లింఫోమా https://te.wikipedia.org/wiki/%E0%B0%B2%E0%B0%BF%E0%B0%82%E0%B0%AB%E0%B1%8B%E0%B0%AE%E0%B0%BE లింఫోమా అనబడే ఈ కేన్సర్ తెల్లరక్తకణాలలోని లాసికాణువు లేదా లింఫోసైట్లలలో జన్యు మార్పు సంభవించి, అవి నియంత్రణ లేకుండా విభజించడం వల్ల ఏర్పడుతుంది. ఇది శరీరములోని శోషరస నాళము, ప్లీహము, ఎముక మజ్జ, రక్తము, ఇతర భాగాలలో ఏర్పడవచ్చును. ఇది సాధారణంగా కణుపు వలె ఏర్పడును. లింఫోమాలు చాలా రకాలున్నాయి. ఒక్కో రకానికి ఒక్కో విధమైన చికిత్స చేస్తారు. ముఖ్యంగా హాడ్జ్కిన్స్ లింఫోమా లేదా నాన్-హాడ్జ్కిన్స్ లింఫోమాగా విభజిస్తారు, వీటిలో మరల మరెన్నో ఉప జాతులున్నాయి. శోషరసగ్రంథులువాచియుండుట. జ్వరం. రాత్రి ఉక్కపోత. బరువు తగ్గుట. ఆకలి వేయకపోవడము. శ్వాసకోశ సమస్యలు. దురదలులింఫోమా ను నిర్దారణకు జీవాణుపరీక్ష (బయాప్సి) చెయ్యవలసి వుంటుంది. అనగా రోగి శరీరములోని గడ్డ నుండి కొంత భాగమును తీసి సూక్ష్మదర్శిని సహాయముతో చూచి నిర్ధారణ చెయ్యాలి. అలా ప్రథమ నిర్ధారణ చేసాక, మరికొన్ని పరీక్షలు చేయవలసి ఉంటుంది. వాటిలో ముఖ్యమైనవి ఇమ్యునోఫీనోటైపింగ్ పరీక్ష (Immunophenotyping) ఫ్లో సైటోమెట్రీ పరీక్ష (Flow cytometry) ఎఫ్.ఐ.ఎస్.హెచ్ పరీక్ష (FISH testing)పై పరీక్షల సహాయముతో లింఫోమాను వర్గీకరించి, అందుకు తగిన చికిత్స చేస్తారు. వీటిలో ముఖ్యముగా వైద్యులు చూచునది హాడ్జ్కిన్స్ లింఫోమానా లేక మరో రకమా. లింఫోమా కణము టి లింఫోసైట్కు చెందినదా లేక బి లింఫోసైట్కు చెందినదా. ఏ అవయవములో ఏర్పడినది.సాధారణంగా హాడ్జ్కిన్స్ లింఫొమా లేదా నాన్-హాడ్జ్కిన్స్ లింఫొమాగా విభజిస్తారు. హాడ్జ్కిన్స్ లింఫోమా మిగతా వాటిక్కనా చాలా భిన్నమైనది. ఇందులో రీడ్-స్టెర్న్‌బర్గ్ కణము (Reed–Sternberg cell) వుంటుంది. హాడ్జ్కిన్స్ లింఫోమా కానివి ఈ కోవకు చెందును. నాన్ హాడ్జ్కిన్స్ లింఫోమా రకాల పట్టిక లింఫోమా వైద్యము చేయుటకు అది ఏ దశలో ఉందో తెలుసుకొని దానికి తగ్గటుగా చికిత్స అందచేయబడును. లింఫోమా మొదటి దశ నుండి నాల్గవ దశ వరకు విభజించవచ్చును. మొదటి దశలో లింఫోమా నిర్బంధములోనుండును, ఇది ప్రమాదకరమైనది కాదు. నాల్గవ దశలో లింఫోమా ఇతర అవయవాలకు వ్యాపిస్తుంది, ఇది చాలా ప్రమాదకరము కానీ సత్వరముగా చికిత్స అందించినచో నయమగును. ఒక్కో రకము లింఫోమాకు వేరువేరుగా చికిత్స అందించాలి. రోగి యొక్క వయసు, లింఫోమా దశ, వచ్చిన అవయవము వంటి వాటిని దృష్టిలో పెట్టుకుని రేడియోధార్మిక చికిత్స, కీమో థెరపి వంటివాటితో చికిత్స చేయబడును. ప్రతి రకము లింఫోమాలను హై-గ్రేడు లింఫోమా, లో-గ్రేడు లింఫోమాగా విభజిస్తారు. హై-గ్రేడు లింఫోమాలు చాలా వేగముగా వ్యాప్తి చెందును, చికిత్స ఇవ్వని పక్షంలో కొద్ది రోజులలోనే రెండింతలుగా పెరుగుతూ పోతాయి, కానీ ఈ రకము లింఫొమాలు మందులకు బాగా లొంగుతాయి. సరియైన చికిత్సతో హై-గ్రేడు లింఫొమాలను నయం చేయవచ్చును. లో-గ్రేడు లింఫోమాలు చాలా నిదానంగా వ్యాప్తి చెందును, చికిత్స ఇవ్వని పక్షములోకూడా రోగి చాలా కాలము పాటు సాదారణ జీవితం గడుపతారు. కానీ ఇవి మందులకు అంతగా లొంగదు. ఆంగ్ల వికీలో వ్యాసం ఈ-మెడిసిన్ :