ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి https://te.wikipedia.org/wiki/%E0%B0%8E%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B5%E0%B1%80_%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D_%E0%B0%95%E0%B0%82%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%86%E0%B0%B8%E0%B1%81%E0%B0%AA%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి (ఆంగ్లం:The L V Prasad Eye Institute (LVPEI) 1987లో హైదరాబాదులో స్థాపించబడింది. ఇది లాభాపేక్ష లేని, ప్రభుత్వేతర నేత్ర వైద్యశాల. సమాజంలోని అన్ని వర్గాలకు సమానమైన , సమర్థవంతమైన కంటి సంరక్షణ LVPEI సంస్థ యొక్క లక్ష్యం. ఈ సంస్థ గుళ్ళపల్లి నాగేశ్వరరావు ద్వారా స్థాపించబడింది. 30 ఏళ్ల క్రితం చిన్న ఇన్సిస్ట్యూట్‌గా మొదలై అంతర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకుంది. ప్రముఖ భారతీయ చలన చిత్ర నిర్మాత ఎల్. వి.ప్రసాద్ ఈ నేత్ర వైద్యశాల స్థాపన కొరకు బంజారా హిల్స్లో 10 మిలియన్ల రూపాయల ధనం, 5 ఎకరాల స్థలం దానం చేసాడు. ఆయన చేసిన త్యాగానికి గుర్తుగా ఆ సంస్థకు ఆయన పేరును ఆ సంస్థ పేరు ముందు ఉంచారు. LVPEI సుమారు 23.8 మిలియన్ల ప్రజలకు తన సేవలనందించింది. అందులో 50% ఉచితంగా, సంక్లిష్టతతో సంబంధం లేకుండా అవసరమైన వైద్యాన్ని అందించింది. LVPEI నెట్‌వర్క్ : బంజరా హిల్స్ లో ప్రదాన కేంద్రం, డా.రెడ్డి లాబ్స్ వ్యవస్థాపకుడు కల్లం అంజిరెడ్డి తరువాత పేరుపెట్టబడింది. 16 మాధ్యమిక కేంద్రాలు 160 ప్రాథమిక సంరక్షణా కేంద్రాలు జీనోమ్ వ్యాలీలో కూడా తన కార్యకలాపాలును ప్రారంభించింది.మాధ్యమిక, ప్రాథమిక సంరక్షణ కేంద్రాలు వైద్య సేవలను దేశ వ్యాప్తంగా గ్రామీన ప్రాంతాలకు అందిస్తాయి. The RIEB set up the Hyderabad Cornea Preservation Medium Centre which uses a McKarey Kauffman (MK) Medium. హైదరాబాద్‌లో ఆసుపత్రి పెట్టాలనుందని అమెరికా నుంచి ఎన్టీఆర్‌కు లేఖ రాశా..