2020 వేసవి పారాలింపిక్ క్రీడలలో భారతదేశం https://te.wikipedia.org/wiki/2020_%E0%B0%B5%E0%B1%87%E0%B0%B8%E0%B0%B5%E0%B0%BF_%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF%E0%B0%82%E0%B0%AA%E0%B0%BF%E0%B0%95%E0%B1%8D_%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%A1%E0%B0%B2%E0%B0%B2%E0%B1%8B_%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A4%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B0%82 2020 వేసవి పారాలింపిక్ క్రీడలు జపాన్ దేశంలోని టోక్యో నగరంలో 2021 ఆగస్టు 24 నుండి సెప్టెంబర్ 5 వరకు నిర్వహించారు. భారత్ అధికారికంగా 1968 నుండి వేసవి పారాలింపిక్ క్రీడలలో భాగమైనప్పటికీ 1984 నుండి భారత అథ్లెట్లు చురుకుగా పాల్గొంటున్నారు. 2020 వేసవి పారాలింపిక్స్ భారత దేశానికి అత్యంత విజయవంతమైనవిగా నిలిచాయి, 5 స్వర్ణాలు 8 రజతాలు 6 కాంస్యాలు (మొత్తం 19) పతకాలతో ప్రపంచంలో భారత్ 24వ స్థానంలో నిలిచింది.