మానసిక రుగ్మత https://te.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A8%E0%B0%B8%E0%B0%BF%E0%B0%95_%E0%B0%B0%E0%B1%81%E0%B0%97%E0%B1%8D%E0%B0%AE%E0%B0%A4 మానసిక రుగ్మత (Mental disorder - మానసిక వైకల్యం, Mental illness - మానసిక అనారోగ్యం) అనగా మనస్సుకు సంబంధించిన ఒక అనారోగ్యం. మానసిక రుగ్మతతో ఉన్న ప్రజలు వింతగా ప్రవర్తిస్తారు, లేదా ఇతరుల దృష్టిలో వీరు వింత ఆలోచనలను కలిగి ఉన్న వారుగా వుంటారు. మానసిక అనారోగ్యం వ్యక్తి జీవితకాలంలో పెరుగుతుండవచ్చు లేదా తగ్గుతుండవచ్చు. ఇది జన్యువులతో, అనుభవంతో ముడిపడి ఉండవచ్చు. మొత్తం మీద మానసిక రుగ్మత మారుతూ ఉంటుందని భావించాలి. ప్రపంచంలోని అన్ని దేశాలలో ఆరోగ్యం, సామాజిక, మానవ హక్కులు, ఆర్థిక పరిణామాలపై గణనీయమైన ప్రభావాలతో మానసిక రుగ్మతల భారం పెరుగుతూనే ఉంది. మానసిక రుగ్మత తో ప్రపంచవ్యాప్తంగా 264 మిలియన్ల మంది ప్రజలు బాధపడుతున్నారు. పురుషుల కంటే ఎక్కువ మంది మహిళలు దీని బారిన పడుతున్నారు. నిరాశ, నిస్పృహ, బాధ, ఆనందం కోల్పోవడం, ఆత్మ విశ్వాసం కోల్పోవడం, నిద్ర లేమి, ఆకలి, అలసట, ఏకాగ్రత లేక పోవడం వంటివి ఈ మానసిక రుగ్మత కు కారణములు. వీటి ప్రభావములతో మనుషులు ఆత్మహత్యలను చేసుకుంటారు . మానసిక రుగ్మతలు: నిరాశ (డిప్రెషన్), బైపోలార్ డిజార్డర్, మనోవైకల్యం( స్కిజోఫ్రెనియా) , సైకోసెస్, చిత్తవైకల్యం, ఆటిజం. నిరాశ, నిస్పృహ, మానసిక రుగ్మతల ఆరోగ్య పరముగా, సామాజికంగా బయట పడటానికి ప్రజలకు అవకాశం ఉన్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ( w.h.o ) 2013 లో వారి మానసిక ఆరోగ్య కార్యాచరణ ప్రణాళిక 2013-2020 ప్రజలందరికీ ఆరోగ్యాన్ని సాధించడంలో మానసిక ఆరోగ్యం యొక్క పాత్రను గుర్తించింది , మానసిక ఆరోగ్యానికి మరింత సమర్థవంతమైన నాయకత్వం పాలన,సమాజ-ఆధారిత అమరికలలో సమగ్ర, అందరికి మానసిక ఆరోగ్యం, సామాజిక సంరక్షణ సేవలను అందించడం, అమలు , నివారణ కోసం వ్యూహాల అమలు,సమాచార వ్యవస్థలు, పరిశోధనలను బలోపేతం చేసింది. 2008 లో ప్రారంభించిన WHO యొక్క మెంటల్ హెల్త్ గ్యాప్ యాక్షన్ ప్రోగ్రామ్ (mhGAP), ప్రపంచ దేశాలలో సేవలను విస్తరించడానికి, మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించే కార్యక్రమం మానసిక రుగ్మత , మానసిక అనారోగ్యం అనేక రకములుగా ఉండవచ్చును , అందరికి ఒకే లాగ ఉండవు . అయితే కొన్ని సాధారణ లక్షణాలను పరిశీలించా వచ్చును, వాటిలో సరైన ఆహరం తీసుకోక పోవడం, నిద్రలేమి లేదా ఎక్కువ నిద్ర, ఇష్టమైన కార్యకలాపాల నుండి దూరం చేయడం , శరీర నొప్పులు, నిస్సహాయంగా ఉండటం, కంటే ధూమపానం, మద్యపానం, మత్తు మందులు వాడటం, మతిమరుపు, చిరాకు, కోపం, ఆందోళన, విచారం లేదా భయం,స్నేహితులు, కుటుంబ సభ్యులతో నిరంతరం పోరాటం,వాదించడం, మానసిక స్థితి, వెనుకటి ఆలోచనలను తలచు కోవడం ,రోజువారీ కార్యకలాపాలు,పనులను నిర్వహించలేకపోవడం,మానసిక క్షోభ ఇవి అన్ని మానసిక రుగ్మత లక్షణములుగా ఉదహరించ వచ్చును. మానసిక ఆరోగ్య రుగ్మతలకు చికిత్స ఒకటే సరిపోదు,ఇది నివారణను అందించదు. దీనికి వైద్యులు పలు రకాలుగా చికిత్స లక్షణాలను గమనించి ,తగ్గించడం వంటివి చేస్తారు. మానసిక ఆరోగ్య రుగ్మతలకు చికిత్స చేయడానికి నాలుగు రకములుగా విభజించి, ఈ మందులతో వైద్యం చేయడానికి ప్రయత్నిస్తుంటారు , అవి యాంటిడిప్రెసెంట్స్, యాంటీ-యాంగ్జైటీ మందులు , యాంటిసైకోటిక్ మందులు,మూడ్-స్టెబిలైజింగ్ మందులు. వైద్యులు సైకోథెరపీ, ఆసుపత్రి, ఇంటిలో చికిత్స జీవనశైలి చికిత్స, మానసిక ఆరోగ్య చికిత్స లాంటివి మానసిక రుగ్మత బారిన పడిన వ్యక్తులకు చికిత్స చేస్తారు ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంచడం, మానసిక ఆరోగ్యానికి మద్దతుగా ప్రయత్నాలను సమీకరించడం మొత్తం లక్ష్యంతో ప్రతి సంవత్సరం అక్టోబర్ 10 న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ( w .h .o ) తెలిపిన నివేదిక ప్రకారం, భారతదేశంలో మానసిక ఆరోగ్య శక్తి అంతగా లేదని, మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్యతో పోల్చితే దేశంలో మానసిక వైద్యులు, మనస్తత్వవేత్తల కొరత ఎక్కువగా ఉందని WHO పేర్కొంది. భారతదేశంలో, (100,000 జనాభాకు) మనోరోగ వైద్యులు (0.3), నర్సులు (0.12), మనస్తత్వవేత్తలు (0.07), సామాజిక కార్యకర్తలు (0.07) ఉన్నారని WHO పేర్కొంది, అయితే కావాల్సిన సంఖ్య 100,000 జనాభాకు 3 మానసిక వైద్యులు, మనస్తత్వవేత్తల కంటే ఎక్కువ, 7.5 శాతం మంది భారతీయులు కొంత మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని WHO అంచనా వేసింది , ఈ సంవత్సరం చివరినాటికి భారతదేశంలో సుమారు 20 శాతం మంది మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని అంచనా వేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య లెక్కలను చూస్తే 56 మిలియన్ల భారతీయులు నిరాశతో బాధపడుతున్నారు, 38 మిలియన్ల మంది భారతీయులు ఆందోళన రుగ్మతలతో బాధపడుతున్నారు