బీహార్‌లో కోవిడ్-19 మహమ్మారి https://te.wikipedia.org/wiki/%E0%B0%AC%E0%B1%80%E0%B0%B9%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E2%80%8C%E0%B0%B2%E0%B1%8B_%E0%B0%95%E0%B1%8B%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A1%E0%B1%8D-19_%E0%B0%AE%E0%B0%B9%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF బీహార్‌లో కోవిడ్-19 మహమ్మారి మొదటి కేసు 38 ఏళ్ల వ్యక్తికి 2020 మార్చి 22 న పాజిటివ్ నమోదైనది. 4 ఆగస్టు 2020 నాటికి మొత్తం 62,031 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని 38 జిల్లాల్లో ఈ వైరస్ వ్యాపించింది, అందులో పాట్నా జిల్లాలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. వలస కార్మికులు,విద్యార్థులు తిరిగి రావడంతో , బీహార్ కేసుల సంఖ్య అధికంగా పెరిగింది. బీహార్ తన మొదటి కేసును 22 మార్చి 2020న నమోదైనది. 20 ఏప్రిల్ 2020 నాటికి 100 కేసులను నమోదైనది. 100వ కేసుకు చేరుకోవడానికి దాదాపు 1 నెల పట్టింది. 14 మే 2020న 1,000 కేసులు నమోదయ్యాయి. 8 జూన్ 2020న 5,000 కేసులు నమోదయ్యాయి.