ఉలిపిరి కాయలు https://te.wikipedia.org/wiki/%E0%B0%89%E0%B0%B2%E0%B0%BF%E0%B0%AA%E0%B0%BF%E0%B0%B0%E0%B0%BF_%E0%B0%95%E0%B0%BE%E0%B0%AF%E0%B0%B2%E0%B1%81 ఉలిపిరి కాయలు (Wart) ఒక విధమైన వైరస్ వలన కలిగే అంటు వ్యాధి. ఇవి చిన్న పొక్కులు, లేదా కాయల మాదిరిగా ఎక్కువగా చేతులు, పాదాల మీద, మరి ఇతర ప్రదేశాలలో కనిపిస్తాయి. ఇవి మానవ పాపిల్లోమా వైరస్ (Human Papilloma Virus-HPV) అనే వైరస్ వలక చర్మం మీద ఒక దగ్గర నుండి మరొక దగ్గరికి వ్యాపించే ప్రమాదం ఉంటుంది. అలాగే తువ్వాళ్ళు మొదలైన గృహోపకరణాల ద్వారా, రతి ద్వారా ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది. కొన్ని కాయలు కొంతకాలం తర్వాత రాలిపొవచ్చును, మళ్ళీ తిరిగి వస్తాయి.