ఉండుకము https://te.wikipedia.org/wiki/%E0%B0%89%E0%B0%82%E0%B0%A1%E0%B1%81%E0%B0%95%E0%B0%AE%E0%B1%81 ఉండుకము (Vermiform appendix) పేగులో ఒక భాగము. మానవులలో ఇది అవశేషావయవము. ఇది ఉదరములో కుడివైపు క్రిందిమూలలో పెద్ద ప్రేగు మొదటి భాగానికి కలిసి ఉంటుంది. అరుదుగా ఎడమవైపుకూడా ఉండవచ్చును. మనుషులలో ఉండుకము ఇంచుమించు 10 సె.మీ పొడుగుంటుంది (2-20 సె.మీ.). ఇది పేగుకు కలిసేభాగం స్థిరంగా ఉన్నా, దీనికొన ఉదరంలో ఏవైపుకైనా తిరిగి ఉండవచ్చు. దీని వాపునొప్పి ఈస్థానాన్ని బట్టి ఉంటుంది. అపెండిసైటిస్ (Appendicitis) : అపెండిక్స్ లేదా ఉండుకము ఇన్ఫెక్షన్ వలన ఇది వాచిపోతే దానిని అపెండిసైటిస్ అంటారు. దీనిని నిర్లక్ష్యం చేస్తే ఇన్ఫెక్షన్ పొట్ట లోపల అంతటా వ్యాపించవచ్చు. ఒక్కోసారి అపెండిక్స్ పగిలి ప్రాణాపాయ స్థితి కూడా సంభవించవచ్చు. అందుకే వెంటనే శస్త్రచికిత్స చేయడం ఉత్తమం.మనం తిన్న ఆహారం అవశేషాలు లేక పెద్ద ప్రేగులలోని ఒక రకమైన నులిపురుగులు అపెండిక్స్ నాళంలో ప్రవేశించి, ఇన్ఫెక్షన్ రావడం. శస్త్రచికిత్స పేరు "అపెండిసెక్టమీ" (Appendicectomy) అంటారు.