మకరాసనము https://te.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B0%95%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B8%E0%B0%A8%E0%B0%AE%E0%B1%81 మకరాసనము (సంస్కృతం: मकरसन) యోగాలో ఒక విధమైన ఆసనం. ఈ ఆసనంలో శరీరం మకరం లేదా మొసలిని పోలి ఉండటం వల్ల దీనికి మకరాసనమని పేరువచ్చింది. బోర్లా పడుకుని వేసే ఆసనాల మధ్య మధ్య విశ్రాంతి తీసుకోవడానికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది. వెన్నెముకకు, పొట్ట కండరాలకు, మిగతా అవయవాలకు విశ్రాంతిని కలుగజేసి నిద్రలేమి, రక్తపోటు వంటి వ్యాధులనుండి విముక్తి కలిగిస్తుంది. కాళ్ళు చాపి, బోర్లా పడుకొని చేతులపై చెంప ఆనించాలి. కాలి మడమలు లోపలివైపు, వేళ్ళు బయటివైపు ఉంచాలి. శ్వాస, ప్రశ్వాసలు మెల్లగా తీసుకోవాలి.