ఆటలమ్మ https://te.wikipedia.org/wiki/%E0%B0%86%E0%B0%9F%E0%B0%B2%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE ఆటలమ్మ (Chicken pox) లేదా అమ్మవారు అని సాధారణంగా పిలవబడే ఈ వైరల్ వ్యాధిని వైద్య పరిభాషలో వారిసెల్లా జోస్టర్ (Varicella zoster) అని వ్యవహరిస్తారు. ఈ వ్యాధి చిన్నతనంలో ప్రతి పిల్లవాడికి సోకి నయమవడం సర్వసాధారణం. ఆటలమ్మ వారిసెల్లా జోస్టర్ వైరస్ ద్వారా సంక్రమిస్తుంది, ఈ వైరస్‌ను హ్యూమన్ హెర్పిస్ వైరస్ 3 అని కూడా వ్యవహరిస్తారు. ఆటలమ్మలో రెండు రకాలున్నాయి. ఒకటి ఆటలమ్మ, రెండోది ముత్యాలమ్మ. ఆటలమ్మ మశూచికం వ్యాధిలా తీవ్రమైన జబ్బుకాదు. అయినా కొన్నిసార్లు ప్రమాదకరంగా మారనూవచ్చు. ఆటలమ్మ ప్రపంచంలో ఇంకా పూర్తిగా నిర్మూలించబడలేదు. దీన్ని చాల మంది అమ్మ వారు అని తేలికగా తీస్కుంటారు, అంతే కాక మంచిది అనేలా బావిస్తారు. నిజానికి యిది ఒక వైరస్, మన పూర్వికులు దైవంగా బావించే ఈ వ్యాధి 'ఆటలమ్మ' క్రిములు శరీరంలో ప్రవేశించిన 4,5, రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు పైకి కనబడతాయి. వైద్య నిపున్ని సంప్రదించడం చాల మంచిది, మూడ నమ్మకాలతో నిర్లక్చ్యం చేయరాదు. ఆటలమ్మ విషయంలో మశూచికం వ్యాధిలోలాగా కాకుండా ఆరాంభంలోనే పొక్కులు కనిపిస్తాయి. కొద్దిగా జ్వరం కూడా వస్తుంది. రోగం సోకిన కొన్ని గంటలలో వంటిమీద పొక్కులు కనిపిస్తాయి. మరికొన్ని గంటలలో ఆ పొక్కులలో నీరు చేరుతుంది. ఒకటి రెండు రోజుల తర్వాత వాటిలో చీము చేరుతుంది. ఆటలమ్మ మొదట నోటిలోపల, శరీరం పైభాగాన ఆరంభం అవుతుంది. తర్వాత ముఖం, రొమ్ము, చేతులు, కాళ్ళు, ఇలా వివిధ భాగాలకు వ్యాపిస్తుంది. ముఖంమీద, కాళ్ళు, చేతులలో కణువుల వద్ద, కొద్దిపాటి పొక్కులే ఉంటాయి. చంకలు, భుజం, తొడల ప్రాంతంలో ఎక్కువ పొక్కులు కనిపిస్తాయి. పొక్కులు సంపులు సంపులుగా ఉంటాయి.నీళ్ళతో నిండిన పొక్కులు సులభంగా చిట్లిపోతాయి. పొక్కులలో చీము చేరేటప్పుడు జ్వరం రాదు. పొక్కులు రాలి నప్పుడు ఎర్రపుండు ఏర్పడవచ్చు. కాని మశూచికంలోలాగ గుంటలు పడవు, మచ్చలూ ఏర్పడవు. ఆటలమ్మ సోకిన బిడ్డను, తక్కిన పిల్లలతో కలసి ఆడుకోనివ్వరాదు. తక్కిన పిల్లలకు దూరంగా ఉంచాలి. మశూచికం వచ్చినప్పుడు తీసుకునే జాగ్రత్తలన్నీ ఆతలమ్మ సోకినప్పుడూ తీసుకోవాలి. నీటి బొబ్బలు శరీరం మెడ ఏర్పడుతుంది. అలా మొదలయిన నీటి బొబ్బలను గోర్లతో గీకరాదు, గోర్లతో గీకడం వల్ల మరింత ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది. రోగిని చల్లటి ప్రదేశంలో ఉంచాలి, పలుచన అయిన దుస్తులు ధరించాలి. చేతి గోర్లను కతిరించడం చాలా ముఖ్యం. వైద్య నిపుణులు యిచ్చిన మందులను వాడటం చాలా ముఖ్యం. ఇదికూడా ఆటలమ్మ రోగ క్రిమివల్ల సంక్రమించే వ్యాధే అని చెప్పలి. రోగనిరోధక శక్తి తక్కువగా వున్న వాళ్ళ శరీరమంతటా, రోగనిరోధక శక్తి ఎక్కువగావున్న వాళ్ళకు శరీరంలో ఏదో ఒక భాగాన ఈ వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధి సోకినప్పుడు జ్వరం బాగా వస్తుంది. వెన్నెముక చుట్టూవున్న జీవకణాల్ని ఈ వ్యాధి బాధిస్తుంది. దేహంలో ఉద్రేకం ఏ భాగంలో కలుగుతుందో ఆ భాగంలో ఈ వ్యాధి సోకుతుంది. మొట్టమొదట పొక్కులు కనిపిస్తాయి. పొక్కులలో నీళ్ళు చేరి తర్వాత చీము పడతాయి. అలా మొదలయిన నీటి బొబ్బలని గోర్లతో గీకరాదు. గోర్లతో గీకడం వల్ల మరింత ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది. రోగిని చల్లటి ప్రదేశంలో ఉంచాలి, పలుచన అయిన దుస్తులు ధరించాలి. చేతి గొర్లను కత్తిరించడం చాల ముఖ్యం. వైద్య నిపుణులు యిచ్చిన మందులను వాడటం చాల ముఖ్యం. అంటువ్యాధులు-నివారణోపాయాలు-కల్వి గోపాలకృష్ణన్ (తమిళమూలం) -బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు (తెలుగుసేత)