పసుపు ఆకుమచ్చ తెగులు https://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B0%B8%E0%B1%81%E0%B0%AA%E0%B1%81_%E0%B0%86%E0%B0%95%E0%B1%81%E0%B0%AE%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A_%E0%B0%A4%E0%B1%86%E0%B0%97%E0%B1%81%E0%B0%B2%E0%B1%81 ఆకుమచ్చ తెగులు పసుపు పంట చివరి దశలో అంటే నవంబర్ , డిసెంబర్ మాసాలలో ఎక్కువగా కనబడుతుంది. 1.గాలిలో ఎక్కువ తేమ , తక్కువ ఉష్ణోగ్రత ఉండటం. 2.పంటలో సూక్ష్మ వాతావరణం ఎక్కువ తేమగా ఉండటం. 3.పంట అవశేషాలు పొలంలో,పొలం చుట్టూ ఉండటం. మొదట ఆకుల పై చిన్న చిన్న పసుపు రంగు చుక్కలు ఏర్పడతాయి.క్రమేపి ఇవి చిన్న చిన్న గోధుమ రంగు మచ్చలుగా మారుతాయి. తెగులు తీవ్రమైతే మచ్చలు ఎక్కువై ఆకు మాడిపోతుంది. దుంపలు,కొమ్మలు ఎదుగుదల తగ్గి దిగుబడి,నాణ్యత తగ్గిపోతాయి. 1.విత్తనశుద్ధి చేయాలి. 2.తెగులుతో మచ్చలు ఉన్న,ఎండిన ఆకులను తొలగించి రాల్చి వేయాలి. 1.ఆవు మూత్రాన్ని మట్టి కుండలో తీసుకుని ఒకవారము పులియా నివ్వాలి.దీనిని పంటపై పిచికారి చేసి శిలీంధ్ర తెగుళ్ళను నివారించవచ్చు . 2.ఒక లీటరు ఆవు మూత్రాన్ని ఒక లీటరు మజ్జిగ,8లీటర్ల నీటితో కలిపిన మిశ్రమాన్ని పంట పైన పిచికారీ చేసి శిలీంద్ర తెగులని నివారించవచ్చు. వివిధ పంటలకు వచ్చే చీడపీడలు వాటి యాజమాన్య పద్ధతులు. కరదీపిక.