వైద్యశాల https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B1%88%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B2 వైద్యశాల లేదా ఆసుపత్రి లేదా దవాఖానా అనబడే ప్రదేశంలో వైద్యసహాయం అందించబడుతుంది. సాధారణంగా వ్యాధిగ్రస్తులు లేదా రోగులు ఇక్కడ చేర్చుకోబడి చికిత్స పొందుతారు. ప్రస్తుత కాలంలో ఆసుపత్రులు ప్రభుత్వం, ఇతర నాన్ ప్రాఫిట్ సంస్థలు, ప్రాఫిట్ సంస్థల ఆర్థిక సహాయంతో నడుపబడుతుంటాయి. చరిత్రలో చూస్తే ఈ వైద్యశాలలు మత సంస్థల ద్వారాగాని దయామయ పెద్దమనుషుల సహకారంతోగాని స్థాపించబడునాయి. ప్రస్తుతము ఆసుపత్రుల్లో వివిధ రంగాల్లో నిపుణత కలిగిన వైద్యులు, శస్త్ర చికిత్సా నిపుణులు, నర్సులు వారి వారి వృత్తి ధర్మాలను నిర్వర్తిస్తుంటూ ఉంటారు. పూర్వపు సంప్రదాయాలలో వైద్యశాలలు మతంతో ముడిపడి ఉండేవి. ఈజిప్టులో గుళ్ళలో వైద్యసహాయం అందించబడడం చరిత్రలో మొట్టమొదటిసారిగా జరిగినట్లు తెలుస్తుంది. గ్రీకు గుళ్ళలో వ్యాధులను నయం చేయగలిగే Asclepius దేవుడి గుళ్ళలో వ్యాధి గ్రస్తులను చేర్చుకొని ఆ దేవుడి వారికి కలలో కనిపించి సహాయం చేసే వరకు ఉంచేవారు. రోమన్లు కూడా ఆ దేవున్ని Æsculapius పేరుతో కొలిచేవారు. ఆ పేరుతో ఒక ద్వీపంలో రోమ్‌లోని టిబెర్ ప్రాంతంలో 291 BCలో దేవాలయం కట్టించబడింది. ఆయుర్వేద వైద్యశాలలు: హోమియోపతిక్ వైద్యశాలలు: ఆంగ్ల వైద్యశాలలు: యునాని వైద్యశాలలు: ప్రభుత్వ ఆసుపత్రులు: ప్రైవేటు ఆసుపత్రులు: పట్టణ ఆసుపత్రులు: పల్లె ఆసుపత్రులు:వైద్య విజ్ఞాన సంస్థReputed Hospital in kerala, India for sale (medieval hospitals in India) Jean Manco, The Heritage of Mercy (medieval hospitals in Britain) Last Resort: Hospital Care in Canada (an illustrated historical essay) A Key Resource for Hospitals and Healthcare Management