ఫారిన్ యాక్సెంట్ సిండ్రోమ్ https://te.wikipedia.org/wiki/%E0%B0%AB%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A8%E0%B1%8D_%E0%B0%AF%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D%E0%B0%B8%E0%B1%86%E0%B0%82%E0%B0%9F%E0%B1%8D_%E0%B0%B8%E0%B0%BF%E0%B0%82%E0%B0%A1%E0%B1%8D%E0%B0%B0%E0%B1%8B%E0%B0%AE%E0%B1%8D ఫారిన్ యాక్సెంట్ సిండ్రోమ్ అనేది రోగి విదేశీ యాస లేదా భాష మాట్లాడి అర్థంచేసుకోగల స్థితి సాధించే అరుదైన వైద్య స్థితి. సాధారణంగా బ్రెయిన్ యాక్సెంట్ సిండ్రోమ్ బ్రెయిన్ స్ట్రోక్ ఫలితంగా వస్తూంటుంది, అయితే తలకు తగిలే బలమైన గాయం వల్ల, మైగ్రేన్ వల్ల లేదా డెవలప్మెంటల్ సమస్యల వల్ల కూడా రావచ్చు. ఈ స్థితి మొట్టమొదట 1907లో నమోదచేయబడింది, 1941 నుంచి 2009 వరకూ 69 నమోదైన కేసులున్నాయి. వక్రీకరించిన ఆర్టిక్యులేటరీ ప్లానింగ్ కారణంగా ఈ సమస్య తలెత్తుతుంది. పలు పత్రికలు ఈ సమస్య వల్ల దగ్గరలోని యాస, భాష వచ్చినట్టు రాస్తున్నా, ఫారిన్ యాక్సెంట్ సిండ్రోమ్ ఉన్నవారికి ప్రత్యేకించిన విదేశ యాస గానీ, మరే విదేశీభాషల్లో ధారాళంగా మాట్లాడే శక్తికానీ రాదు. 2010లో వెలుగుచూసిన ఓ నిర్ధారితం కాని వార్తాకథనం ప్రకారం క్రోటియన్ భాషా వ్యవహర్త కోమా నుంచి బయటకు రాగానే జర్మన్ భాష ధారాళంగా మాట్లాడేశక్తి కలిగింది, కానీ మెదడుకు కలిగిన గాయం తర్వాత రోగి విదేశీభాష మాట్లాడే శక్తి పెరిగినట్టు నిర్ధారితమైన కేసు లేదు. పిల్లల్లో ఫారిన్ యాక్సెంట్ సిండ్రోమ్ ఉన్నవారి నుంచి వారి తోబుట్టువులో, స్నేహితులో వారి కొత్త యాసను అందిపుచ్చుంకుంటున్నారన్న కేసులు నమోదయ్యాయి.