బెణుకు https://te.wikipedia.org/wiki/%E0%B0%AC%E0%B1%86%E0%B0%A3%E0%B1%81%E0%B0%95%E0%B1%81 ఆకస్మికంగా కాలుజారుట వలన, తమాయించుకోవడానికి ప్రయత్నించడంలో స్నాయువు లేదా సంధి కండరాలు (Ligaments) బాగా లాగబడడం లేదా మలపడడం గాని జరిగి వాచిపోయి తీవ్రమైన నొప్పి కలుగుతుంది. దీనినే బెణుకులు (Sprains) అంటారు. ఇంకా ప్రమాదమైన పరిస్థితులలో ఈ సంధి కండరాలు పూర్తిగా తెగిపోవచ్చును. అటువంటి పరిస్థితులలో శస్త్రచికిత్స అవసరమవుతుంది. బెణుకులు ఎక్కువగా మడమ, మోకాలు, మోచేయి, మణికట్టు కీళ్ళకు జరుగుతుంది. బెణుకుని ఆంగ్లంలో స్పెరియిన్ అని పిలుస్తారు. స్పెరియిన్ తీవ్రత బట్టి మూడు రకాలుగా వర్గీకరిస్తారు. మొదటి డిగ్రీ - సంధి కండరాలు లాగబడ్డాయి, కాని చాలా ఎక్కువగా లాగబడలేదు, తెగిపోలేదు. రెండవ డిగ్రీ - సంధి కండరాలు బాగా లాగబడ్డాయి. చాలా కొద్ది భాగంలో కండరాలు తెగిపోవచ్చు కూడా. ఈ రకం బెణుకు అత్యంత నొప్పిని ఇస్తుంది మూడవ డిగ్రీ - సంధి కండరాలు చాలా వఱకు తెగిపోయాయి. ఈ రకం బెణుకుకి శస్త్ర చికిత్స అవసరం. చాలా తీవ్రత కలిగిన ఈ బెణుకు వల్ల నొప్పి తీవ్రత తక్కువగా ఉంటుంది.చికిత్సని ప్రధానంగా RICE అనే ఆంగ్ల పదంలో గుర్తు పెట్టుకొని చేస్తారు. ఏ పనిచేస్తున్నప్పుడు బెణికిందో ఆ పని మళ్ళీ చేయవద్దు. Rest- విశ్రాంతి-నొప్పిపెడుతున్న భాగానికి పూర్తి విశ్రాంతి అవసరం. Ice- ఐస్ మంచుముక్కలను ఆ భాగం చుట్టూ మధ్యలో విరామంతో పెడుతుంటే నొప్పి త్వరగా తగ్గుతుంది. Compression- కంప్రెషన్ బాండేజీ గుడ్డతో గట్టిగా చుట్టూ కట్టుకట్టి ఎత్తులో ఉంచండి. Elevation- ఆ భాగాన్ని ఎత్తులో ఉంచడం