కాన్సర్ https://te.wikipedia.org/wiki/%E0%B0%95%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D%E0%B0%B8%E0%B0%B0%E0%B1%8D క్యాన్సర్ని తెలుగులో "కర్క రోగం" అని అంటారు. సాధారణంగా మన శరీరంలో కణ విభజనలు ఒక క్రమ పద్ధతిలో నియంత్రించబడతాయి. కొన్ని సందర్భాలలో కణాల పెరుగుదలలో నియంత్రణ లేనందువల్ల కణాలు చాలా వేగంగా అస్తవ్యస్తంగా విభజన చెంది కణ సమూహాలను ఏర్పరుస్తాయి. ఈ కణసమూహాలను 'కంతి' ( టూమర్, tumor) అంటారు. అటువంటి కొన్ని ప్రమాదకరమైన వాటిని కేన్సర్ అని వ్యవహరిస్తారు. ఈ రకమైన పెరుగుదలకు ఒక స్పష్టమైన విధి ఉండదు. కేన్సర్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని 'ఆంకాలజీ' (Oncology) అంటారు. క్యాన్సర్‌ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వ్యాధి.క్యాన్సర్‌ మహమ్మారి ఏటా రూ.41, 17, 000 కోట్లు హరిస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది.మూడింట రెండొంతుల క్యాన్సర్‌ మరణాలు పేద, మధ్యతరగతి దేశాల్లోనే సంభవిస్తున్నాయి.అందులో ఎక్కువ భాగం ముందుగా గుర్తించి చికిత్స అందించడం ద్వారా నయంచేయొచ్చని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. ఇంగ్లీషులో 'టుమర్‌' అన్న మాటకి 'వాపు' అన్నది వాచ్యార్ధం. కణాలు విభజన చెంది అతిగా ఒక చోట చేరితే వచ్చే వాపు ఇది. అప్పుడప్పుడు ఈ వాపు చిన్న 'కాయ' రూపంలో తారస పడుతుంది. అప్పుడు దానిని 'కంతి' అంటారు. ఈ కంతి అన్నది రెండు స్వరూపాలలో తారసపడవచ్చు: నిరపాయమైన కంతులు (benign tumors), ప్రమాదమైన కంతులు (malignant tumors) . నిరపాయమైన కంతులని మూడు లక్షణాల ద్వారా గుర్తు పట్టవచ్చు. అవి నిరవధికం (unlimited) గా, దూకుడుతనం (aggressiveness) తో పెరిగిపోవు అవి ఇరుగు పొరుగు కణజాలం (tissue) మీదకి విరుచుకు పడవు (do not invade neighboring tissue) శరీరంలో ఒకచోటి నుండి మరొక చోటికి దండయాత్ర చెయ్యవు (do not metastasize)అయితే విటమిన్ B 17 లోపం అనే ఒక్ వాదన ఉంది.. అంతే గాని ఇది జబ్బు కాదని. ఒక రచయిత world without Cancer book పుస్తకాన్ని రాశాడు. కొన్ని రకాల కేన్సర్ల పేర్లు -ఓమా శబ్దంతో అంతం అవుతాయి: కార్సినోమా, సార్కోమా, మొదలయినవి. ఈ -ఓమా అనే ఉత్తర ప్రత్యయం ఉంటే అది కంతి (tumor) రూపంలో ఉందని అర్ధం. మెలనోమా (melanoma) అంటే మెలనోసైట్‌ (melanocytes) లు (అంటే మెలనిన్‌ కణాలు) విపరీతంగా పెరిగి కంతిలా ఏర్పడటం. ఈ మెలనిన్‌ కణాలు మన శరీరపు ఛాయని నిశ్చయించ గలవు. అందుకనే పుట్టుమచ్చల కైవారం అకస్మాత్తుగా పెరిగిందంటే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి. మాలిగ్నెంట్ ట్యూమర్లు (Malignant tumors) : ఈ రకమైన ట్యూమర్ల నుంచి కొన్ని కాన్సర్ కణాలు విడిపోయి, దేహంలో, ఏర్పడిన ప్రాంతం నుంచి వేరొక ప్రాంతంలోకి చేరి ద్వితీయ ట్యూమర్లను ఏర్పరుస్తాయి. ఈ ప్రక్రియను మెటాస్టాసిస్ (Metastasis) అంటారు. ఇవి తొందరగా పెరుగుతాయి, ప్రమాదకరం, ప్రాణాంతకమైనవి. బినైన్ ట్యూమర్లు (Benign tumors) : ఈ రకమైన ట్యూమర్లు సాధారణంగా నెమ్మదిగా పెరిగి, చిన్నవిగా ఉండి, ఒక తంతుయుత పొరచే కప్పబడి స్థానికంగా ఏర్పడతాయి. ఇవి మెటాస్టాసిస్ ను ప్రదర్శించవు. ఇవి హానికరమైనవి కావు. చిన్న శస్త్రచికిత్స ద్వారా తొలగించవచ్చును.మానని పుండు (Ulcer) అసహజమైన రక్త స్రావం (Bleeding) పెరుగుతున్న కంతి (Tumor) తగ్గని దగ్గు (Cough), బొంగురు గొంతు (Hoarseness of voice) మలంలో రక్తం, మలవిసర్జనలో మార్పు తగ్గని అజీర్తి, మింగుట కష్టం పుట్టుమచ్చలలో మార్పువైరస్ ఆంకో జన్యువు (Oncogenic virus) ల ప్రభావం ట్యూమర్ అణచివేత జన్యువు (Tumor suppressor genes) లను కోల్పోవడం. వాటిలో ఉత్పరివర్తనాలు కలగటం లేదా వాటిని ఉత్తేజరహితం గావించడం. డి.ఎన్.ఎ. రిపేర్ జన్యువులను కోల్పోవడం. వాటిలో ఉత్పరివర్తనాలు కలగటం లేదా వాటిని ఉత్తేజరహితం గావించడం. క్రోమోజోములు అరుదుగా భ్రంశనం (Aberration) కు గురి కావటం.పైన చెప్పిన అన్ని లేదా కొన్ని మార్పులు యాదృచ్ఛికంగా గాని లేదా అనేక కారకాల వల్ల జరగవచ్చును. ఈ మార్పులను ప్రేరేపించే కారకాలు: కొన్ని రకాల కాలుష్యం, రేడియేషన్, పొగాకు, ఆల్కహాల్, ఔషధాలు, రసాయనాలు. క్యాన్సరు ఏ అవయవంలో ప్రారంభమైంది, ఇది ప్రారంభమైన అవయవంలో కణం రకంపై ఆధారపడి ఇది అనేక రకాలుగా ఉండొచ్చు. కార్సినోమా (Carcinoma) అనేది ఉపకళా కణజాలాలలో ఏర్పడే మాలిగ్నెంట్ ట్యూమర్లు. ఈ కాన్సర్ లు చర్మం, శ్వాస, జీర్ణ,, జనన వ్యవస్థలోని ఉపకళా కణాల నుంచి ఏర్పడతాయి. లేదా దేహంలోని వివిధ గ్రంథులు ఉదా: క్షీరగ్రంధులు, నాడీ కణజాలం నుంచి ఏర్పడతాయి. మన దేహంలో ఏర్పడే కాన్సర్ లలో 85 % కార్సినోమా రకానికి చెందినవి. చేతి కార్సినోమా క్యాన్సర్ సార్కోమా (Sarcoma) సంయోజక కణజాలాలలో ఏర్పడే మాలిగ్నెంట్ ట్యూమర్లు. ఇవి మధ్యస్త్వచం నుంచి ఏర్పడిన కణజాలాలు, అవయవాల నుంచి గాని ఏర్పడతాయి. కాన్సర్ లలో సార్కోమా సుమారు 2 % ఉంటాయి. లూకీమియా (Leukemia) : గ్రీకు భాషలో 'లూకోస్‌' అంటే 'తెలుపు', 'ఈమియా' అంటే 'రక్తానికి సంబంధించిన'. కనుక 'లూకీమియా' అంటే 'తెల్ల రక్తం' అని ఆర్ధం వస్తుంది. రక్తంలో తెల్ల కణాలు బాగా పెరిగినప్పుడు అది లుకీమియా అని పిలవబడుతుంది. ఇది ముఖ్యంగా అస్థిమజ్జలో (bone marrow) ఉన్న తెల్ల కణాలను ప్రభావితం చేస్తుంది. దీనిని 'ద్రవరూప కంతి' అని కూడా అంటారు. దేహంలో ఏర్పడే ట్యూమర్లలో ఇవి 4 % ఉంటాయి. లింఫోమా (Lymphoma) ప్లీహం, శోషరస గ్రంథులలోని తెల్ల రక్తకణాలలో ఏర్పడే మాలిగ్నెంట్ ట్యూమర్లు. దేహంలో ఏర్పడే ట్యూమర్లలో ఇవి ఇంచుమించు 4 % ఉంటాయి. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న ప్రపంచ చర్మ క్యాన్సర్ అవగాహన దినోత్సవం నిర్వహించబడుతోంది.క్యాన్సర్‌ మన శరీరంలో ఏ భాగానికైనా వచ్చే ప్రమాదం ఉంది. అయినా గర్భాశయం, రొమ్ము క్యాన్సర్‌, ఊపిరితిత్తులు, పేగులు, శ్వాస నాళాలు మొదలైన భాగాలకు ఈ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువ. పసుపుకు క్యాన్సర్‌ కణాలను తుదముట్టించే సామర్థ్యం ఉన్నట్లు, పసుపులో ఉండే కర్కుమిన్‌ అనే రసాయనానికి 24గంటల్లోపే క్యాన్సర్‌ కణాలను చంపే శక్తి ఉన్నట్టు పరిశోధకులు తేల్చారు. కర్కుమిన్‌కు గాయాలు నయం చేయడంతోపాటు, ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పించే శక్తి ఉంది. (ఆంధ్రజ్యోతి 29.10.2009) 1.గవరసాన సత్యనారాయణ, కర్రీ తింటే కేన్సరు రాదా? : కేన్సరు వ్యాధిపై వ్యాసాలు, గవరసాన ఫౌండేషన్‌, గొల్లప్రోలు-533 455, ఇండియా, 2006