నాడి (యోగా) https://te.wikipedia.org/wiki/%E0%B0%A8%E0%B0%BE%E0%B0%A1%E0%B0%BF_(%E0%B0%AF%E0%B1%8B%E0%B0%97%E0%B0%BE) సుషుమ్న నాడి : మానవ శరీరమునందు 72,000 నాడులు కలవని అనేక శాస్త్రములు (స్వరశాస్త్రమంజరి) వివరిస్తున్నవి.ఉపనిషత్త్ లలో కుండలిని ఉపనిషద్, యోగోపనిషద్,దర్శనొపనిషద్ వంటి అనేక యొగ గ్రంథములలో కూడా వివరణ ఉంది. యోగ సాధనలోని ఆసనముల-ప్రాణాయామ పద్ధతుల ద్వారాను- ధారణ ధ్యానాదుల సాధనచేతను శరీరమందలి నాడులను శుభ్రపరచి,మూలాధారమునందు నిదురించుచున్న శక్తిని ఉత్తేజపరచ వచ్చును. ఇడ (ఎడమ నాసగ్రము నందు)నాడి-పింగళ నాడి (కుడి నాసాగ్రమున)సుషుమ్న (నాసాగ్రము మధ్యన)కలదు. ఇడా నాడిని చంద్ర నాడి అని, పింగళనాడిని సూర్య నాడి అని కూడా చెప్పెదరు. ఈ నాడుల ఉద్దీపనను కుండలిని ఉద్దీపనము అని కూడా అనవచ్చును. ప్రాశ్ఛాత్యుల శాస్త్రము ప్రకారము మెదడులో గల భాగములలో ఎడమ భాగమునకు కుడి నాసాగ్రముతొను - మెదడు లోని కుడిభాగము నకు ఎడమ నాసాగ్రముతొను సంబంధము కలదు .అనగా సింపతటిక్, పరాసింపతటిక్ అన్ద్ సెంట్రల్ నెర్వస్ సిస్ట్మ్. మెదడులోని ప్రతీ కణమునకు నాడులు కలుపబడి ఉన్నాయి. ఆనాడులు మానవ శరీరమందలి అన్ని భాగములకు ప్రాణశక్తిని అందించుచున్నవి.