ఇందిరాగాంధీ అంతర్జాతీయ పశు పరిశోధన కేంద్రం https://te.wikipedia.org/wiki/%E0%B0%87%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF%E0%B0%B0%E0%B0%BE%E0%B0%97%E0%B0%BE%E0%B0%82%E0%B0%A7%E0%B1%80_%E0%B0%85%E0%B0%82%E0%B0%A4%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9C%E0%B0%BE%E0%B0%A4%E0%B1%80%E0%B0%AF_%E0%B0%AA%E0%B0%B6%E0%B1%81_%E0%B0%AA%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8B%E0%B0%A7%E0%B0%A8_%E0%B0%95%E0%B1%87%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82 ఇందిరాగాంధీ అంతర్జాతీయ పశు పరిశోధన కేంద్రం (ఐజికార్ల్‌) ను 200 వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి పులివెందులలో అంతర్జాతీయ పశు పరిశోధనా కేంద్రం (ఐజికార్ల్‌)ను పులివెందుల పెద్దరంగాపురం సమీపంలో ఏర్పాటు చేశారు. 650 ఎకరాలు కేటాయించారు . 2009 జనవరి 25న ప్రారంభించారు. ఇందులొ పరిశోధనా క్షేత్ర భవనం, ఉద్యోగుల నివాసం, అతిథి గృహాలు, క్యాంటీన్‌, ల్యాబొరేటరీలు, శాస్త్రజ్ఞుల హాస్టళ్లు, సబ్‌స్టేషన్‌, రోడ్లు, వాణిజ్య సముదాయం, మిగతా అత్యాధునిక భవనాలతో పాటు తదితర అత్యున్నతస్థాయి ప్రమాణాలతో నిర్మీంచారు . ఈ సంస్థ ద్వారా అభివృద్ధి ఫలాలను దేశ రైతాంగానికేకాక ప్రత్యేకించి ఆసియా, ఆప్రికా, లాటిన్‌ అమెరికా దేశాల రైతాంగానికి కూడా లబ్ధిచెకూరుతుంది . 77 ఎకరాల్లో ఈ పరిశోధనా కేంద్రాన్ని నిర్మాణం పూర్తిచేశారు. పశువులకు వచ్చే గాలికుంటువ్యాధి, ఆంత్రాక్స్ తదితర రోగాలు, అణురూప, కణజన్యు శాస్త్రం, పునరుత్పత్తి, శీతలీకరణ జీవశాస్త్రం, నానో బయాలజీ, పశుపోషణ, ఇమ్యునాలజి, నాణ్యత నియంత్రణలపై పరిశోధనలు చేసేందుకు ఈ కేంద్రం నిర్మించారు. తద్వారా పశువులకు సంబంధించిన వ్యాక్సిన్లు, మందులు కనుగొనాలనేది ఉద్దేశం . అత్యున్నతస్థాయి ప్రమాణాలతో 386 కోట్లతో రూపొందించిన కూడా వాడకం లేనందున భవనాలు నిరుపయోగంగా ఉన్నాయి.