ప్రథమ చికిత్స https://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A5%E0%B0%AE_%E0%B0%9A%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B8 ఆరోగ్యమును పరిరక్షించడానికి, అనారోగ్యము ను, చిన్న చిన్న గాయాలు కు, సాదారణ శరీరరుగ్మతలకు, నిపుణుల వైద్యము అందేవరకు తాత్కాలికంగా చేయు ఉపయుక్తకరమైన వైద్యవిధానాన్ని ప్రథమ చికిత్స (First-aid) అంటారు. ట్రైనింగు ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు కూడా ప్రథమచికిత్స చేయవచ్చును. ఒక్కొక్కప్పుడు దీనివలన ప్రాణాలను కాపాడవచ్చును. కట్లు కట్టడము, రక్తము పోకుండా ఆపడము, ఊపిరి ఆడడము కష్టముగా ఉన్నప్పుడు కుత్రిమ శ్వాస ఇవ్వడము, మొదలుగునవి. దీనిలో ముఖ్యముగా మూడు ఉద్దేశములున్నవి. ప్రాణాన్ని నిలపడము ఉన్న గాయాన్ని ఎక్కువవకుండా చూడడము. బాధ నుండి బయటపడడానికి సహాయము చేయడము.రోడ్డు ప్రమాదములో గాయపడ్డ సమయమందు వ్యక్తి మంటలలో చిక్కుకున్న సమయములో కారణం ఏదైనా.. రక్తం ఎక్కువగా పోతున్న సమయాలలో వ్యక్తి పాము కాటుకి గురియైనపుడు వ్యక్తి ఉరి వేసుకున్న ప్రయత్నము న ఆయాసపడుతున్నపుడుబాధలో వున్న ప్రతి ప్రాణికి ప్రథమచికిత్స అవరము ఉంటుంది. సమయము, సందర్భము ఇది అని కచ్ఛితముగా చెప్పలేము. సమయస్ఫూర్తితో వైద్య సాయము అందించడమే ప్రథమచికిత్స. ప్రథమ చికిత్స పరికరాల పెట్టె (First-aid Box) ప్రతి కర్మాగారం, ఆఫీసు, పాఠశాల, ఇళ్లల్లో అందరికీ అందుబాటులో ఉండాలి. మన ఇంట్లో రేకు లేదా అట్టపెట్టెతో ప్రథమ చికిత్స బాక్స్ ను తయారు చేసుకోవచ్చు. సుళువుగా అందుబాటులో ఉండేలా మీ ప్రథమ చికిత్స పెట్టెను ఏర్పాటు చేసుకోవాలి. గడువు తీరిన ఔషధాలను పారేసి, తాజా ఔషధాలను బాక్స్ లో పెట్టాలి. ఈ క్రింద పేర్కొన్న పరికరాలు, వస్తువులు మీ ప్రథమ చికిత్స పెట్టెలో ఉండాలి. వివిధ రకాల సైజుల్లో అతుక్కునే గుణం గల బ్యాండేజీలు పీల్చుకునే గుణం గల (అబ్జార్బెంట్) నూలు బ్యాండేజీ లేదా రకరకాల సైజుల్లో ఉన్న నూలు గాజ్ ప్యాడ్లు అతుక్కునే పట్టీలు త్రికోణపు బ్యాండేజీ చుట్ట ఒక చుట్ట దూది బ్యాండ్ -ఎయిడ్స్ (ప్లాస్టర్స్) కత్తెర పెన్నుసైజు టార్చిలైటు చేతులకు వేసుకునే తొడుగులు (రెండు జతలు) ట్వీజర్స్ (పట్టుకర్ర) సూది తడిగా గల తువ్వాలు, శుభ్రమైన పొడి బట్ట ముక్కలు యాంటీ-సెప్టిక్ ద్రవం (సేవ్లన్ / డెట్టాల్) ఉష్ణమాపి (థర్మోమీటర్) ఒక చిన్న పెట్రోలియం జెల్లీ ట్యూబ్ లేదా ఇతర ల్యూబ్రికెంట్ (పొడిబారిన చర్మాన్ని మెత్తబరిచే క్రీములు) వివిధ రకాల సైజుల్లో పిన్నీసులు (సేఫ్టీ పిన్నులు ) సబ్బు లేదా డిటర్జెంట్ పొడిఆస్పిరిన్ లేదా నొప్పి తగ్గించే పారాసెటమాల్ మాత్రలు విరేచనాలు అరికట్టే (యాంటీ–డయోరియా) ఔషధాలు తేనెటీగలు వంటి కీటకాలు కుట్టిన చోట్ల పూయటానికి యాంటీ హిస్టమిన్ క్రీము (అలర్జీలు/దురదలు/మంటలు తగ్గేందుకు క్రీము) అజీర్తి, అసిడిటికి మాత్రలు (ఆంటాసిడ్, ఎంజైము మాత్రలు) విరేచనం సాఫీగా అవ్వటానికి (ల్వాక్సెటివ్) మాత్రలుఎవరికైనా గ్యాస్/వాయువులు పీల్చుట వలన ప్రమాదము సంభంవించినప్పుడు మనమా వ్యక్తిని రక్షించుటకు SCBA ను ధరించి వెళ్ళవలెను. లేనిచో ఆ గ్యాస్/వాయువులు మనకు కూడా హాని కలిగించగలవు. కాబట్టి తగిన రక్షణ తొడుగులను ధరించి ఆ వ్యక్తిని ప్రమాద ప్రదేశాల నుంచి దూరానికి తరలించవలెను. ఆ వ్యక్తిని సురక్షిత ప్రదేశములో పరుండ బెట్టి, బిగుతుగానున్న దుస్తులను వదులు చేసి, స్రృహలేనట్లయితే అతనికి శ్వాస, గుండె, పని చేస్తోంది, లేనిది గమనించాలి. శ్వాస లేనట్లయితే, మొదట అతని శ్వాస నాళాన్ని సరిచేసేందుకు. 1. నొసటిపై ఒక చేయుంచి రెండవ చేతితో గడ్డాన్ని పైకి ఎత్తిపట్టాలి. 2.నోటిలో ఏదైనా అడ్డు (ఉదా.కట్టుడు పళ్ళు, పాన్ వగైరా) ఉంటే దానిని తీసివేయాలి. 3.శ్యాసనాళము సరిచేయుట వలన శ్వాస తిరిగి ప్రారంభముకావచ్చును. ఒక వేళ శ్వాస లేకుంటే కల్పిత శ్వాస కలిగించాలి.ముందుగా గాలి మార్గాన్ని మెరగుపరచుటకై నొసలుపై ఒక చేయివుంచి, యింకొక చేతితో గడ్డాన్ని ఎత్తి పట్టాలి. నోటితో ఏవైన అన్యపదార్థమలుంటే వాటిని తీసివేయాలి. గాయపడిన వ్యక్తి నోటిపై ఒక గుడ్డను శుభ్రత కొరకై ఉంచాలి. గాయ పడిన వ్యక్తి ముక్కును వ్రేళ్ళతో మూయాలి. ప్రథమ చికిత్స చేయువాడు గట్టిగా గాలి పీల్చుకొని గాయపడిన వ్యక్తి నోరును తన నోటితో పూర్తిగా మూసి గాలిని బలంగా గాయపడిన వ్యక్తి నోటిలోనికి ఊదాలి. ఛాతీ పెద్దదైనదో, లేదో గమనించాలి. ఛాతి పెద్దదైనట్లయితే, గాయపడిన వ్యక్తి ఊపిరితిత్తులలోనికి మీరూదిన గాలి వెళ్ళినట్లు నిర్థారించుకోవాలి. ఈ పని వలన అతను గాలి పీల్చుకున్నట్లయినది. మీ నోటిని అతని నోటిపై నుండి తొలగించాలి. అప్పుడు అతని ఊపిరితిత్తులలోని గాలి బయటకు వచ్చును. ఈ పని వలన అతను గాలి వదిలినట్లయినది. ఈ విధముగ నిముషమునకు 12 సార్లు ఎంతసేపు అవసరముంటే అంత సేపు చేస్తూ అతనిని ఆస్పత్రికి తరలించాలి. దీనిని అతనికి శ్వాస తిరిగి వచ్చినప్పుడు కాని లేక ఒక వైద్యుడు అక్కడకు చేరినప్పుడు కాని లేదా ఆవ్యక్తిని ఆస్పత్రికి చేరినప్పుడు కాని విరమించవచ్చును.మీరు గాలి అతని నోటిలోనికి ఊదినప్పుడు ఛాతి పెద్దగా కాకున్న యెడల అతని శ్వాస నాళములో దిగువన ఏదో అడ్డున్నట్లు గమనించాలి. అప్పుడు అతనిని వెల్లకిల పరుండబెట్టి అతని వీపుపై 5 లేక 6 సార్లు గట్టిగా చరచి దవడను పైకి ఎత్తిపట్టి గొంతులో నున్న అన్యపదార్థాన్ని తీసి, నోటినుండి నోటి ద్వారా గాలిని ఊదాలి.నోటి నుండి ముక్కు ద్వారా కల్పిత శ్వాసను క్రింది సందర్భాలలో ఇవ్వాలి 1. క్రింది దవడ ఎముక విరిగినప్పుడు 2. పెదవులు, నోరు కాలినప్పుడు (ఆమ్లము, క్షారము త్రాగినప్పుడు) 3. వ్యక్తి నోటిలో ఉండగ కల్పిత శ్వాస చేయవలసి వస్తే నోటిపై నోరుంచి గాలి ఊదుటకు బదులుగా అతని నోటిని మూసి, మీ నోటితో అతని ముక్కును మూసి గాలిని ఊదాలి. నోటి నుండి నోరు ముక్కు ద్వారా రోగి చిన్న బిడ్డ అయితే అతని నోరు, ముక్కు చుట్టు నీనోరుంచి అతని రొమ్ముపైకి వచ్చు వరకు నెమ్మదిగా గాలిని ఊదాలి. ఈ విధముగా నిముషమునకు 20 సార్లు చేయాలి. మీ దగ్గర (అంబుబ్యాగ్) అందుబాటులో ఉన్నప్పుడు మాస్క్ ను గాయపడిన వ్యక్తి నోటిపై ఉంచి గాలి బంతిని నొక్కినప్పుడు అతని రొమ్ముపైకి వచ్చును. బంతిని వదిలినప్పుడు రొమ్ము క్రిందికి వెళ్ళి అతని ఊపిరితిత్తులోని గాలి వాల్వ్ ద్వారా బయటకు వెళ్ళును. కాలిన చోటుని అవసరమైనంతకంటే ఎక్కువ ముట్టకూడదు. ముందు చేతులను శుభ్రముగా కడుగుకొనవలెను. కాలిన గాయమును చల్లని నీటితో కడగవలెను. ఎట్టి ద్రావకములను గాయము మీద పోయవద్దు కాలిన గుడ్డలను ఊడదీయవద్దు. బొబ్బలను చిదపవద్దు. కాలినచోటును, కాలిన గుడ్డలతో సహా అంటు దోషములేని గుడ్డలతో కప్పుము. అది లేనియెడల బట్టను ఉపయోగింపవచ్చును. బొబ్బలుంటే తప్ప, కట్టుగట్టిగా కట్టాలి, బొబ్బలుంటే కొంతవదులుగా కట్టవలెను. కాలిన భాగమును తగురీతిగా కదలకుండా చేయుము. నిస్త్రాణకు చికిత్స చేయుము. ఎక్కువ కాలిన యెడల వెంటనే ఆస్పత్రికి తరలించవలెను. ఆలోగా నోటికి ఎట్టి ద్రవపదార్థమును ఇవ్వకూడదు. ఎందుకనగా ఆస్పత్రిలో అతనికి మత్తుమందు ఇవ్వలసియుండును. నాలుగు గంటల వరకు వైద్య సదుపాయం దొరకదని తెలిసిన ఎడల ఒక గ్లాసెడు నీళ్ళలో టీ స్పూనులో 4వ వంతు ఉప్పు కలిపి ఇవ్వవచ్చును. వంటసోడా దొరికితే దానిని నీటిలో కలిపి ఇవ్వవచ్చును. కొద్దిగా కాలిన ఎడల వేడి ద్రవము నియ్యవచ్చును. పలుచని టీలో కొంత చక్కెర యివ్వవచ్చును.వెంటనే వైద్యునికి కబురు పంపుము. రోగి పరిస్థితి నీకు తెలిసిన యెడల రోగ కారణమును తెలియచేయుము. వైద్య పరీక్ష కొరకు యీ క్రింది వాటిని భద్రముగా నుంచుము.అక్కడ మిగిలియున్న వస్తువులు: విషము ఫలానాదని గుర్తుంచుటకు అక్కడనున్న అట్టపెట్టె, బుడ్డి, సీసా మొదలైనవి వెదకవలెను కనుగొనవలెను. రోగి స్పృహ తప్పియున్న ఎడల – రోగిని బోరగిల పరుండబెట్టుము / బోర్లా పడుకోపెట్టుము. తలను ఒక ప్రక్కకు త్రిప్పి ఉంచుము. తలక్రింద దిండు పెట్టకూడదు. అట్లు చేయుటవలన వాంతి పదార్థము గాలి గొట్టములోనికి పోదు. నాలుక కూడా ఊపిరి మార్గమునకు అడ్డుపడదు. అవసరమైతే వెంటనే ఊపిరి సాధన చేయుటకు వీలగును. డోకు, వాంతి ఎక్కువగా ఉంటే రోగి ఒక కాలిని ముందుకు వంచి యుంచుట మంచిది. అంటే, రోగి ఒక ప్రక్కకు పరుండును. పైకి ఉన్న కాలు వంచి ఒక దిండును రొమ్ము క్రింద నుంచవలెను. ఊపిరి నీరసముగా ఆడుతుంటే, వెంటనే ఊపిరిసాధన చేయవలెను. వైద్యుడు వచ్చువరకు ఆ యత్నమును మానకూడదు. రోగి విషము మ్రింగి తెలివితో నున్నప్పుడు – మొదట వాంతి చేయించుట ద్వారా ఆ విషమును కక్కించుము. ఒక గరిటెనుగాని, రెండు వ్రేళ్ళను గొంతుకలో పెట్టి ఆడించిన, రోగికి వాంతియగును. అప్పటికిని వాంతి కాని యెడల రెండు పెద్ద గరిటెల ఉప్పును ఒక గ్లాసుడు నీళ్ళలో కలిపి త్రాగించుము. ఈ క్రింది పరిస్థితులలో వాంతి చేయించకూడదు: రోగి స్పృహ తప్పియున్నప్పుడు, రోగి పెదవులు లేక నోరు కాలియున్నప్పుడు, మరిగే ద్రావకములు పడినప్పుడు, చర్మము మీద పసుపు లేక బూడిదరంగు మచ్చ లేర్పడును. వాటిని సులభముగా గుర్తించవచ్చును. తదుపరి విషపు విరుగుడు పదార్థము ఇవ్వాలి. అట్టి పదార్థము విషమును విరిచి రోగిని అపాయస్థితి నుండి తప్పించును. ఉదా. ఘాటైన ఆసిడుకు సుద్ధ లేక మెగ్నీషియా రసము విరుగుడు. కొన్ని విషములకు ప్రత్యేక విరుగుళ్ళు ఉన్నాయి. కొన్ని యంత్రాగారాలలో ప్రత్యేక ప్రమాదములు సంభవించవచ్చును. వాటి విరుగుళ్ళు జాగ్రత్త పెట్టి యుంచుకొనవలెను . అవి ఉపయోగించవలసిన విధానమును బాగా కనబడు స్థలములో పెట్టవలెను.పిదప ఎక్కువ నీళ్ళు త్రాగించి విషము యొక్క బలమును తగ్గించుము. అట్లు చేయుటవలన హాని తగ్గును, వాంతి యగుటవలన పోయిన ద్రవము వల్ల కలిగిన నష్టమును నీళ్ళు తీర్చును. అటు పిమ్మట వ్యాధిని తగ్గించు పానీయముల నిమ్ము. ఒక గ్లాసెడు పాలు, బార్లీ నీళ్ళు, పచ్చిగ్రుడ్డు, నీటిలో కలిపిన పిండి, రోగికి యిచ్చినచో రోగము కొంత నయమగును. మీరు ప్రశాంతముగా, సంతోషముగా ఉంటే మీశిశువు కూడా అలాగే ఉంటుంది . ఆరోగ్యమైన శిశువు కొరకు అన్ని కలిసిన పౌష్ఠిక ఆహారం ఎక్కువ పాలు, పండ్లు, ఆకు కూరలు, పప్పు, మాంసము, చేపలు తీసుకోవాలి డాక్టర్ పై విశ్వాసం ఉంచి వారి సలహా పాటించండి, స్వంతంగా మందులు వాడకూడదు. అనవసరమైన భయం ప్రసవ సమయాన్ని కష్టతరము చేస్తుంది, గర్భము, ప్రసవము సృష్టిలో సర్వసాధారణ విషయాలని గుర్తుంచుకోండి. పొగత్రాగడము, మద్యపానము, ఎక్స్-రే తీయించుకోవడం చేయకండి. మొదటి ఆరు నెలలూ నెలకొకసారి, ఏడు, ఎనిమిది నెలల్లో నెలకు రెండుసార్లు, తొమ్మిదవ నెలలో వారానికొకసారి వైద్య పరీక్ష అవసరం. ఈ క్రింది పరిస్థితుల్లో వెంటనే డాక్టర్ ని సంప్రదించండి :- 1) రక్తస్రావము2) ఉమ్మనీరు పోవడం3) శిశువు కదలిక తగ్గినట్టుగాని, ఆగినట్టుగాని అనిపించినపుడు4) నొప్పులు రావడం ఎత్తు మడమల చెప్పులు వాడకండి. కుదుపులు కలిగేటట్లు ప్రయాణము చేయకండి. బిడ్డకు చనుపాలు ఇవ్వడానికి వీలుగా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చివరి 3 నెలలలో డాక్తర్ సలహా అడగండి. మొదటి మూడు నెలలు, చివరి 2 నెలలు, ఈక్రింది పేర్కొన్నవి చేయవద్దు :-1) దూర ప్రయాణము2) కారు, స్కూటర్ నడపడం.3) అతిగా సంభోగము సుఖప్రసవానికి - బ్రీతింగ్ వ్యాయామాలు, శరీర బరువు పెరగకుండా ఇతర వ్యాయామము డాక్టర్ సలహా ప్రకారము చెయ్యండి. క్రమబద్దమైన విశ్రాంతి అనగా : రాత్రి 8 - 10 గంటలు, మధ్యాహ్నం 1 గంట అవసరము. నిద్ర పోవునపుడు ఒక ప్రక్కకు (వీలైతే ఎడమ వైపు) పడుకోవడం మంచిది. ధనుర్వాతం బారినుండి రక్షణకొరకు టి.టి. ఇంజక్షన్స్ తీసుకోండి. కుటుంబనియంత్రణ సలహా కొరకు ప్రసవమైన 6 వారాల తర్వాత డాక్టర్ ని సంప్రదించండి.ప్రతి ఏడాది సెప్టెంబర్‌ 2వ శనివారం రోజున ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం ను నిర్వహిస్తారు.