క్రొవ్వు పెరుగుదల https://te.wikipedia.org/wiki/%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B1%8A%E0%B0%B5%E0%B1%8D%E0%B0%B5%E0%B1%81_%E0%B0%AA%E0%B1%86%E0%B0%B0%E0%B1%81%E0%B0%97%E0%B1%81%E0%B0%A6%E0%B0%B2 వయసు మీద పడుతున్న కొద్దీ పొట్ట కూడా పెరగటం సహజమే. పురుషులు పెద్దగా పట్టించుకోకపోవచ్చు గానీ ఇది ఎంతోమంది స్త్రీలకు పెద్ద సమస్యగానే పరిణమిస్తుంది. శరీరాకృతినే మార్చేసి మరింత వయసు ముదిరినట్టు చేస్తుంది. ఇది అందానికే కాదు ఆరోగ్యానికీ చేటు కలిగిస్తుంది. శరీరంలో మిగతా భాగాల్లోని కొవ్వు కన్నా పొట్ట మీద పేరుకునే కొవ్వు చాలా ప్రమాదకరమైంది. ఇది గుండె జబ్బులు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్లు రావటానికీ దోహదం చేస్తుంది. అలాగని బాధ పడుతూ కూచోకుండా జీవనశైలిలో మార్పులు చేసుకోవటంతో పాటు కొన్ని రకాల వ్యాయామాలు చేయటంతో దీనిని తగ్గించుకునే ప్రయత్నం చేయటం చాలా అవసరం. సైనికులు, పోలీసులు ప్రతి రోజూ కవాతు చేస్తారు . సైనికుల్లో ఎవరికైనా పొట్ట, బొజ్జ రావడము చూడము కాని కొంతమంది లేకా పోలీసులందరికీ బొజ్జ కనబడుతూ ఉంటుంది. కారణము వారి శిక్షణ, ఆహార నియమావళి, క్రమబద్ధమైన వ్యాయామము . వయసు పెరుగుతున్న కొద్దీ జీవక్రియలు మందగిస్తుంటాయి. దీంతో శరీరంలో కొవ్వు మోతాదూ నెమ్మదిగా పెరుగుతూ వస్తుంది. పురుషుల్లో కన్నా స్త్రీలలోనే ఇది ఎక్కువ. ముట్లుడిగిన అనంతరం చేతులు, కాళ్లు, తొడల వద్ద కొవ్వు తగ్గిపోతూ పొట్ట దగ్గర పేరుకుపోవటం ప్రారంభిస్తుంది. కడుపుని పట్టుకున్నప్పుడు చర్మం కింద చేతికి తగిలే కొవ్వు కన్నా లోపల అవయవాల చుట్టూ పేరుకునే కొవ్వు ఇంకా ప్రమాదకరం. ఇది వంశ పారంపర్యంగానూ రావొచ్చు. ముట్లుడిగిన తర్వాత కలిగే హార్మోన్ల మార్పు కూడా దీనికి దోహదం చేస్తుంది. బరువు పెరగకుండా బొజ్జ పెరుగుతున్నా ప్రమాదకరమే. ఎత్తు బరువుల నిష్పత్తిని (బీఎంఐ) బట్టి అధిక బరువును గుర్తించొచ్చు గానీ దీంతో శరీరంలో కొవ్వు శాతాన్ని తెలుసుకోలేం. నడుం చుట్టుకొలత ద్వారా పొట్ట భాగంలో కొవ్వు ప్రమాదకర స్థాయికి చేరుకున్న విషయాన్ని పసిగట్టొచ్చు. దీన్ని ఎలా చూడాలో తెలుసా? ముందు బొడ్డు భాగంలో కడుపు చుట్టూ టేపుని చుట్టండి. శ్వాస మామూలుగా తీసుకోండి. కడుపుని లోపలికి పీల్చొద్దు. చర్మం నొక్కుకుపోయేలా టేపుని మరీ బిగుతుగా కూడా బిగించరాదు. నడుం చుట్టు కొలత 35 అంగుళాలుంటే అదుపులోనే ఉన్నట్టు. 35 అంగుళాలకు మించితే అనారోగ్యకర కొవ్వు పేరుకుందనే అర్థం. కొన్ని రకాల వ్యాయామాలు, ఆహారంలో మార్పులతో పొట్టను తగ్గించుకోవచ్చు. వ్యాయామం: బొజ్జను తగ్గించుకోవటానికి రోజూ వ్యాయామం చేయటం అన్నింటికన్నా ఉత్తమమైన మార్గం. దీంతో బరువుతో పాటే పొట్ట కూడా తగ్గుతూ వస్తుంది. బరువులు ఎత్తే వ్యాయామాలూ పొట్ట తగ్గటానికి ఉపయోగపడతాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది. అయితే ఎంతసేపు, ఏయే రకాల వ్యాయామాలు చేయాలన్నది వారి శారీరక శ్రమ, పనులను బట్టి ఆధారపడి ఉంటుంది. ఎవరికేది అవసరమో వైద్యుల సలహా మేరకు నిర్ణయించుకోవాలి. ఆహారం: ఆహార పదార్థాలు కొనేటప్పుడు సంతృప్త కొవ్వులకు బదులు పాలీ అసంతృప్త కొవ్వులు ఉండేవి ఎంచుకోవాలి. మామూలు పిండి పదార్థాలు గల పాలిష్‌ పట్టిన బియ్యం, గోధుమలు, బ్రెడ్‌, శుద్ధిచేసిన పాస్తాలకు బదులు సంక్లిష్ట పిండి పదార్థాలు ఉండే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. తక్కువ తినటంతో పాటు కేలరీలనూ తక్కువగా తీసుకుంటే బరువు తగ్గుతారు. పొట్టను (కొవ్వును) తగ్గించే కొన్ని ఆహారపదార్ధాలు : గుడ్డులోని తెల్లసొన, # అన్ని రకాల పండ్లు, పచ్చిగా తినగలిగే కాయకూరలు, ఆవిరిమీద ఉడికే కాయకూరలు, యాపిల్ పండ్లు, కాల్సియం ఎక్కువగా ఉండే పాలు, పెరుగు, మజ్జిక, రాగులు,పొట్ట కండరాలను దృఢ పర్చటం: మామూలు వ్యాయామం, ఆహార నియమాలతో బొజ్జ తగ్గకపోతుంటే.. పొట్ట కండరాలను దృఢం చేసే వ్యాయామ పద్ధతులు అనుసరించాలి. ముఖ్యంగా పొత్తి కడుపు, కడుపు లోపలి కండరాలను పటిష్ఠం చేయటంపై దృష్టి సారించాలి. హర్మోన్‌ చికిత్స: అరుదుగా కొందరికి మెనోపాజ్‌ అనంతరం హార్మోన్‌ రిప్లేస్‌మెంట్‌ చికిత్స (హెచ్‌ఆర్‌టీ) తీసుకోవటం కూడా ఉపయోగ పడుతుంది.బొజ్జ మూలంగా రకరకాల జబ్బులు దాడి చేసే ప్రమాదముంది. అవి-- గుండె జబ్బులు రొమ్ము క్యాన్సర్‌ మధుమేహం జీవక్రియల అస్తవ్యస్తం పిత్తాశయ సమస్యలు అధిక రక్తపోటు పెద్దపేగు క్యాన్సర్‌పొట్ట వద్ద పేరుకునే కొన్ని కొవ్వు కణాలు ఇన్స్‌లిన్‌ నిరోధకతను ప్రేరేపించే హార్మోన్లనూ ఉత్పత్తి చేస్తాయని పరిశోధనల్లో తేలింది. ఇది మున్ముందు మధుమేహానికి దారి తీయొచ్చు. మరికొన్ని కణాలు మెనోపాజ్‌ తర్వాత ఈస్ట్రోజెన్‌ను ఉత్పత్తి చేస్తాయి. దీంతో రొమ్ము క్యాన్సర్‌ ముప్పు పొంచి ఉంటుంది.