కేరళలో కోవిడ్-19 మహమ్మారి https://te.wikipedia.org/wiki/%E0%B0%95%E0%B1%87%E0%B0%B0%E0%B0%B3%E0%B0%B2%E0%B1%8B_%E0%B0%95%E0%B1%8B%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A1%E0%B1%8D-19_%E0%B0%AE%E0%B0%B9%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF కరోనావైరస్ మొదటి కేసు కేరళలో నమోదయింది. కేరళ ప్రభుత్వం ఫిబ్రవరి 4 నుండి 8 వరకు హై అలర్ట్ ప్రకటించింది.రాష్ట్రంలోని 21 ప్రధాన ఆసుపత్రులలో 40 పడకలతో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాలో హెల్ప్‌లైన్ నెంబర్ ఏర్పాటు చేశారు.మార్చి 9 నాటికి, కేరళలో 4000 మందికి పైగా ఆసుపత్రి నిర్బంధంలో ఉంచారు కేరళలో పొంగాలా పండుగ నుండి దూరంగా ఉండాలని , వ్యాధి వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వీలైతే, వారి సొంత ఇళ్ల వద్ద పొంగళను నిర్వహించుకోవాలని కేరళ ప్రభుత్వం సూచించింది. కేరళలో కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి కేరళ ప్రభుత్వం యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించింది. కేరళలో మూడు కరోనావైరస్ పరీక్షా కేంద్రాలు ఉన్నాయి: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఫీల్డ్ యూనిట్, తిరువనంతపురం మెడికల్ కాలేజ్ , కాలికట్ మెడికల్ కాలేజ్. 10 న, కేరళ ప్రభుత్వం పాఠశాలలు కళాశాలలు మూసివేయాలని ఆదేశాలు ఇచ్చింది. అలాగే తీర్థయాత్రలు చేయవద్దని, వివాహాలు, సినిమా ప్రదర్శనలు వంటి పెద్ద సమావేశాలకు హాజరుకావద్దని ప్రజలను కోరారు. మార్చి 15 న, కేరళ ప్రభుత్వం 'బ్రేక్ ది చైన్' అనే కొత్త చొరవను ప్రవేశపెట్టింది. ఈ ప్రచారం ప్రజలకు వ్యక్తిగత పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడం. మార్చి 22 న కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కెకె శైలజ కేరళ ఆరోగ్య శాఖ ఆదేశాలను పాటించాలని సూచించారు. కరోనావైరస్ యొక్క మరింత వ్యాప్తిని నివారించడానికి మార్చి 23 న, ముఖ్యమంత్రి పినరయి విజయన్ మార్చి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించారు. కరోనావైరస్ బారిన పడిన దేశాల నుండి తిరిగి వచ్చేవారికి 28 రోజుల ఇంటి నిర్బంధాన్ని తప్పనిసరి అని రాష్ట్రం కేరళ ప్రభుత్వం ప్రకటించింది. కేరళలోని ఏడు జిల్లాలను కోవిడ్ -19 హాట్‌స్పాట్‌లుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గుర్తించింది. కరోనావైరస్ గురించి నకిలీ వార్తలు ఇంటర్నెట్‌లో విస్తృతంగా వ్యాపించాయి. చైనాలో కరోనావైరస్ యొక్క ప్రభావాన్ని చూపించడానికి చైనా వీధుల్లో జరిగినట్లు కనిపించే అనేక వీడియోలను వాట్సాప్ లో వచ్చాయి. అనేక యూట్యూబ్ ఛానెల్స్ కరోనావైరస్ కోళ్ళు ద్వారా వ్యాపిస్తుందని తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశాయి. వెల్లుల్లి,వేడి నీరు కరోనావైరస్ రాకుండా వుంటుందని కొన్ని వెబ్సైటులో పుకార్లు వచ్చాయి. భారతదేశంలో కరోనావైరస్ వ్యాప్తి (2020)