బర్డ్ ఫ్లూ https://te.wikipedia.org/wiki/%E0%B0%AC%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A1%E0%B1%8D_%E0%B0%AB%E0%B1%8D%E0%B0%B2%E0%B1%82 బర్డ్ ఫ్లూని ఏవియన్ ఇన్ ఫ్లూయంజా (Avian influenza) అని ఆంగ్లములో వ్యవహరిస్తారు. ఈవ్యాధి కోళ్లు, బాతులు, ఇతర పక్షిజాతులకు ఒక దాని నుంచి ఒకదానికి త్వరితంగా వ్యాపిస్తుంది. 'హెచ్5ఎన్1' (H5N1) అనే వైరస్ వల్ల ఇది వ్యాప్తి చెందుతుంది. కోళ్లలో వ్యాపించిన ఈవ్యాధి 2 రకాల వ్యాధి లక్షనాలు ప్రకోపించవచ్చు. ఈ వైరస్ కొద్ది స్థాయిలో సోకినపుడు కోళ్ల ఈకలు చెల్లా చెదురైనట్లు కనిపిస్తాయి. గుడ్ల ఉత్పత్తి తగ్గిపోతుంది . ఈ వైరస్ తీవ్రముగా సోకినపుడు కోడి వివిధ శరీర అవయవాలు దెబ్బతిని 48 గంటలలో చనిపోతుంది.కోళ్లు జారవిడిచే సొంగ ద్వారా ఈ వ్యాధి ఒక కోడి నుండి మరొక కోడికి త్వరితముగా వ్యాపిస్తుంది. అలాగే కోడి రెట్టలద్వారా కూడా ఈవ్యాధి వ్యాపిస్తుంది. చాలా అడవి పక్షులలో ఈవ్యాధి క్రిములు పేగులలో ఉండవచ్చును. కాని దీప్రభావము వెంటనే కనిపించదు. ఈ పేగులు ఈ వైరస్ కి రిజర్వాయర్ గా ఉంటాయి. ఈ పేగులే ఇతర పక్షిజాతులకు ఈ వ్యాధి సోకడానికి వాహకాలుగా పనిచేస్తాయి. మనుషులకు సోకే ఫ్లూ వ్యాధి కూడా ఈ రకానికి చెందినదే. మనుషులకు సోకే వైరస్ లకు, కోళ్లకు సోకే వైరస్ లకు కొన్ని తేడాలు ఉన్నాయి. మనుషులకు 'హెచ్1ఎన్1', 'హెచ్1ఎన్2', 'హెచ్3ఎన్2' వైరస్ లు సోకుతాయి. కోళ్లకు 'హెచ్5ఎన్1' వైరస్ సోకుతుంది. కోళ్లకు సోకే వైరస్ అసాధారణ పరిస్థితులలో మాత్రమే మనుషులకు సోకుతుంది. అయితే ఈవైరస్ లు త్వరితముగా రూపాంతరము చెందే శక్తి కలిగి ఉంటాయి. అందువలన మానవ జాతికి మొదట నుండి ఈ వైరస్ అంటే భయమే. 1918 లో స్పానిష్ ఫ్లూ మహమ్మారిలా సోకినపుడు ప్రపంచవ్యాప్తముగా 4కోట్లు మంది మరణించారు. బర్ద్ ఫ్లూ కూడా అదేవిదముగా రూపాంతరము చెంది మానువులకు హాని కలిగింస్తుందేమోనని శాస్త్రవేత్తలు నిరంతరము నిఘాతో ఉంటున్నారు. అదే జరిగితే మానవ జాతిలో 25 - 30 శాతము ప్రజలకు దీని ప్రభావము పడుతుందని భయాందోళనలు వ్యక్త మవుతున్నాయి. మానవ జాతిపై ప్రభావము గురించి అలా ఉంచి పక్షులకు ఈ వ్యాధి సోకడము వల్ల అపారమైన ఆర్థిక నస్టము జరుగుతుంది . ఈ వ్యాధి వ్యాపించ కుండా కోట్లాది కోళ్లను వధించాల్సివస్తుంది. ఇప్పుడు (జనవరి 2008) పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న 20 లక్షల కోళ్ల వధ కూడా ఈ కార్యక్రమములోని భాగమే. 'హెచ్5ఎన్1' వైరస్ 1997 లో మదట కనుగొన్నారు . ఇప్పటి వరకూ 353 మంది మనుషులకు ఈ వ్యాధి సోకింది అందులో 221 మంది చనిపోయారు. మరణించిన వారిలో 60% ఇండోనేషియా, వియత్నాం లకు చెందినవారు. వ్యాధి సోకిన కోళ్లకు మేత దాణా వేసేవారు, పంజరాలను శుభ్రము చేసేవారు, రోగిష్టి పక్షులను అటూ ఇటూ తరలించేవారికి ఈవ్యాధి సోకే ప్రమాధం ఉంది. ఇప్పటి వరకూ ఒక మనిషి నుండి ఇంకో మనిషికి 'హెచ్5ఎన్1' వైరస్ సోకిన దాఖలాలు లేవు. ఇది మానవ జాతికి పెద్ద ఊరట. ఈ వైరస్ కి వ్యాక్సిన్ తయారు చేయడానికి ఎన్నో అడ్డంకులున్నాయి. మనిషి నుండి మనిషి ఈ వ్యాధి సోకిన ప్రమాదకర పరిస్థితి వచ్చినపుడే ఈ వ్యాక్సిన్ తయారుచేయడం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలంటున్నారు. ఈ వ్యాక్షిన్ తయారు చేయడానికి అనేక కాంబినేషన్స్ శాస్త్రవేత్తలు ప్రయత్నం చేస్తున్నారు. ప్రసుతము యాంటి వైరస్ మందులు కొన్ని వినియోగములో ఉన్నాయి. దీనిని వాణిజ్యపరంగా "టామిఫ్లూ-జనమివిర్" అని వ్యవహరిస్తున్నారు.దీనిని రెలెంజా అని కూడా అంటారు. సాదారణ ఫ్లూ ఉపయోగించే మందులే బర్డ్ ఫ్లూకి కూడా ఉపయోగపడతాయని ఆసిస్తున్నారు. ఇంకా ఈ మందులు తయారీకి చాలాకాలము పట్టవచ్చుని, వీటి తయారీ ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. వంటింటి వంటకాల ద్వారనే ఈ వ్యాధి నివారించవచ్చు బాగా సుమారు 70 డిగ్రీల సెంటిగ్రేడ్ పైనే ఉన్న ఉష్ణోగ్రత వద్ద వండితే ఎటువంటి వ్యాధి వ్యాపించదు, అయితే కోడి అన్ని భాగాలు సరిగ్గా ఉడికినట్లు నిర్ధారణ అవసరము. చైనాను వణికిస్తున్న ప్రాణాంతక హెచ్7ఎన్9 రకం బర్డ్ ఫ్లూ వైరస్‌కు ఆ దేశ శాస్త్రవేత్తలు తొలి వ్యాక్సిన్‌ను తయారు చేశారు. చైనా శాస్త్రవేత్తలు ఫ్లూ వ్యాక్సిన్‌ను తయా రు చేయడం ఇదే తొలిసారి. పరిశోధనలో భాగంగా వీరు హెచ్7ఎన్9 వ్యాధి సోకిన రోగి నుంచి గొంతు నుంచి కణజాలం సేకరించారు. తర్వాత అందులోంచి వైరస్ విజ యవంతంగా వేరు చేశారు. దీని కోసం ప్లాస్మిడ్ రివర్స్ జెనెటిక్స్, జెనెటిక్స్ రీయసార్ట్‌మెంట్ అనే విధానాన్ని అనుసరించారు.