నాగార్జున_సాగర్_ప్రాజెక్ట్_ఆధునీకరణ https://te.wikipedia.org/wiki/నాగార్జున_సాగర్_ప్రాజెక్ట్_ఆధునీకరణ కొత్తగా ప్రాజెక్ట్ లను నిర్మించడంతో పాటు ఇది వరకూ నిర్మించిన ప్రాజెక్ట్ లను పునర్నిర్మించి కాలానుగుణంగా ఆధునీకరించ వలసిన ఆవశ్యకతను గుర్తించి, రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ సహాయంతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఆధునీకరణను ఆంధ్రప్రదేశ్ జలవనరుల అభివృధ్ది పథకం పేరుతో 2010 లో చేపట్టింది 2018లో రెండు సంవత్సరాల ఆలస్యంగా పథకం పూర్తయింది. ప్రపంచబ్యాంక్ దీనికి మోస్తరు సంతృప్తి అని అంచనా వేసింది. శిథిలమైన కాలువ వ్యవస్థ 1.కాలగమనంలో కాలువ వ్యవస్థ ఈ క్రింది కారణాల వలన శిథిలమైంది. కాలువ వ్యవస్థ పురాతనమైనది. గడచిన కాలంలో కాలువలనిర్వహణకు తగినన్ని నిధులు సమకూర లేదు. 150 క్యూసెక్కుల కంటే తక్కువ నీటి ప్రవాహం కలిగిన కాలువలను తనిఖీ చేయడానికి కాలువ వెంబడి తగిన రోడ్లు లేవు. కాలువ ముఖ ద్వారం వద్ద నీటి వాడకం హెచ్చు మొత్తంలో ఉంది. కాలువ గట్ల దగ్గర అధికంగా నీరు చేరి గట్లు బలహీన మవు తున్నాయి. వర్షపు నీరు కాలువ లైనింగ్ లలో ప్రవేశించి లైనింగును, గట్టును బలహీన పరుస్తోంది. కాలువ గట్లపై విపరీతంగా పెరిగిన వృక్షజాలం మరమ్మత్తులను ఆటంక పరుస్తోంది. కాలువల చివర దాకా నీరు చేరక దాదాపు 4 లక్షల ఎకరాలకు నీరందడం లేదు.. ఈ మేరకు ఆశించిన ఆయకట్టుకు లోటు ఏర్పడింది.2. రాతినిర్మాణంలో పలు చోట్ల పగుళ్లు ఏర్పడ్డాయి. 3.కాలువ వెంబడి ఉన్న పలు నిర్మాణాలకు మరమ్మత్తులు చేయించవలసిన అవసరం ఉంది.. కొన్నిటిని పునర్నిర్మించ వలసి ఉంది. 4.ఎడమ కాలువ నాపా స్లాబ్ లైనింగు చాలా చోట్ల దెబ్బతింది. 5.ఆర్.ఆర్.రాతి కట్టడం లైనింగ్ చాలా చోట్ల కూలింది. 6.కాలువలలో చాలా చోట్ల మట్టి పడి ప్రవాహానికి అవరోధం కలుగుతోంది. 7.కాలువ వ్యవస్థలో ఆశించిన మేరకు నీటి ప్రవాహం జరగడం లేదు. 8.కాలువ వ్యవస్థను సత్వరం పునరుధ్దరించక పోతే సాలీనా 1 శాతం చొప్పున ఆయకట్టుకు నీరందదు. ఈ పధకం అమలు పై ప్రపంచ బ్యాంక్ తో 14.8.2010 న ఒప్పందం జరిగింగి. ఈ పథకం 10.9.2010 నుండి అమలు లోకి వచ్చింది. ఈ పథక కాల పరిమితి ఆరు సంవత్సరాలు. ఈ పథకం 31.7.2016 తో ముగుస్తుంది. ఈ పధకం మొత్తం అంచనా రూ.4444.41 కోట్లు.ఇందులో ప్రపంచ బ్యాంక్ ఋుణం రూ.2025 కోట్లు. రాష్ట్రప్రభుత్వ వాటా రూ.2416.41 కోట్లు. ప్రపంచు బ్యాంక్ తో ఒప్పందానికి ముందే రాష్ట్రప్రభుత్వం 2008 లోనే ఆధునీకరణ పనులు ప్రారంభించింది. పధకం పై సంతకాల ముందుగా ఏడాది కాలంలో ప్రాజెక్ట్ పై ప్రపంచ బ్యాంక్ నిబంధనలకు లోబడి అయన వ్యయంలో ప్రపంచ బ్యాంక్ వాటా రిట్టోఏక్టవీవ్ పంఢింగ్ క్రింద లభ్యమవుతుంది. 1.నాగార్జున సాగర్ కాలువలను ఆధునీకరించి నీటి సరఫరాసామర్ధ్యాన్ని వృధ్ది చేస్తూ వ్యవసాయాభివృధ్ధి చేయుట, వ్యవసాయ ఉత్పాదకత పెంచుట 2.నీటిపారుదల ఆయకట్ట అభివృధ్ది శాఖ సామర్ధ్యాన్నిపెంపుచేసి జలవనరులను బహుముఖంగా, ప్రణాళికా బధ్ధంగా అభివృధ్ది చేసి నిర్వహించుట పునర్నిర్మాణ పనులు కాలువలు 1.కాలువల గట్టులను బలోపేతం చేయడం 2.బలహీనంగా ఉన్న ప్రధాన, బ్రాంచి, మేజర్లు, మైనర్ల కాలువ గట్లను ఆమోదయోగ్యమైన డిజైన్లకు తగి నట్టుగా రీ సెక్షనింగ్ చేయుట 3.బలహీనమైన గట్లను సిమెంట్ క్రాంకీట్ లైనింగ్ తో పునర్నిర్మించడం 4.శిథిలమైన నిర్మాణాలకు మరమత్తులు, అవసరమైన చోట పునర్నిర్మాణం. 5.పాడైన లేదా పని చేయని యాంత్రిక, విద్యుత్ పరికరాలకు. గేట్లకు, సామాగ్రికి మరమ్మత్తులు లేదా కొత్త వాటితో మార్చుట 6.అవసరమైన చోట అదనపు క్రాస్ రెగ్యులేటర్లను అమర్చుట 7.గట్ల పై ఉన్న కాలువలను తనఖీ చేయడానికి అనువుగా రోడ్లను మెరుగు పరచుట నాగార్జున సాగర్ డ్యామ్ 1.డైవర్షన్ టన్నెల్ కు కొత్త అత్యవసర గేట్లను అమర్చుట 2.కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ గేట్లకు మరమ్మత్తులు 3.గేట్లకి పెయిటింగ్ వేయుట 4.కుడి మట్టి ఆనకట్ట వెలుపలి భాగాన బరువు తీసుకొనుటకు బెర్మ్ ఏర్పాటు 5.ఎడమమట్టి ఆనకట్ట వెలుపల రాయితో సమాంతరంగా 10 అడుగుల వెడల్పున రాళ్లను దొంతరగా పేర్చుట 6 స్పిల్ వే బకెట్టు చేరుటకు కుడి వైపునుండి రహదారి నిర్మించుట 7.స్పిల్ వే పియర్స్ మీద వాక్ వే బ్రిడ్జి నిర్మించుట 8.పోరస్ డ్రైన్లను శుభ్ర పరచుట, దానిలో కూరుకు పోయిన పదార్ధాలను వెలికి తీయుట ఆధునీకరణ పనులు 1.ప్రధాన, బ్రాంచి, డిస్ట్రిబ్యూటరీల వద్ద నీటి ప్రవహా సామర్థ్యం కొలిచే పరికరాలను అమర్చడం 2.కాలువలలో ప్రవహించు నీటిని సరైన నిష్పత్తిలో మైనర్లు, సబ్ మైనర్ల లోకి ప్రవహింపచేయుటకు తగు ఏర్పాట్లు చేయుట 3.ఆయకట్టు పరిధిలో కమ్యూనికేషన్ వ్యవస్థను మెరుగు పర్చడం 4.ప్రధాన నిర్మాణాల వద్ద గేట్లను యాంత్రీకరించుట 5.డ్యామ్ వద్ద నీటి ప్రవాహ వేగాన్ని తెలుసుకునేందుకు ఆధునిక యంత్రాలను అమర్చుట అంశం (ఎ) నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లో నీటి పారుదల సేవలు, నీటి విడుదుల, నిర్వహణ మెరుగు పరచుట ఈ అంశం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వ్యవస్థ ఆధునీకరణ, పునర్నిర్మాణం ద్వారా ప్రాజెక్ట్ పరిధిలో మెరుగైన నీటి పారుదల సేవలను మెరుగు పరచడానికి, నీటి వినియోగదారుల భాగస్వామ్యులను చేసి, నిర్వహణకు తగిన నిధులు చేకూరుస్తూ, నిర్వహణా వ్యయాన్ని రాబట్టి, అన్ని స్ధాయిలలో నీటి వినియోగ దారుల సమాఖ్యలకు నీటి పారుదలను మెరుగు పరచడానికి ఉద్దేశింప బడింది. ఈ అంశంలో ఐదు ఉప అంశాలు ఉన్నాయి. 1.నీటి పారుదల వ్యవస్థ ఆధునీకరణ. పునర్నిర్మాణం 2.డామ్ పరిరక్షణ పనులు 3.నీటి వినియోగదారుల సామర్థ్యం పెంపు 4.నీటి నిర్వహణ పధ్దతులను మెరుగు పరచుట 5.సాంఘిక, పర్యావరణ నిర్వహణా ప్రణాళిక అంశం (బి) బహువిధ, సాంద్ర పధ్ధతిలో వ్యవసాయోత్పత్తుల దిగుబడి పెంచుట ఈ అంశం రైతులు లాభ సాటి పధ్దతులలో వ్యవసాయ, ఉద్యానవనాల ఉత్పత్తులను అధికం చేసి పశుపోషణ, చేపల పంపకం ద్వారా వారి ఆదాయం పెంపు చేయడానికి ఉద్దేశింప బడింది. ఈ అంశంలో ఆరు ఉప అంశాలు ఉన్నాయి. 1.వ్యవసాయ పంటలు ఈ ఉప అంశం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పరీవాహక ప్రాంతంలో విస్తారంగా పండు వరి, పత్తి, పప్పుదినుసులు, వేరు శనగ, మిరప వ్యవసాయోత్పత్తులను అధికం చేయడానికి ఉద్దేశింప బడింది. ఈ ఉప అంశంలో కార్యక్రమాలు - సమగ్ర వ్యవసాయ నిర్వహణ పద్ధతులు నీటి ఉత్పాదకత పెంచే సాగు నీటి పధ్ధతులు సమగ్ర పెస్ట్. న్యూటిషనల్ మేనేజిమెంట్ రైతులకు, పథకాన్ని అమలు చేస్తున్న సంస్ధల ఉద్యోగుల సామర్థ్యం పెంచుటకు శిక్షణ, అవగాహన యాత్రలు వ్యవసాయి సాంకేతిక నిర్వహణ సంస్ధ (ATMAs) బలోపేతం2. ఉద్యాన పంటలు ఈ ఉప అంశం అధిక ప్రయోజన కారిగా ఉండే ఉద్యాన పంటలను ముఖ్యంగా కూరగాయల పెంపక ప్రోత్సహించడానికి ఉద్దేశింప బడింది. ఈ ఉప అంశంలో కార్యక్రమాలు - హైబ్రిడ్ విత్తనాల వాడకం వంటి ఆధునిక సాంకేతిక పధ్దతులనువినియోగం లోకి తెచ్చుట ఆధునిక, సాంకేతిక పధ్దతులతో మైరుగైన ఉత్పాదకత సాధించుట మెరుగైన క్వాలిటీకి సమగ్ర పెస్ట్ మేనేజిమెంట్, న్యూట్రిషనల్మ నేజిమెంట్ శిక్షణ, అవగాహన యాత్రలతో సామార్ధాన్ని పెంచుట3. పశుపోషణ ఈ అంశం పశు సంపదను, పాలు, మాంసం వంటి పశు సంబంధ ఉత్పత్తులను పెంచడానికి ఉద్దేశింప బడింది. ఈ ఉప అంశంలో కార్యక్రమాలు : కృత్రిమ గర్భధారణ ద్వారా మేలు జాతి పశువులనుఉత్పత్తి చేయుట పశువులకు మెరుగైన పౌష్టికాహారం, ఆరోగ్య పరిరక్షణ పశు పోషకులకు, సిబ్బందికి శిక్షణ, సామర్య పెంపు4. చేపల పంపకం ఈ ఉప అంశం నాగార్జున సాగర్ రిజర్వాయర్, ఆయకట్ట ప్రాంతాలలో చేపల ఉత్పత్తిని అధికంగా చేయడానికి ఉద్దేశింప బడింది. ఈ ఉప అంశంలో కార్యక్రమాలు: మెరుగైన ఉత్పాదక పద్ధతులను మత్సకారులకు తెలియజేయడం మెరుగైన ఫీడింగ్, నిర్వహణ, హార్వెస్టింగ్ టెక్నిక్ మత్స్యకారులకు, అనుబంధ శాఖల సిబ్కందికి శిక్షణ, సామర్ద్యపెంపు, అవగాహన యాత్రలు