అమ్మమ్మ_చదువు_(పుస్తకం) https://te.wikipedia.org/wiki/అమ్మమ్మ_చదువు_(పుస్తకం) అమ్మమ్మ చదువు సుధామూర్తి రాసిన కథల పుస్తకం. సుధామూర్తి ఇన్పోసిస్ అధినేత ఎన్.ఆర్. నారాయణ మూర్తి భార్య. ఆమె కథలు చెప్పడం అంత సులబం కాదు. అంటూనే అతి సునాయాసంగా అతి మంచి కథలను చెప్పారు. . వీటిని కథలు అనడం కన్నా రచయిత జీవిత పాఠాలు అని అంటే ఇంకా బాగుంటుంది. ఇందులో వున్న కథలన్నీ రచయిత అనుభవాలే. ఈ కథలు అనేక భాషలలో అనువదించ బడ్డాయి. ఈ పుస్తకం ఆంగ్ల మూలానికి తెలుగు అనువాదం. ఇందులోఅమ్మమ్మ చదువు అనే కథతో పాటు 35 కథలున్నాయి. సలలితంగా సందేశం...కల్పిత కథానికలు కావు, స్వీయానుభవాల నుంచి జాలువారిన ముత్యాల సరాలు. - ఇండియా టుడే జీవితంలో తాను స్వయంగా ఎదుర్కొన్న అనేకానేక సమస్యలకు అనుభవపూర్వకంగా నిర్మాణాత్మక సమాధానాలు సూచించే కథల్లాంటి రచనలు ఇవి. ఈ ఆత్మకథాత్మక కథనాలలో మనావతా పరిమళాలు గుబాళిస్తాయి. - ప్రజాసాహితి