టీకా https://te.wikipedia.org/wiki/%E0%B0%9F%E0%B1%80%E0%B0%95%E0%B0%BE టీకా (ఆంగ్లం: vaccine) అనగా వ్యాధి నిరోధకత (ఇమ్మ్యూనిటి)ని పెంచడానికి వాడే ఒకరకమయిన మందు. వాక్సిన్ అనే పదము ఎడ్వర్డ్ జెన్నర్ మశూచిని నివారించడానికి (గోమశూచికన్ని -లాటిన్ భాషలో vacca అంటే గోవు అని అర్థం) వాడడం వల్ల వచ్చింది. ఈ పదాన్ని లూయిస్ పాశ్చర్, ఇతర శాస్త్రవేత్తలు వాడుకలోకి తీసుకువచ్చారు. వాక్సిన్‌లు అనే మందుల అభివృద్ధికి మూలాలు చైనా దేశంలో లభిస్తాయి. అక్కడ పూర్వం స్థానికులు మశూచిని అరికట్టేందుకు ఇంకోరకమయిన హానికలుగజేయని మశూచిని ఉద్దేశ్యపూర్వకంగా ఒక వ్యక్తికి ఇచ్చేవారు. టీకా ఒక రకమయిన ఆర్గానిక్ పదార్థంతో తయారు చేయబడినదై ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. టీకా సాధారణంగా సూక్ష్మ జీవుల వలన కలిగే వ్యాధుల నివారణ కొరకు ఉపయోగించబడుతుంది. టీకాల్లో అనేక రకాలు వాడుకలో ఉన్నాయి. ఇవి శరీరం యొక్క రోగ నిరోధిక శక్తిని పెంచడంతో పాటు వ్యాధి యొక్క విపరీతాన్ని తగ్గించి తద్వారా వ్యాధి నుండి మనల్ని రక్షిస్తాయి. ఇంతకుముందు టీకాలను ఎక్కువరోజులు నిలువ ఉంచడానికి సాధారణంగా థైమెరోసల్ అనే పదార్థాన్ని వాడేవారు. దీనిలో ఎక్కువశాతం ఒకరకమైన పాదరసం ఉంటుంది. అందువల్ల డెన్మార్క్, అమెరికా వంటి దేశాల్లో దీని వాడుకను తగ్గించారు. ఎయిడ్స్ వ్యాధి నివారణకొరకు టీకాలను అభివృద్ధి చేయడానికి మెర్క్ కంపెనీతో పాటు చాలా కంపెనీలు కృషి చేస్తున్నాయి. కాని ఇప్పటివరకు ఎవరూ సఫలీకృతం కాలేదు. వాక్సీన్‌లు రకాలు , డెవెలప్‌మెంట్ -యూనివెర్సిటి ఆఫ్ ఆరిజోనా