరియేషన్) పాలినాలజీ (పురావస్తు శ్రేణుల సాపేక్ష డేటింగ్ కోసం ఆధునిక కాలపు పుప్పొడి అధ్యయనం, ఫోరెన్సిక్ పాలినాలజీలో కూడా ఉపయోగిస్తారు) పాలియోపాలినాలజీ (భౌగోళిక శ్రేణి యొక్క సాపేక్ష డేటింగ్ కోసం శిలాజ పుప్పొడి అధ్యయనం. "పాలియోపాలినాలజీ" అని కూడా పిలుస్తారు) మార్ఫాలజీ (పురావస్తు శాస్త్రం) టైపాలాజీ (పురావస్తు శాస్త్రం) వార్నిష్ మైక్రోలామినేషన్ వోల్ క్లాక్ లెడ్ కొరోజన్ డేటింగ్ (పురావస్తు శాస్త్రంలో మాత్రమే వాడుతారు) పాలియోమాగ్నెటిజమ్ టెఫ్రోక్రోనాలజీ ఆక్సిజన్ ఐసోటోప్ నిష్పత్తి చక్రం ఆధారంగా సముద్ర ఐసోటోప్ దశలుసంపూర్ణ డేటింగ్ పద్ధతుల్లో ప్రధానంగా రేడియోమెట్రిక్ డేటింగ్ పద్ధతులు ఉంటాయి. రేడియోమెట్రిక్, రేడియోమెట్రికేతర సంపూర్ణ డేటింగ్ పద్ధతులకు కొన్ని ఉదాహరణలు క్రిందివి: అమైనో ఆమ్లం డేటింగ్ ఆర్కియోమాగ్నెటిక్ డేటింగ్ ఆర్గాన్-ఆర్గాన్ డేటింగ్ యురేనియం-లెడ్ డేటింగ్ సమారియం-నియోడైమియం డేటింగ్ పొటాషియం-ఆర్గాన్ డేటింగ్ రూబిడియం-స్ట్రోంటియం డేటింగ్ యురేనియం-థోరియం డేటింగ్ రేడియోకార్బన్ డేటింగ్ ఫిషన్ ట్రాక్ డేటింగ్ ఆప్టికల్లీ స్టిమ్యులేటెడ్ ల్యూమినిసెన్స్ ల్యూమినిసెన్స్ డేటింగ్ థర్మోల్యూమినిసెన్స్ డేటింగ్ (ఒక రకమైన కాంతి ప్రకాశం డేటింగ్) అయోడిన్-జినాన్ డేటింగ్ లెడ్-లెడ్ డేటింగ్ ఆక్సిడైజబుల్ కార్బన్ రేషియో డేటింగ్ రీహైడ్రాక్సిలేషన్ డేటింగ్ సిమెంటోక్రోనాలజీ (ఈ పద్ధతి ఒక ఖచ్చితమైన కాలాన్ని నిర్ణయించదు గానీ, మరణించేనాటికి చనిపోయిన వ్యక్తి వయస్సు ఎంతో చెబుతుంది) విగిల్ మ్యాచింగ్ డేటాస్టోన్ (పురావస్తు శాస్త్రంలో ప్రత్యేకంగా ఉపయోగించబడుతుంది) అబ్సిడియన్ హైడ్రేషన్ డేటింగ్ (ప్రత్యేకంగా పురావస్తు శాస్త్రంలో ఉపయోగిస్తారు) టెఫ్రోక్రోనాలజీ మాలిక్యులర్ క్లాక్ (ఎక్కువగా ఫైలోజెనెటిక్స్, పరిణామాత్మక జీవశాస్త్రంలో ఉపయోగిస్తారు ) డెండ్రోక్రోనాలజీ హెర్బ్‌క్రోనాలజీపురాతన పదార్థాల వయస్సును నిర్ణయించాల్సిన అవసరం, భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు, పాలియోంటాలజిస్టుల మాదిరిగానే పురావస్తు శాస్త్రవేత్తలకు కూడా ఉంది. అయితే పై ఇద్దరి విషయంలో, వారి అధ్యయనాలు పురాతన, ఇటీవలి మానవుల చరిత్ర రెంటికీ అవసరం. పురావస్తు శాస్త్రం మాత్రం మానవ కార్యకలాపాలు మొదలయ్యాక జరిగిన కాలంలోని అవశేషాలు, వస్తువులు లేదా కళాఖండాల అధ్యయనానికి సంబంధించినది. అవశేషాలు మానవ జాతుల కంటే పాతవి అయితే, వాటిని అధ్యయనం చేసే విభాగాలు భూవిజ్ఞాన శాస్త్రం లేదా పాలియోంటాలజీ. ఏది ఏమయినప్పటికీ, ఒక మానవుడి సగటు జీవితకాలంతో పోలిస్తే పురావస్తు డేటింగ్‌లోని సమయ పరిధి చాలా ఎక్కువ. ఉదాహరణకు, దక్షిణాఫ్రికా దక్షిణ తీరంలో ఉన్న పిన్నకిల్ పాయింట్ గుహల్లో, 1,70,000 సంవత్సరాల క్రితం నాటి సముద్ర వనరులను (షెల్ఫిష్) మానవులు క్రమం తప్పకుండా ఆహారంగా తీసుకున్నట్లు ఆధారాలు దొరికాయి. మరోవైపు, కేవలం వంద సంవత్సరాల వయస్సులో ఉన్న అవశేషాలపై కూడా పురావస్తు డేటింగ్ పద్ధతులు ఉపయోగిస్తారు. అందువల్ల, అత్యంత పురాతన కాలం నుండి అత్యంత నవీన కాలం వరకూ అన్ని పురావస్తు స్థలాల్లోనూ అనువైన డేటింగు పద్ధతిని వాడుతారు. పురావస్తు స్థలం నుండి సేకరించిన వస్తువును డేటింగు చేసేందుకు నేరుగా వాడవచ్చు. లేదా ఆ వస్తువు లభించిన ప్రదేశంలోనే ఉన్న ఇతర పదార్థాలను డేటింగు చేసి వస్తువు కాలాన్ని నిర్ణయించవచ్చు. డేటింగు ప్రధానంగా తవ్వకం తరువాతే చేస్తారు. కాని సత్సాంప్రదాయాన్ని అనుసరిస్తూ, "స్పాట్ డేటింగ్" అని పిలువబడే కొన్ని ప్రాథమిక కాల నిర్ణయ పనులు తవ్వకాలు జరిపేటపుడే చేస్తారు. పూర్వపు నమూనాలను నిర్మించడానికి పురావస్తు శాస్త్రంలో కాల నిర్ణయం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది వస్తువులు, నమూనాల సమగ్రతపై ఆధారపడుతుంది. పురావస్తు శాస్త్రం లోని అనేక విభాగాలు డేటింగు సాక్ష్యాలతో సంబంధం కలిగి ఉన్నాయి, అయితే ఆచరణలో కొన్ని పరిస్థితులలో అనేక విభిన్న డేటింగు పద్ధతులను వర్తింపజేయాల్సి ఉంటుంది. అందువల్ల తవ్వకం సమయంలో నమోదు చేసిన పురావస్తు సీక్వెన్సుకు సరిపోయేలా ఉండే అనుబంధ దశల సమాచారం ఉండడం అవసరం. మానవ ఉనికి లేదా గత కాలపు మానవ కార్యకలాపాలతో ఉన్న ప్రత్యేక సంబంధం కారణంగా, పురావస్తు శాస్త్రం దాదాపు అన్ని డేటింగ్ పద్ధతులనూ ఉపయోగిస్తుంది. కానీ ఈ క్రింది చూపిన లాంటి కొన్ని ప్రత్యేక వైవిధ్యాలతో: శాసన లేఖనం - శాసనాల విశ్లేషణ, గ్రాఫీమ్‌లను గుర్తించడం ద్వారా, వాటి అర్థాలను స్పష్టం చేయడం. తేదీలు, సాంస్కృతిక సందర్భాల ప్రకారం వాటి ఉపయోగాలను వర్గీకరించడం. రచనలు, రచయితల గురించి తీర్మానాలు చేయడం. నాణేల సేకరణ - చాలా నాణేలపై వాటి ఉత్పత్తి తేదీ రాసి ఉంటుంది. లేదా చారిత్రకంగా వాటి ఉపయోగం ఎప్పుడూ జరిగిందో చరిత్ర రికార్డులో ఉంటుంది. పాలియోగ్రఫీ - పురాతన మాన్యుస్క్రిప్ట్‌లను అర్థంచేసుకోవడం, చదవడం, డేటింగ్ చేయడం.సీరియేషన్ అనేది సాపేక్ష డేటింగ్ పద్ధతి. సీరియేషన్ యొక్క ఆచరణాత్మక అనువర్తనానికి ఉదాహరణ, రాతి పనిముట్లు లేదా కుండల వంటి హస్తకృతుల శైలిని, ఈసరికే తెలిసిన శైలితో పోల్చి పరిశీలించడం. పాలియోమాగ్నెటిజం (సాపేక్ష డేటింగ్ పద్ధతి) ఆక్సిజన్ ఐసోటోప్ నిష్పత్తి చక్రం ఆధారంగా సముద్ర ఐసోటోప్ దశలు (సాపేక్ష డేటింగ్ పద్ధతి) టెఫ్రోక్రోనాలజీ (సంపూర్ణ డేటింగ్ పద్ధతి)ఒక పురావస్తు సైట్ యొక్క స్ట్రాటిగ్రఫీని (భూమి పొరల అధ్యయనం) బట్టి, ఆ స్థలంలో చేపట్టిన నిర్దుష్ట కార్యకలాపాల ("సందర్భాలు") తేదీని నిర్ధారించడానికి, లేదా మెరుగుపరచడానికి ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, తేదీలు తెలిసిన రెండు సందర్భాల మధ్య, ఒక సందర్భం కప్పబడి ఉంటే, ఈ మధ్య సందర్భం కాలం, ఆ రెండు కాలాల మధ్య ఉంటుంది అని చెప్పవచ్చు. భూమి వయస్సు విశ్వం యొక్క వయస్సు డిజిటల్ మీడియా డేటింగ్ పద్ధతి భూవైజ్ఞానిక కాలరేఖ