ఫైలేరియా https://te.wikipedia.org/wiki/%E0%B0%AB%E0%B1%88%E0%B0%B2%E0%B1%87%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE ఫైలేరియా బోదకాలు వ్యాధిని కలిగించే సూక్ష్మజీవి పేరు. ఇది పెద్దగా, దారం లాగా ఉండే పురుగు. ఇందులో ఆడవి 10 సెం.మీ పొడవు, 0.2 మి.మీ వెడల్పు ఉంటాయి. మగవి మాత్రం 4 సెం.మీ పొడవు కలిగి ఉంటాయి. ఇవి రోజుకు 50 000 మైక్రోఫిలేరియాను ఉత్పత్తి చేస్తాయి. మైక్రోఫిలేరియా 250-300 µm (మైక్రోమీటరు) పొడవు, 8 సెం.మీ వెడల్పు ఉండి, పరిధీయ రక్తంలో తిరుగుతుంది. ఇవి మైక్రోఫిలేరియాగా 12 నెలల వరకు జీవించవచ్చు. ఇందులో మగ ఫురుగులు పెరగడానికి 6 నుండి 12 నెలల సమయం పడుతుంది, 4 నుంచి 6 సంవత్సరాలు జీవించగలవు. ఉష్ణమండల ఆఫ్రికా, దక్షిణ అమెరికాలోని భాగాలతో పాటు, ఆగ్నేయ ఆసియాలో, బ్రూజియా మలాయి, దక్షిణ, ఆగ్నేయ ఆసియాలో విస్తరిస్తున్న ఫైలేరియా ( వుచెరెరియా బాన్‌క్రాఫ్టి) అలాగే బ్రూగియా తిమోరి (తైమూర్ ద్వీపంలో కనిపిస్తుంది ) శోషరస ఫైలేరియోసెస్ యొక్క కారకాలు. స్థానిక ప్రాంతాలలో ఫైలేరియోసెస్ యొక్క ప్రాబల్యం ఎక్కువగా ఉంది, రెండవ దశాబ్దంలో స్థానిక జనాభాలో 50% వరకు వరకు చేరుకుంటుంది. మైక్రోఫిలేరియా దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది. దీని ప్రభావం ప్రపంచ ఆరోగ్య సంస్థ 1997 లో శోషరస ఫైలేరియల్ పరాన్నజీవి వుచెరెరియా బాన్‌క్రాఫ్టి ఒక నెమటోడ్ పరాన్నజీవితో మానవ సంక్రమణ అని చెప్పింది. ఎలిఫాంటియాసిస్‌కు కారణమయ్యే దోమల ద్వారా,మగ జననేంద్రియాల వికృతీకరణ,ఉష్ణమండలంలో తీవ్రమైన అడెనోలిమ్ఫాంగిటిస్,ఉపఉష్ణమండల ఆఫ్రికా, దక్షిణ ఆసియా, పసిఫిక్, లాటిన్ అమెరికా దేశాలలో నిర్ములించవచ్చని, దీనికి అందుబాటులో ఉన్న ప్రజారోగ్య సౌకర్యాలను వాడుకోవడం, ఈ తీర్మానానికి ప్రతిస్పందనగా వీటి నిర్మూలనకు ప్రపంచం ఆరోగ్య సంస్థ 2000 సంవత్సర ములో పిలుపును ఇచ్చింది. ఈ వ్యాధికి ప్రస్తుతం మూడు యాంటెల్‌మింటిక్ మందులను ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసింది. శోషరస ఫైలేరియాసిస్‌ను తొలగించడానికి: డైథైల్కార్బమాజైన్, ఐవర్‌మెక్టిన్, అల్బెండజోల్. ఈ మందులు సరసమైనవి, డైథైల్కార్బమాజైన్ మోతాదుకు 1 శాతం కన్నా తక్కువ ఖర్చు అవుతుంది, ఈ మందుల తయారీ కి ఐవర్‌మెక్టిన్, అల్బెండజోల్‌ను, మెర్క్, గ్లాక్సో స్మిత్‌క్లైన్ విరాళములను ఇస్తారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.