నోటి పుండు https://te.wikipedia.org/wiki/%E0%B0%A8%E0%B1%8B%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%81%E0%B0%82%E0%B0%A1%E0%B1%81 నోటి పుండు (నోటి పూత), అనేది నోటి శ్లేష్మ పొరపై ఏర్పడే పుండు. పెదవుల మీద లేదా మూతి చుట్టూ పగలటం ద్వారా ఇది వస్తుంది. నోటి పుండ్లు ఒక్కొక్కటిగా ఏర్పడవచ్చు, ఒకటికంటే ఎక్కువగా కూడా రావచ్చు. ఇవి చాలా అరుదుగా నోటి క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు. రెండు సాధారణ నోటి పుండ్లలో నంజు కురుపులు, జలుబు పుండ్లు లేదా జ్వరం బొబ్బలు ఉన్నాయి. పెదిమ చుట్టూ జలుబు పుళ్ళు సామాన్య సలిపి వైరస్ ద్వారా వస్తాయి. ఇది అంత ప్రమాదకరమైనది కాదు. నోటి పుండ్లు రావడమనేది తరచుగా నొప్పి, అసౌకర్యాన్ని కలిగిస్తుంది. వైద్యం చేసేటప్పుడు ఆమ్ల, చక్కెర, ఉప్పగా లేదా కారంగా ఉండే ఆహారం, పానీయాలను తీసుకోవద్దు. పదార్ధాలలో ఉన్న రసాయనాల వల్ల (రసాయనాల వాసన, రసాయనాల ఘాటు వల్ల) నోటి పుండ్లయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ పుండ్లు ఒక మిల్లీమీటర్ నుండి కొన్ని సెంటీమీటర్ల వరకు పెరుగుతాయి. నోటిలోపల చర్మంపై, గొంతులోపల, దవడల చర్మంపై ఇవి వస్తాయి. బ్యాక్టీరియల్ జింజివోస్టోమాటైటిస్: నోటిలోపల, చిగుళ్లకు వచ్చేది. దీనివలన నోటిలోపల వాపు, పుండ్లు వస్తాయి. హెర్పిస్ సింప్లెక్స్ వైరల్ ఇన్‌ఫెక్షన్: ఇది వైరల్ ఇన్‌ఫెక్షన్. నోటిలోపల, పెదవుల దగ్గర నీటి పొక్కులు వస్తాయి. ఇల్ ఫిట్టింగ్ డెంచర్స్ ఆర్ షార్ప్ టీత్: దంతాలు వంకరగానూ, పదునుగానూ ఉండి అవి నోటి లోపల గుచ్చుకోవడం వల్ల చర్మకణాలకు గాట్లుపడి పుండ్లు వస్తాయి. శరీరంలో వచ్చే మార్పులు ఈ పుండ్లు ఏర్పడడానికి కారణాలవుతాయి. నోటి లోపలి చర్మానికి దంతాలు గుచ్చుకోవడం, బ్రష్‌ చేసేటప్పుడు టూత్ బ్రష్ తగిలి గాయం కావడం, బాగా వేడి చేసినప్పుడు, నోటిని శుభ్రంగా ఉంచుకోకపోవడం, విటమిన్స్‌ లోపం, మానసిక ఒత్తిడి, నిద్ర సరిగా లేకపోవడం, డీహైడ్రేషన్‌ టూత్ పేస్టు, మౌత్ వాష్‌లలో ఉండే రసాయనాలు కొవ్వు పదార్థం, ఇనుము, ఫోలిక్ ఆమ్లం లేదా విటమిన్ బి లోపం వైరల్ ఇన్ఫెక్షన్ (జలుబు) జీర్ణశయాంతర ప్రేగులకు సంబంధించిన వ్యాధి నోటి శుభ్రతకు శ్రద్ధ చూపకపోవడం నోటి బాక్టీరియా అలెర్జీ మలబద్దకం ధూమపానం చేసేవారు ఒక్కసారిగా ధూమపానం మానేయడం పోషకాహారలోపం, రక్తహీనత కారణంగాచాలా అల్సర్లు ఎటువంటి చికిత్స లేకుండా పూర్తిగా నయం అవుతాయి. మంచి నోటి పరిశుభ్రత, క్రిమినాశక మౌత్ వాష్ లేదా స్ప్రే (ఉదా. క్లోర్‌హెక్సిడైన్ ) వాడటం వల్ల దీనిని నివారించవచ్చు. అనాల్జేసిక్ (ఉదా. బెంజిడమైన్ మౌత్ వాష్) వాడకం నొప్పిని తగ్గిస్తుంది. మంటను తగ్గించడానికి క్రీములు, స్టెరాయిడ్ మందులను పుండు మీద రాయడం, పుక్కిలించడం చేయవచ్చు. నోటి పుండ్లు ఉన్నవారు వేడి, కారంగా ఉండే ఆహారాన్ని తినకూడదు. విటమిన్ బీ12 ఉన్న మాత్రలు వాడాలి. విటమిన్ సి అధికంగా ఉండే నారింజ, జామ, స్ట్రాబెర్రీ, బొప్పాయి లాంటి పండ్లు తీసుకోవడం ద్వారా, విటమిన్‌ సి సప్లిమెంట్లను టాబ్లెట్స్‌ లేదా పిల్స్‌ రూపంలో తీసుకోవడం ద్వారా ప్రతిరోజూ పెరుగు తినడం లేదా రెండు మూడు గ్లాసుల మజ్జిగ తాగడం వల్ల చెడు బాక్టీరియా పోయి నోటి పుండు తగ్గుతుంది. దంతాలు గుచ్చుకోవడం ద్వారా వచ్చిన పుండుకు దంత వైద్యుడి చేత పంటిని సరి చేయించుకోవాలి. యాంటీ హిస్టమైన్, అనీస్తటిక్, యాంటాసిడ్, కార్టికో స్టెరాయిడ్స్ వంటి పూత ఉంటుంది. కొన్నింటికి యాంటీబయాటిక్స్‌తోపాటు ఓరల్ స్టెరాయిడ్స్, మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లు వాడితే ఉపశమనం ఉంటుంది. వైద్య లేదా దంత సలహా తీసుకోవటానికి నోటి పుండ్లు ఒక సూచనగా భావించవచ్చు. నోటి శ్లేష్మచర్మ నిర్లక్ష్యం చాలామంది జీవితాల్లో వివిధ సమయాల్లో ప్రభావితం చేస్తుంది. పుండుకు కారణమైన ఇన్‌ఫెక్షన్ నోరంతా వ్యాపించి కొన్ని సందర్భాల్లో గొంతు వరకు వ్యాపించే అవకాశం ఉంది.