హర్ప్‌‌స్ జొస్టర్ https://te.wikipedia.org/wiki/%E0%B0%B9%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AA%E0%B1%8D%E2%80%8C%E2%80%8C%E0%B0%B8%E0%B1%8D_%E0%B0%9C%E0%B1%8A%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D Herpes Zoster (హెర్పెస్ జోస్టర్, తెలుగు: కంచిక), శింగెల్స్ అని పిలుస్తారు. చర్మం పైన దద్దుర్లు, బొబ్బలు శరీరం ఎదో ఒకే ప్రాతంలో, ఒకే ప్రక్కను ( కుడి లేదా ఎడమ ) రావటం దీని ప్రదాన లక్షణం. varicella zoster virus (VZV) చిన్నప్పుడు పిల్లల్లో చికెన్ పాక్స్ ( అమ్మవారు ) రూపంలో వచ్చి తగ్గిపోతుంది. కాని ఆ వైరస్ శరీరంలో అలాగే దాగి వుంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత దానికి అనువైన పరిస్థితులు (వృద్దాప్యం, HIV లాంటి వ్యాధుల వల్ల) ఏర్పడ్డాక Herpes Zoster రూపంలో బయట పడుతుంది. ఇది CD4 సంఖ్యతొ సంబంధం లేకుండా ఎప్పుడైనా రావచ్చు, కాని CD4 సంఖ్య 50 కంటే తగ్గినప్పుడు రావటానికి అవకాశాలు ఎక్కువ, కంటి పై వచ్చినప్పుడు చివరకు అంధత్వం తెప్పించే అవకాశం కూడా ఎక్కువ. ముందుగా ఈ వ్యాధి జ్వరం, చలి, తలనొప్పి, కాళ్ళు, చేతులు మొద్దు బారటం అలాగే జలదరించటం లక్షణాలను చూపుతుంది. ముందుగా వీటిని సాదరణ జ్వరంగా బ్రమపడే అవకాశం ఉంది. ఈ లక్షణాలు కనపడ్డ కొన్ని రోజులకే చర్మం పైన దుద్దుర్లు, బొబ్బలు (ద్రవంతొ నిండినవి) శరీరంలో ఎదో ఒకే ప్రాతంలో, ఒకే ప్రక్కను (కుడి లేదా ఎడమ) రావటం ప్రారంబిస్తాయి. ఈ శింగెల్స్ పూర్తిగా తగ్గటానికి దాదాపుగా ఆరువారాలు తీసుకుంటాయి. చాల అరుదుగా చెవిలోనికి ప్రవేశించి చెవుడును తెప్పించే అవకాశము ఉంది. అన్ని జొస్టర్ వైరసలలానే దీన్ని కూడా బాగు చేయవచ్చు. Acyclovir, Valacyclovir, Famciclovir లాంటి ఆంటి వైరల్ మందులను వాడి పూర్తిగా తగ్గించవద్దు. కొన్ని సార్లు వైరస్ రెజిస్టెన్స్ వల్ల HIV రొగులలో మందులు పనిచేయకపొతే రెండు మందులను కలిపి వాడాల్సి వుంటుంది.