జాతీయ_వినియోగదారుల_హక్కుల_పరిరక్షణ_కమిషన్ https://te.wikipedia.org/wiki/జాతీయ_వినియోగదారుల_హక్కుల_పరిరక్షణ_కమిషన్ జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ కమిషన్ ( ఆంగ్లం:National Consumer Disputes Redressal Commission)1986లో చట్టం అమల్లోకి వచ్చి కమిషన్ 1988లో ఏర్పడింది. ఇది శాసనబద్ధమైన సంస్థ. ప్రస్తుత కమిషన్ ఛైర్మన్‌గా జస్టిస్ ఆర్.కె. అగర్వాల్ పని చేస్తున్నాడు. జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ కమిషన్‌లో ఒక చైర్మన్‌, 10 మంది సభ్యులు ఉంటారు. వీరి పదవీ కాలం 3 సంవత్సరాలు. వీరి నియామకం, తొలగింపు అధికారాలు కేంద్ర ప్రభుత్వానికే ఉంటాయి. హానికరమైన వస్తువులు లేదా సేవల నుంచి వినియోగదారులను రక్షించడం కోటి రూపాయల ఆస్తి విలువ గల వస్తువులపై కమిషన్‌ విచారిస్తుంది. విచారణలో ఏకీకృత విచారణ పద్ధతిని అమలు చేయడం. ఈ కమిషన్‌ వినియోగదారులకు ఆరు హక్కులను కల్పించాలి.1.భద్రతా హక్కు 2.అవగాహన హక్కు 3.ఎంపిక హక్కు 4.సమాచారం తెలుసుకునే హక్కు 5.సమస్య పరిష్కారం హక్కు 6.విన్నవించుకునే హక్కు వాణిజ్య ప్రకటన ద్వారా తప్పుదోవ పట్టిస్తే రూ.10 లక్షల జరిమానా, రెండేండ్ల జైలు రెండోసారి నేరం రుజువైతే రూ.50 లక్షల జరిమానాతో పాటు జైలు శిక్ష ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌ లావాదేవీలకు చట్టం వర్తింపు ఎలక్ట్రానిక్‌ మార్గాలు, టెలీషాపింగ్‌, ప్రత్యక్ష అమ్మకం, బహుళస్థాయి మార్కెటింగ్‌ వివాదాల పరిష్కారంఫీజులు రూ.లక్ష నుంచి 5లక్షల లోపు విలువైన వివాదాలకు ఫీజు ఉండదు రూ.5 నుంచి 10లక్షల లోపు రూ.200, రూ.10నుంచి రూ.20 లక్షలలోపు రూ.400 రూ.20లక్షల నుంచి రూ.50లక్షల వరకు రూ.వెయ్యి రూ.50లక్షల నుంచి రూ.కోటి వరకు రూ.2 వేల నామమాత్రపు ఫీజు మాత్రమే వినియోగదారుడు చెల్లించాలి.