రక్తహీనత https://te.wikipedia.org/wiki/%E0%B0%B0%E0%B0%95%E0%B1%8D%E0%B0%A4%E0%B0%B9%E0%B1%80%E0%B0%A8%E0%B0%A4 రక్తహీనత అనేది శరీరంలో రక్తం తక్కువగా ఉండటం ద్వారా వచ్చే వ్యాధి. ఇది ఎక్కువగా మంచి బలమైన ఆహారం తీసుకోకపోవడం ద్వారా వస్తుంది. చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, మలేరియా లాంటి తీవ్ర జ్వరాలు, వ్యాధులు కలిగిన వారిలో ఈ రక్త హీనత ఎక్కువగా కనిపిస్తుంది. ప్రధాన వ్యాసం హీమోగ్లోబిన్హీమోగ్లోబిన్ లేదా హిమోగ్లోబిన్ లేదా రక్తచందురం అనేది అన్ని సకశేరుకాల (చేప కుటుంబం చన్నిచ్త్యిడే మినహా) యొక్క ఎర్ర రక్త కణాలలో ఇనుమును కలిగి ఆక్సిజన్ రవాణా చేసే మెటల్లొప్రోటీన్ (లోహ ప్రోటీన్), అలాగే కొన్ని అకశేరుకాల యొక్క కణజాలం. రక్తంలో హీమోగ్లోబిన్ శ్వాసకోశ అవయవాల (ఊపిరితిత్తులు లేదా మొప్పలు) నుండి మిగిలిన శరీరానికి (ఉదా: కణజాలం) ఆక్సిజన్‌ చేరవేస్తుంది. అక్కడ ఇది ఆక్సిజన్‌ను జీవక్రియ అనే ప్రక్రియలో జీవి యొక్క విధులకవసరమైన శక్తి కొరకు శక్తిని అందించడానికి వాయుసహిత శ్వాసక్రియను అనుమతించడానికి విడుదల చేస్తుంది. హీమోగ్లోబిన్ అనే ఈ పదార్థము కారణంగానే మానవ శరీరంలోని రక్తం ఎర్రగా ఉంటుంది. శరీరంలో రక్తం ప్రయాణిస్తున్న సమయంలో ఊపిరితిత్తులవద్ద హీమోగ్లోబిన్ ప్రాణవాయువును పీల్చుకొని శరీరం మొత్తానికి ప్రాణవాయువును సరఫరా చేస్తూ ఉంటుంది. అలా హీమోగ్లోబిన్ ద్వారా శరీర అవయవాలలోని విడిపోయిన కణజాలాలకు ప్రాణవాయువు వెళుతుంది. శరీరంలో హీమోగ్లోబిన్ శాతం తగినంత లేకపోతే వారు రక్తహీనతతో బాధపడుతున్నట్లు లెక్క. అందువలన రక్తంలో హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచుకొనుటకు ఐరన్ శాతం ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. మాంసం, చేపలు, గ్రుడ్లు వంటి జంతు సంబంధమైన ఆహారపదార్థాలను శరీరం త్వరగా జీర్ణించుకొని ఐరన్ ను స్వీకరించగలుగుతుంది. శాకాహార సంబంధమైన ఆకుకూరలు, ఎండుఫలాలు, పండ్లు, కాయగూరలలో ఐరన్ (ఇనుము) తగినంత ఉన్నప్పటికి శరీరం వాటిని పూర్తిగా జీర్ణించుకోలేకపోవటంతో వాటి నుండి శరీరం తగినంత ఐరన్ ను స్వీకరించలేకపోతుంది. అయితే శాఖాహారాన్ని అధికంగా తీసుకోవటం ద్వారా శరీరానికి కావలసినంత ఐరన్ పొందవచ్చు, తద్వారా రక్తంలో తగినంత హీమోగ్లోబిన్ శాతం ఏర్పడి రక్తహీనత భారీ నుండి తప్పించుకోవచ్చు. ఒక వ్యక్తి తన సాధారణ ఆరోగ్య పరిస్థితికి భిన్నంగా మార్పు సంభవించిందని భావించినప్పుడు, ముఖ్యంగా రక్తహీనతకు గురవుతున్నానని భావించినప్పుడు ఎర్రరక్తకణాలు తగినన్ని ఉన్నాయా, వాటిలో హీమోగ్లోబిన్ శాతం తగినంత ఉన్నదా, లేదా అని క్లినికల్ పరీక్షల ద్వారా తెలుసుకోవాలి. హీమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉన్నట్లయితే హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచుటకు అవసరమైన ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలి.