తిక్కా ఆకుమచ్చ తెగులు https://te.wikipedia.org/wiki/%E0%B0%A4%E0%B0%BF%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B0%BE_%E0%B0%86%E0%B0%95%E0%B1%81%E0%B0%AE%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A_%E0%B0%A4%E0%B1%86%E0%B0%97%E0%B1%81%E0%B0%B2%E0%B1%81 వేరుశనగ పంట లో ముఖ్యంగా తిక్కా ఆకుమచ్చ తెగులు పంటను ఆశించి తీవ్రంగా నష్టపరుస్తాయి. ఈ తెగులు సర్కొస్పోర అరచిడికోల అనే శిలీంద్రం ద్వారా పంటకు వ్యాపిస్తుంది. ఈ తిక్క ఆకుమచ్చ తెగులు 2 రకాలు. వేరుశెనగ పైరుకు ముందుగా ఈ ఆకుమచ్చ తెగులు సోకుతుంది. కాబట్టి దీనిని ముందుగా వచ్చే ఆకు మచ్చ తెగులు అంటారు . పైరుపై ఈ తెగులు విత్తిన 30 రోజులు తరువాత కనిపిస్తుంది. మొదట ఆకుల పైన చిన్న చిన్న మచ్చలు ఏర్పడును . ఇవి పెరిగి గుండ్రటి 1-10 మిల్లీ మీటర్ల ల వ్యాసం గల గోధుమ వర్ణంగల నల్లటి మచ్చలు ఏర్పడతాయి . ఈ మచ్చ చుట్టూ పసుపు పచ్చని వలయం ఉన్న మచ్చలు ఆకుల పై భాగాన నిర్దిష్టంగా కనిపించును . ఈ శిలీంద్రపు బీజాలు మచ్చపై భాగాన పెరగడం చేత మచ్చలకు నలుపు వర్ణం ఏర్పడును . ఈ మచ్చలు ఆకు అంతటా వ్యాపించి ఆకులు ఎండి రాలిపోవును . ఈ శిలీంధ్రం ఆకు తొడిమె , కాండపు భాగాన్ని కూడా ఆశిస్తుందిి. ఈ తెగులు పంట విత్తిన 40-45 రోజుల తరువాత వేరుశనగ పైరు పై ఈ తెగులు లక్షణాలు కనపడతాయి . ఆకులపైన నిర్దరితమైన చిన్న చిన్న మచ్చలు ఏర్పడి అవి పెరిగి గుండ్రంగా మారి నలుపు లేదా ముదురు గోధుమ వర్గానికి మారును . సామాన్యంగా ఈ మచ్చల చుట్టూ పసుపు పచ్చని పలయాలు ఉండవు . ఆకు, అడుగు భాగాన శిలీంధ్ర బీజాల పెరుగుదల వలన నల్లటి మచ్చలు అగుపడును . ఈ మచ్చలలో శిలీంద్రబీజాల వలయాలుగా ఉండును . ఈ శిలిద్ధం ఆకు తొడిమె , కాండాన్ని కూడా ఆశించును . ఈ ఆకు మచ్చ తెగులు వాతావరణంలో అధిక తేమ కలిగి ఉండి ఉష్ణోగ్రత 26-30సెం.గ్రే , ఉన్నపుడు మరియు వేరుశనగ తరువాత వేరుశనగ వేసినప్పుడు , తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఇది విత్తనాలలోను , పంట అవశేషాలలో జీవిస్తుంది . గాలి ద్వారా ఒక మొక్క నుండి ఇంకో మొక్కకు వ్యాప్తి చెందుతుంది . 1.ఆరోగ్యవంతమైన విత్తనానాన్ని ఎన్నుకోవాలి. 2.విత్తనం విత్తేముందు బీజామృతం తో విత్తనశుద్ధి చేయాలి. 3.తెగులును తట్టుకొనే రకాలైన వేమన , నవీన్ , తిరుపతి - 3 వంటి రకాలను విత్తుకోవాలి 1.6లీ. పుల్లటి మజ్జిగ ను 100 లీ. నీటిలో కలిపి ఎకరా పొలం లో పిచికారి చేయాలి. 2.4లీ. శొంఠి పాల కషాయాన్ని 200 లీ. నీటికి కలిపి ఎకరా పొలం లో పిచికారి చేయాలి. 1.కార్బండిజం , మాంకోజెట్ ను పొలం పై పిచికారి చేయాలి. "తెగుళ్ల నివారణ". వ్యవసాయ శాఖ తెలంగాణ. "వేరు శనగకు వైరస్ తెగులు". వివిధ పంటలకు వచ్చే చీడ పీడలు వాటి యాజమాన్య పద్ధతులు. ఏకలవ్య ఫౌండేషన్ సేంద్రియ వ్యవసాయం.