త్రివర్ణ పదార్ధాలు https://te.wikipedia.org/wiki/%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A3_%E0%B0%AA%E0%B0%A6%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A7%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81 త్రివర్ణ పదార్ధాలు అనగా నారింజ, తెలుపు, ఆకుపచ్చ రంగుల పదార్ధాలు. మూడురంగుల జెండా చూసినప్పుడల్లా ముచ్చటగా ఉంటుంది . అలాగే ఆ మూడు రంగుల పదార్ధాలు తినడము వల్ల మనకెంతో లాభము ఒనగూడుతుంది. ఏమిటా లింక్ అని నవ్వుకున్నా .... నారింజ, తెలుపు, ఆకుపచ్చ రంగుల పదార్ధాలు మన ఆరోగ్యానికి మంచిది . ఈ రంగులో ఉండే పండ్లు, కూరగాయల్లో బీటా-కెరటిన్‌, విటమిన్‌ "సి" అత్యధికంగా లభిస్తాయి. వయసు రీత్యా లోపించే దృష్టి మెరుగవడానికి సహకరించే పోషకాలు వీటిలో ఉంటాయి. క్యాన్సర్ ను అడ్డుకోగలవు, కొలెస్టరాల్, రక్తపోటు లను తగ్గించి కొలాజెన్‌ ఏర్పడడాన్ని మెరుగుపరుస్తాయి. ఆరోగ్యవంతమైన జాయింట్స్ కు దోహదపడతాయి. ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది . ఇతర ప్రోటీన్లు, జీర్ణసంబంధిత ఎంజైములు, విటమిన్‌ " ఎ", " ఇ ", లు పొటాషియం లభిస్తాయి. సహజసిద్ధమైన లాక్జేటివ్స్ కలిగి ఉంటాయి. రోగనిరోధక వ్యవస్థను ఆందించే పోషకాలు తెల్లని పదార్థాలలో ఉంటాయి . కొలెస్టరాల్ , రక్తపోటుస్థాయి సరిగా ఉంచుకునేందుకు సహకరిస్తాయి. తెలుపు రంగు గల కొన్ని పదార్ధాలు : ఈ రంగు పండ్లు , కూరలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి . క్లోరొఫిల్ , పీచుపదార్థము , ఫోలిక్ యాసిడ్ , కాల్సియం , విటమిన్‌ " సి " , బీటాకెరటిన్స్ లభిస్తాయి . ఈ రంగు పదార్ధాలలోని పోషకాలు క్యాన్సరు వచ్చే ప్రమాదాలను తగ్గిస్తాయి . రక్తపోటు, క్లెస్టరల్ స్థాయిలను తగ్గిస్తాయి. జీర్ణక్రియకు దోహదపడి , కంటి ఆరోగ్యానికి , దృష్టికి సహకరిస్తాయి . ఫ్రీ రాడికల్స్ ను తగ్గించి రోగనిరోధ వ్యవస్థను మెరుగుపరుస్తాయి .