సోరియాసిస్ https://te.wikipedia.org/wiki/%E0%B0%B8%E0%B1%8B%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B8%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8D చర్మ సంబంధమైన దీర్ఘకాలిక వ్యాధి సోరియాసిస్ (ఆంగ్లం: Psoriasis). దీర్గకాలికమైన రోగనిరోధక శక్తిలో మార్పులు వలన ఇది సంభవిస్తుంది. ఈ వ్యాధిలో నొప్పి, చర్మము మందము అవడం, వాపు, దురద, చేపపొట్టులాంటి పొలుసులు ఊడడం జరుగుతుంటుంది. ఈ వ్యాధి ముఖ్యముగా ముంజేతి వెనకభాగము, మోకాలు ముందుభాగము, తల, వీపు, ముఖము, చేతులు, పాదాలలో వస్తుంది. సరియైన చికిత్స లేనట్లైతే ఈ వ్యాధి జీవితాంతముంటుంది. కొన్ని వాతావరణ పరిస్తితులలో వ్యాధి పెరగడము, తగ్గడమూ సర్వసాధారణము.దీర్ఘకాలం బాధించే మొండి చర్మ వ్యాధుల్లో సొరియాసిస్ ముఖ్యమైనది. ప్రపంచవ్యాప్తంగా 125 మిలియన్ల మంది సొరియాసిస్‌తో బాధపడుతున్నారని అంచనా. అంటే ప్రపంచ జనాభాలో మూడు శాతం మంది ఈ వ్యాధి బారినపడుతున్నారు. సొరియాసిస్ బాధితులు శారీరకంగా ఇబ్బందిపడుతూ, మానసికంగా నలిగిపోతూ వుంటారు. అందుకే దీనిని మొండి వ్యాధిగా పరిగణిస్తారు. సొరియాసిస్ అంటే దీర్ఘకాలం కొనసాగే చర్మవ్యాధి. ఈ వ్యాధి సోకిన వారిలో చర్మంపైన దురదతో కూడిన వెండిరంగు పొలుసులు కనిపిస్తాయి. ఈ పొడలు ఎరుపుదనాన్ని, వాపుని కలిగి ఉండవచ్చు. చర్మం మాత్రమే కాకుండా గోళ్లు, తల వంటి ఇతర శరీర భాగాలు కూడా ఈ వ్యాధి ప్రభావానికి లోనుకావచ్చు. చర్మంపై పొలుసులుగా వచ్చినప్పుడు గోకితే కొవ్వత్తి తాలికలను పోలిన పొట్టు రాలుతుంది. పొలుసులు తొలగిస్తే అడుగున రక్తపు చారికలు కనిపిస్తాయి. నిజానికి సొరియాసిస్ ప్రధాన లక్షణం దురద కాదు. అయితే వాతావరణం చల్లగా ఉంది, తేమ తగ్గిపోయినప్పుడుగానీ, ఇన్ఫెక్షన్ల వంటివి తోడైనప్పుడుకానీ దురద ఎక్కువ అవుతుంది. బాధితుల్లో 10-30శాతం మందికి అనుబంధ లక్షణంగా తీవ్రమైన కీళ్లనొప్పులు కూడా సంభవిస్తాయి. సొరియాసిస్ సాధారణంగా కుడి, ఎడమల సమానతను ప్రదర్శిస్తుంది. సొరియాసిస్ ఎక్కువకాలం బాధిస్తుంటే అది సొరియాటిక్ ఆర్థరైటిస్‌గా మారుతుంది. కారణాలు: సొరియాసిస్ వ్యాధి ఏర్పడటానికి మానసిక ఒత్తిడినుంచి ఇన్ఫెక్షన్ల వరకు ఎన్నో కారణాలు ఉంటాయి. వంశపారంపర్యంగా కూడా సొరియాసిస్ రావచ్చు. జీర్ణవ్యవస్థలో లోపాలవల్ల కూడా సొరియాసిస్ రావచ్చని తాజా ప7రిశోధనలు వెల్లడిస్తున్నాయి. సాధారణంగా బ్యాక్టీరియా, వైరస్‌ల మూలంగా వచ్చే ఇన్‌ఫెక్షన్లు, జబ్బుల నుంచి రోగనిరోధకశక్తి మనల్ని కాపాడుతుంటుంది. అయితే సోరియాసిస్ బాధితుల్లో రోగనిరోధక వ్యవస్థలో భాగమైన టీ కణాలు పొరపాటున ఆరోగ్యంగా ఉన్న చర్మ కణాలపైనే దాడి చేస్తాయి. దీంతో శరీరం ఇతర రోగనిరోధక స్పందనలను పుట్టిస్తుంది. ఫలితంగా వాపు, చర్మకణాలు వేగంగా ఉత్పత్తి కావటం వంటి వాటికి దారితీస్తుంది. సోరియాసిస్ బాధితుల్లో కొంతకాలం పాటు దాని లక్షణాలు కనబడకుండా ఉండిపోవచ్చు. కొన్నిసార్లు ఉన్నట్టుండి ఉద్ధృతం కావొచ్చు. ఇలా పరిస్థితి తీవ్రం కావటానికి కొన్ని అంశాలు దోహదం చేస్తాయి. గొంతు నొప్పి, జలుబు వంటి ఇన్‌ఫెక్షన్లు. రోగనిరోధకశక్తిని బలహీనపరిచే జబ్బులు. తీవ్రమైన మానసిక ఒత్తిడి అధిక రక్తపోటు తగ్గటానికి వేసుకునే బీటా బ్లాకర్లు, మలేరియా నివారణకు ఇచ్చే మందుల వంటివి. చల్లటి వాతావరణం. పొగతాగటం. అతిగా మద్యం తాగే అలవాటు.ముప్పు కారకాలు సోరియాసిస్ దీర్ఘకాల సమస్య. కొందరిలో జీవితాంతమూ వేధిస్తుంటుంది కూడా. ఇది ఎవరికైనా రావొచ్చు. 10-45 ఏళ్ల వారిలో తరచుగా కనబడుతుంది. సోరియాసిస్ ముప్పును పెంచే కారకాలు ఇవీ.. వంశపారంపర్యము, తల్లిందండ్రుల్లో ఎవరికైనా సోరియాస్ ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం ఉండొచ్చు. మానసిక వత్తిడిఒత్తిడి రోగనిరోధకశక్తిపై ప్రభావం చూపుతుంది కాబట్టి తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యేవారికీ సోరియాస్ ముప్పు పొంచి ఉంటుంది. ఇన్ఫెక్షన్ చర్మము పొడిబారినట్లుండడం కొన్నిరకాల మందులు వాడడం వలన ఆల్కహాలు పొగత్రాగడం - ఈ వ్యాధికి కొన్ని కారణాలు. ముఖ్యముగా 25 - 45 సంవత్సరాల వయసు వచ్చే ఈ వ్యాధి మహిళలో ఎక్కువగా ఉంటుంది. మానసిక, శారీరక వత్తుడులు వలన ఈ వ్యాధి శాతం పెరుగుతూ వస్తుంది. వూబకాయం మూలంగానూ ముప్పు పెరుగుతుంది. సొరియాసిస్ పొలుసులు తరచుగా చర్మం ముడతలు, ఒంపుల్లోనే వస్తుంటాయి. పొగతాగటం సోరియాసిస్ ముప్పునే కాదు.. జబ్బు తీవ్రతనూ పెంచుతుంది. ఇది వ్యాధి ఆరంభంలోనూ ప్రభావం చూపుతుంది.గట్టేట్ సోరియాసిస్ (Guttate Psoriasis): నీటి బుడగలవంటి పొక్కులు ఉంటాయి. ఛాతీ భాగము, ముంజేతులు, తల, వీపు భాగాలలో వస్తుంది. దీనికి తోడు వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే చీముపొక్కులుగా మారుతుంది. ఈ రకమైన సొరియాసిస్ యువకుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఊపిరితిత్తులు లేదా గొంతులో ఇన్షెక్షన్లు ఏర్పడిన తరువాత ఒకటి నుంచి మూడు వారాల్లో ఈ వ్యాధి వస్తుంది. నీటి బిందువల పరిమాణంలో మచ్చలు ఏర్పడతాయి. కుటుంబంలో పూర్వీకులు ఎవరికైనా ఈ వ్యాధి వున్నప్పుడు ఇలాంటి పరిస్థితి తలెత్తవచ్చు.పోస్టులార్ సోరియాసిస్ (Pustular Psoriasis): ఎక్కువ వేడి ప్రదేశాలలోను, ఎండలో తిరగడం వలన, గర్భవతిగా ఉన్నపుడు, చెమట ఎక్కువగా పట్టేవారులోను, మానసిక అలజదీ, వత్తిడి ఉన్నవారిలోను, కొన్ని రకాల మందులు కెమికల్సు తో పనిచేసేవారిలోను, ఎక్కువ యాంటిబయోటిక్స్ వాడేవారిలోను ఈరకం వస్తూ ఉంటుంది. ఇన్వర్స్ సోరియాసిస్ (Inverse Psoriasis): పెద్ద, పొడి, సున్నితమైన, ఎర్రని పొలుసులతో ఉంటుంది. ఎక్కువగా చర్మము మడతలలో, జననేంద్రియ భాగాలలో, చంకలలో, ఎక్కువ వత్తిడి, రాపిడి ఉండే చోట్ల ఇది వస్తుంది.ఎరిత్రోడెర్మిక్ సోరియాసిస్ (Erythrodermic Psoriasis): ఎక్కువ చర్మభాగము ఎర్రగా మారడం, దురద, పొలుసులు రాలడం, భరింపనలవికాని నొప్పి ఉండడం దీని లక్షణం. ఎండలో తిరగడం, స్టెరాయిడ్ మందులు, యాంటిబయోటిక్స్ వాడడం వలన, కొన్ని ఎలర్జీల వలన ఇది ప్రేరేపితమవుతుంది. సోరియాసిస్ వల్గారిస్ (Psoriasis vulgaris): ఇది 80% - 90 % వరకూ కనిపిస్తుంది. చర్మము తెల్లని పొలుసు గా పైకి లేచినట్లు ఉంటుంది. గోళ్ల సోరియాసిస్ : కాళ్ల, చేతుల గోరు లో మార్పులు జరిగి రంగు మారడం, గోళ్లు వంకరగా పైకి లేవడమ్, గోళ్లపై చారలు కనిపించడమ్, గోల్ళు దలసరిగా అవడం, లొత్తలు పడడం ఈవదమ్గా అందవిహీనంగా తయారవుతాయి.ప్లేక్ సొరియాసిస్: ఈ రకమైన సొరియాసిస్‌తో బాధపడే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. సొరియాసిస్ రోగులలో 10-15 శాతం మంది ఈ రకమైన వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధిగ్రస్తులలో చర్మం ఎర్రగా మారుతుంటుంది. ఆ ప్రాంతంలో తెల్లని పెళుసులు కడుతుంది. దురదను లేదా మంటను కలిగిస్తాయి. ఈ మచ్చలు ఎక్కువగా మోచేతులు, మోకాళ్లు, పొట్టపై భాగం, మాడుపై, చర్మం మీద ఏర్పడతాయి. ఇన్‌వటరేట్ సొరియాసిస్: ఇది ఎక్కువగా లోపలి శరీరభాగాల్లో ఏర్పడుతుంది. అంటే చంకలు, రొమ్ములు, వృషణాల వద్ద ఈ మచ్చలు ఏర్పడతాయి. ఈ రకమైన సొరియాసిస్‌కి చికిత్స కూడా చాలా కష్టంగానే ఉంటుంది. సెబోరిక్ సొరియాసిస్: మాడుపైన, చెవుల వెనక, భుజాలపైన, చంకలు, ముఖంపైన ఎర్రని మచ్చలు ఏర్పడతాయి. నెయిల్ సొరియాసిస్: చేతివేళ్లు, కాలివేళ్ల గోళ్లపైన తెల్లని మచ్చలు, గుంటల రూపంలో ఏర్పడతాయి. కొన్నిసార్లు మచ్చలు పసుపు రంగులో వుంటాయి. గోళ్ల కింద చర్మం నుంచి గోరు వేరు పడిపోయి అక్కడ మృతచర్మం ఏర్పడుతుంది. సొరియాసిస్‌తో బాధపడే రోగులలో దాదాపు సగం మందికి గోళ్లలో అసాధరణ మార్పులు కనిపిస్తాయి. పస్ట్యులర్ సొరియాసిస్: చర్మంపైన ఏర్పడే మచ్చలలో చీములాంటి ద్రవం ఏర్పడుతుంది. సాధారణంగా ఇవి చేతులు, కాళ్లపైన ఏర్పడతాయి. చీముతో కూడిన ఈ మచ్చలు అరచేతులు, అరిపాదాలలో ఏర్పడినప్పుడు పామార్, ప్లాంటార్ ఫస్టులోసిస్‌గా వ్యవహరిస్తారు. సోరియాసిన్ వ్యాధి ఉధ్రుతమైనది, దీర్ఘకాలికమైనది. కావున ఒక రోగికి , మరో రోగికి వ్యాధి తీవ్రతలో తేడా ఉంటుంది. జబ్బు తీవ్రతను బట్టి చికిత్స చేయవలసిన అవరముంటుంది. తగినంత శరీరకశ్రమ , విశ్రాంతి, సమతుల్య ఆహారము, మంచి అలవాట్లు, మెడిటేషన్, చర్మరక్షణకు సంబంధించిన జాగ్రత్తలూ, ఇతర ఇన్ఫెక్షన్ రాకుండా సుచి-శుబ్రత పాటించడం, పొడి చర్మానికి తేమకోసం ఆయిల్ పూయడం మంచిది. పరీక్షలు-నిర్ధరణ చి సోరియాసిస్‌ను చాలావరకు లక్షణాలను బట్టే గుర్తిస్తారు. చర్మం, మాడు, గోళ్ల వంటి వాటిని పరీక్షించి సమస్యను నిర్ధరిస్తారు. అరుదుగా కొందరిలో చర్మం ముక్కను తీసి మైక్రోస్కోప్ ద్వారా పరీక్షిస్తారు. ఇందులో సోరియాసిస్ ఏ రకానికి చెందిందో గుర్తిస్తారు. చికిత్స మూడు రకాలు సోరియాసిస్ కేసుల్లో చాలావరకు పైపూత మందులను వాడుకుంటే సరిపోతుంది. తీవ్రతను బట్టి మాత్రలు, ఇంజెక్షన్లు.. అలాగే అతినీలలోహిత కిరణాలతోనూ చికిత్స చేస్తారు. పైపూత మందులుగా స్టీరాయిడ్స్ ఇస్తారు. ఇవి వాపును, దురదను తగ్గిస్తాయి. విటమిన్ డి పైపూత మందులు కూడా బాగా పనిచేస్తాయి. పొలుసులను తగ్గించే శాలిసిలిక్ యాసిడ్.. పొలుసులతో పాటు దురద, వాపును తగ్గించే కోల్ టార్ వంటివీ ఉపయోగపడతాయి. కొందరికి మాయిశ్చరైజర్లనూ సిఫార్సు చేస్తారు. ఇవి దురద, పొలుసులు తగ్గటానికి దోహదం చేస్తాయి. చర్మాన్ని పొడిబారకుండా చూస్తాయి.కాంతి చికిత్సలో చర్మంపై సూర్యరశ్మిని గానీ కృత్రిమమైన అతినీలలోహిత కిరణాలను గానీ పడేలా చేస్తారు. దీంతో అక్కడి టీ కణాలు చనిపోతాయి. ఫలితంగా చర్మకణాలు ఉత్పత్తయ్యే వేగం మందగిస్తుంది. పొలుసులు, వాపు తగ్గుతాయి. న్యారోబ్యాండ్ యూవీబీ, గోకెర్మన్ థెరపీల వంటివీ అందుబాటులో ఉన్నాయి.సమస్య మరీ తీవ్రంగా ఉంటే మాత్రలు, ఇంజెక్షన్లు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వీటితో దుష్ప్రభావాలు తలెత్తే అవకాశముంది కాబట్టి కొంతకాలమే ఇచ్చి, ఇతర చికిత్సలను చేస్తారు.మనుషులు లేదా జంతువుల నుంచి తీసిన ప్రోటీన్లయిన 'బయోలాజికల్స్' కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇవి నేరుగా రోగనిరోధకవ్యవస్థ మీదనే పనిచేస్తాయి. సమస్య చర్మం వరకూ రాకుండా అడ్డుకుంటాయి. అందువల్ల వీటితో మంచి ఫలితం కనబడుతుంది. దీర్ఘకాలం ప్రభావం చూపిస్తాయి. పైగా దుష్ప్రభావాలేవీ ఉండవు కూడాసొరియాసిస్ వ్యాధి కేవలం ఒకే సమస్య ఆధారంగా ఏర్పడదు. కాబట్టి వివిధ సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి శరీరంలోని జన్యువుల స్థాయిలో వ్యాధిని అరికట్టేందుకు చికిత్స అందజేయవలసి ఉంటుంది. కణాల ఉత్పత్తి వేగాన్ని నియంత్రించడం, మృతకణాల స్థానంలో కొత్త కణాల పునరుజ్జీవానికి చర్యలు తీసుకోవటం, అలాగే వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించటం వంటి చర్యలకు హోమియో వైద్యంతో సమర్ధంగా నిర్వర్తించడం సాధ్యమవుతుంది. గ్రాఫైటిస్, లైకోపోడియా, నెట్రమ్‌మూర్, సల్ఫర్, సెపియా, స్టాఫ్‌సాగ్రియా, ఫాస్పరస్, ఒలైటాకార్బ్, పల్సటిల్లా వంటి హోమియో మందులు సొరియాసిస్‌ను నిర్మూలించడంలో సత్ఫలితాలు ఇస్తాయి.