వైద్యశాస్త్రం https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B1%88%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82 వైద్యం లేదా వైద్య శాస్త్రం (Medicine or Medical Sciences) జనుల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి, అనారోగ్యాన్ని, గాయాలను నివారించడానికి ఉపయోగపడే విజ్ఞానశాస్త్ర విభాగం.మౌలికమైన విజ్ఞానశాస్త్రానికీ, దానిని ఆచరణలో వినియోగించే విధి విధానాలకూ కూడా వైద్యం అనే పదాన్ని వాడుతారు. ఆధునిక కాలంలో మానవుల జీవన ప్రమాణాలు, జీవిత కాలాలు పెరగడానికి వైద్యశాస్త్రం ఇతోధికంగా తోడ్పడింది. దారులు వేరైనా గమ్యం ఒక్కటే అన్నట్లుగా వైద్యవిధానాలు ఏవైనా రోగిని స్వస్థత చేకూర్చేందుకే అనే విషయం గుర్తించాలి. ఒక వైద్య విధానముతో లొంగని జబ్బు మరొక విధానముతో తగ్గవచ్చును . ఈ క్రింద పేర్కొన్నవి కొన్ని ముఖ్యమైనవి . అల్లోపతీ ఆయుర్వేదం హొమియోపతీ సిద్ధ యునానీ మూలికా వైద్యం ప్రకృతి వైద్యం యోగ ఆక్యుపంచర్ మేగ్నటోథెరఫీ ఫిజియోథెరఫీ క్రీడల వైద్యం జానపద వైద్యం గృహవైద్యం భూతవైద్యంవివిధ రకాల వైద్య పద్ధతులకు వివిధ స్థాయిలలో విద్యావకాశాలున్నాయి. సహాయ ఆరోగ్య లేక పారా మెడికల్ సిబ్బంది శిక్షణకు సంవత్సర, రెండేళ్ల కాల కోర్సులున్నాయి. వీటిని ఆంధ్ర ప్రదేశ్ పారామెడికల్ బోర్డ్ నియంత్రిస్తుంది. వీటికి ఇంటర్ ఉత్తీర్ణత అర్హత. ఇవేకాక, స్వతంత్ర ప్రతిపత్తిగల, ఇన్సిట్యూట్ అఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, హైద్రాబాద్ లో వైద్య ప్రయోగశాల సాంకేతిక శాస్త్రంలో రెండు సంవత్సరాల డిప్లొమా కోర్సు (లాబ్ టెక్నీషియన్) 10 వతరగతి విద్యార్హతగా నిర్వహించుతున్నది. 1947లో ఏర్పడిన ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నర్సింగ్ విద్యను పర్యవేక్షిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో వైద్యవిద్యా సంచాలకుని కార్యాలయం నియంత్రిస్తుంది. ప్రవేశాలను ఎన్.టి.ఆర్. ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయం ఇంటర్లో మార్కులు ఆధారంగా నిర్వహిస్తుంది. 1949లో ఏర్పడిన ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫార్మసీ విద్యను నియంత్రిస్తుంది. ఈ విద్యని భారతీయ వైద్య మండలి నియంత్రిస్తుంది. చాలా రాష్ట్రీయ విద్యాలయాలు, జాతీయ విద్యాలయాలలో ఇది చదవవచ్చు. ప్రథమ సంపర్క వైద్యునికి కావల్సిన జ్ఞానం, నైపుణ్యతలు, నడవడిక సమకూరేటట్లుగా విద్యావిషయాలుంటాయి. 4.5 సంవత్సరాల చదువు తర్వాత ఒక సంవత్సరం ఆసుపత్రిలో శిక్షక వైద్యుడిగా పనిచేయాల్సివుంటుంది. శరీర నిర్మాణం, మానవ జీవక్రియలు, జీవరసాయన శాస్త్రం, మానవీయ శాస్త్రాలు, సముదాయ ఆరోగ్యం, రోగము, సూక్ష్మజీవ శాస్త్రం, మందుల శాస్త్రము, నేరపరిశోధనలో సహకరించే వైద్య విషయాలు, రసాయనాల విషతుల్యత, సముదాయ ఆరోగ్యం, వైద్యం, శస్త్ర చికిత్స, అనుబంధ విషయాలు ఈ కోర్సులో భాగం. ఈ విద్యని డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నియంత్రిస్తుంది. దంత వైద్యునిగా విద్యార్థిని తయారు చేసేది ఈ బిడిఎస్ కోర్సు. ఆసుపత్రి శస్త్రచికిత్స శిక్షణ (హౌస్ సర్జన్) తో కలిపి 5 సంవత్సరాలు. ఎంబిబిఎస్ లో విషయాలన్నీ దీనిలో వుంటాయి. ఇవికాక, డెంటల్ మెటీరియల్స్, ఓరల్ పాథాలజీ, ఓరల్ సర్జరీ వుంటాయి. రెండో ఏడాది నుండే ప్రయోగ అనుభవం వుంటుంది.అందుకని కోర్సు ముగిసేసరికి ఉపాధికి తయారుగా వుంటారు. నిపుణుడైన వైద్యుని దగ్గర రెండేళ్లు పనిచేస్తే చికిత్సా విధానాలపై అవగాహన కలుగుతుంది. జనాభాలో 90 శాతం మంది దంత సమస్యలకు లోనవ్వుతున్నారు. అయితే లక్ష మందికి కూడా ఒక్క దంత వైద్యుడు లేరు.అందువలన ప్రభుత్వ ఉద్యోగమే కాక ప్రైవేటు ప్రాక్టీస్ కు అవకాశాలెక్కువ. ప్రభుత్వ ఉద్యోగాలలో ఎంబిబిఎస్ తో సమానంగా జీత భత్యాలుంటాయి. ఇంటర్ జీవ, భౌతిక, రసాయనిక శాస్త్ర ఐచ్ఛికాంశాలతో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవారిని ప్రవేశ పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో ఈ ప్రవేశపరీక్షని ఎమ్సెట్ అంటారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉపాధి అవకాశాలు వివిధ స్థాయిలలో ఉన్నాయి. తెలంగాణ వైద్య విధాన పరిషత్తుFeyerabend, Paul K. 2005. మెడికల్ డిక్షనరీ-డా.కె.వి.ఎన్.డి ప్రసాద్ మెడికల్ గైడ్ వ్యాధులు-మందులు-డా.కె.వి.ఎన్.డి ప్రసాద్