జాతీయ_మైనార్టీ_కమిషన్ https://te.wikipedia.org/wiki/జాతీయ_మైనార్టీ_కమిషన్ జాతీయ మైనార్టీ (అల్ప సంఖ్యాక వర్గాల) కమిషన్ మొరార్జీదేశాయ్ ప్రధానిగా ఉన్న కాలంలో 1978, జనవరి 12న మైనార్టీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఆ సమయంలో దీని అధ్యక్షుడు ఎం.ఆర్.మినూమసాని. 1979లో జాతీయ మైనార్టీ కమిషన్‌కు చట్టబద్ధత కల్పించారు. అప్పటి ఛైర్మన్ అహ్మద్ అన్సారీ. 1984లో దీన్ని హోం మంత్రిత్వ శాఖ నుంచి సంక్షేమ మంత్రిత్వ శాఖకు బదిలీ చేశారు. జాతీయ మైనార్టీ (అల్ప సంఖ్యాక వర్గాల) కమిషన్ చట్టాన్ని పార్లమెంటులో 1992, మే 17న ఆమోదించగా, 17 మే 1993న చట్టబద్ధమైన సంస్థగా ఏర్పడింది. మన దేశంలో అత్యధికంగా 31% మైనార్టీలు అసోం రాష్ట్రంలో ఉన్నారు.జాతీయ మైనార్టీ కమిషన్ టోల్‌ఫ్రీ నెంబర్: 1800 110 088. జాతీయ మైనార్టీ కమిషన్‌లో ఛైర్మన్, వైస్‌ఛైర్మన్‌తో పాటు మరో ఆరుగురు సభ్యులను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. వీరంతా మైనార్టీ వర్గానికి చెందినవారై ఉండాలి. వీరి పదవీ కాలం 3 సంవత్సరాలు. వీరి నియామకం, తొలగింపు అధికారాలు కేంద్ర ప్రభుత్వానికే ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఆరు మతాలను అల్ప సంఖ్యాకులుగా గుర్తించింది. ముస్లీం క్రైస్తవులు సిక్కులు బౌద్ధులు పార్శీలు జైనులుజాతీయ మైనార్టీ కమిషన్ అల్ప సంఖ్యాక వర్గాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వాలకు సూచనలు చేయడం. కేంద్ర ప్రభుత్వం మైనార్టీలకు సంబంధించి ఏమైనా ఆదేశాలు ఇస్తే అవి పాటించడం. మెనార్టీల సంక్షేమం కోసం కేంద్ర- రాష్ట్ర శాసనసభలు చేసిన చట్టాల అమలు తీరును పర్యవేక్షించడం. ఈ కమిషన్‌కు సివిల్ కోర్టు అధికారాలు ఉంటాయి. మైనార్టీ వర్గాల బాలికల విద్యాభివృద్ధికి కృషి చేయడం. అధికారిక సమాచారాన్ని అందజేయమని సంబంధిత కార్యాలయాలను ఆదేశిస్తుంది. సాక్ష్యాలను, డాక్యుమెంట్లను సమర్పించాలని సంబంధిత వ్యక్తులను ఆదేశిస్తుంది. దేశంలో ఏ ప్రాంతంలో నివసించే వ్యక్తినైనా తన ముందు హాజరు కావాలని ఆదేశిస్తుంది.మైనార్టీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే రాష్ట్ర మైనార్టీ కమిషన్‌లను ఏర్పాటు చేయాలి. రాష్ట్ర సచివాలయంలో మైనార్టీల కోసం ఒక నోడల్ అధికారిని నియమించాలి. మైనార్టీ వర్గాల వారికి మసీదులు, చర్చిలు, ఇతర ప్రార్థనా స్థలాలు, సమాధుల కోసం ప్రత్యేక స్థలాలను రాష్ట్రాలు కేటాయించాలి. మైనార్టీల పర్వదినాల్లో ఎటువంటి పరీక్షలను నిర్వహించరాదు. వక్ఫ్ భూములు, రెవెన్యూ రికార్డుల వివరాలను పునఃసర్వే చేయించి, వాటిని భద్రపరచాలి.మహ్మద్ సర్ధార్ అలీఖాన్ థాహిర్ మహ్మద్ ఔ మహ్మద్ షమీమ్ తర్లోచన్ మహ్మద్ హమీద్ అన్సారీ మహ్మద్ షఫీ ఖురేషి వజహత్ హబీబుల్లా నసీం అహ్మద్ సయ్యద్ గయోరల్ హసన్ రిజ్వి