ఎకాంతోసిస్ నైగ్రికాన్స్ https://te.wikipedia.org/wiki/%E0%B0%8E%E0%B0%95%E0%B0%BE%E0%B0%82%E0%B0%A4%E0%B1%8B%E0%B0%B8%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8D_%E0%B0%A8%E0%B1%88%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%95%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D ఎకాంతోసిస్ నైగ్రికాన్స్ అనేది ఒక చర్మసంబంధ సమస్య. చర్మపు ముడతలు, పల్లాలు ముదురు రంగులో వెల్‌వెట్ మాదిరిగా మందంగా తయారవటం ఈ వ్యాధి ముఖ్య లక్షణం. వ్యాధి ప్రభావానికి లోనైన చర్మం దళసరిగా మారడమే కాకుండా చెడు వాసన కూడా వస్తుంటుంది. ఈ వ్యాధిలో సాధారణంగా చంకలు, గజ్జలు, మెడ వెనుక చర్మపుముడతలు నలుపుగా, మందంగా తయారవుతుంటాయి. సాధారణంగా అధిక బరువు కలిగిన వ్యక్తుల్లోనూ, షుగర్ వ్యాధిగ్రస్తుల్లోనూ ఈ లక్షణం కనిపిస్తుంటుంది. చిన్నతనంలో ఈ లక్షణాలు కనిపిస్తుంటే, పెద్దయిన తరువాత మధుమేహ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. చాలా చాలా అరుదైన ఎకాంతోసిస్ నైగ్రికాన్స్ అనేది అమ్లాశయపు క్యాన్సర్‌కిగాని లేదా కాలేయపు క్యాన్సర్‌కిగాని హెచ్చరిక లక్షణంగా కనిపించవచ్చు. ఈ లక్షణం కనిపిస్తున్నప్పుడు సాధారణంగా దీనికి దారితీసే వ్యాధి స్థితిని సరిదిద్దితే సరిపోతుంది. చంకలు, గజ్జలు, మెడలోని చర్మపు ముడుతలు, పల్లాలు ముదురు రంగులోకి మారతాయి మందంగా, వెల్‌వెట్ గుడ్డ మాదిరిగా తయారవుతాయి ఈ మార్పులు వెంటనే కాకుండా నెమ్మదిగా, కొన్ని నెలలు, సంవత్సరాలపాటు చోటుచేసుకుంటాయి. వ్యాధి ప్రభావానికి గురైన చర్మం నుంచి చెడు వాసన వస్తుంటుంది. కొద్దిగా దురదగా కూడా అనిపిస్తుంటుంది. ఇన్సులిన్ హార్మోన్‌ని శరీరం వినియోగించుకోలేకపోవటం (ఇన్సులిన్ రెసిస్టెన్స్) : క్లోమగ్రంథి (ప్యాంక్రియాస్) ఇన్సులిన్ హార్మోన్‌ని విడుదల చేస్తుందన్న సంగతి తెలిసిందే. ఇన్సులిన్ అనేది షుగర్‌ని శరీరం వినియోగించుకోవడానికి సహాయపడుతుందన్న సంగతి కూడా తెలిసిందే. ఒకవేళ ఈ ఇన్సులిన్ శరీరం గుర్తించలేకపోతే దానిని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. దీనివల్ల చర్మం ముడతలు మందంగా, నలుపుగా తయారవుతాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్‌వల్ల మున్ముందు కాలంలో షుగర్ వ్యాధివచ్చే అవకాశం ఉంటుంది. తయారై ఎకాంతోసిస్ నైగ్రికాన్స్ రావచ్చు. అధిక బరువు, వంశపారంపర్యత, జన్యువులు. ఈ వ్యాధిని నిర్థారించడానికి కొంత సమాచారాన్ని మీరు డాక్టర్‌కి ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు: -మీ కుటుంబంలో నలుపుదనంతోకూడిన మందపాటి చర్మం ముడతలు ఉన్నాయా? చికిత్సల ఉద్దేశం-లక్షణాలను కలిగించే అంతర్గత వ్యాధిని ముందుగా గుర్తించి అదుపులో ఉంచటం. చర్మం ఎబ్బెట్టుగా కనిపించకుండా మచ్చల గాఢతను తగ్గించటం -ఆహారంలో మార్పులు చేర్పులను సూచించటం -ఒకవేళ అధిక బరువు కలిగి ఉంటే బరువు తగ్గేలాఆహార, విహార, ఔషధాపరమైన చికిత్సలను సూచించటం చర్మంమీద నలుపు రంగు మందపాటి వైద్య సలహాతో వాడుకోవాల్సిన ఔషధాలు--పంచతిక్తఘృత గుగ్గులు, మహామంజిష్టాది క్వాథం, మహాభల్లాతక రసాయనం, అమృత భల్లాతక లేహ్యం, లంకేశ్వర రసం, అరగ్వదాది ఉద్వర్తనం, మహా మరీచ్యాది తైలం, శే్వత కరవీరాది తైలం కారణాన్ని బట్టి ట్రీట్ మెంట్ చేయాలి . మదుమేహము అదుపులో ఉండేటట్లు, కాన్సర్ అయితే దానికి తగిన వైద్యాన్ని ఇవ్వవలసి ఉంటుంది. సాధారణముగా ఇది దానంతట అదే తగ్గిపోవును .. . దాని మూలాన్ని బాగుజేసుకుంటే . Restoderm or Total derm వంటి ఆయింట్ మెంట్స్ బయట మచ్చలు పైన పూతగా రాస్తే కొద్దికాలములో ఇది పూర్తిగా మామూలు చర్మము రంగులోనికి మారిపోవును.