పరిసరాల పరిశుభ్రత https://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B8%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B2_%E0%B0%AA%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B6%E0%B1%81%E0%B0%AD%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4 పరిసరాల పరిశుభ్రత అనగా మన ఇంటి చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకోవడం. అంటువ్యాధుల విజృంభణకు కారణాలు పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం చెత్తను, రకరకాల వ్యర్థపదార్థాలను, సక్రమంగా నిర్మూలించక నిర్లక్ష్యం చేయడం. బహిరంగ మలవిసర్జన. బహిరంగ మురుగునీటిపారుదల కలుషితమైన నీరు తాగడం. దోమల నిర్మూలన చేయకపోవడంవ్యర్థాల నిర్మూలన పాటించక పోవటం : మన ఇళ్ల నుంచి వచ్చే చెత్తను శాస్త్రీయంగా నిర్మూలించకపోవం వల్ల ఈగలు, దోమలు పుట్టి పెరిగి అంటు వ్యాధులను వ్యాపింపచేస్తున్నాయి. చెత్త నిర్మూలన కార్యక్రమానికి దీర్ఘకాల వ్యూహం ఈనాటి తక్షణ అవసరం ! శుభకార్యాల సందర్భంలో వచ్చే చెత్తను సరైన విధంగా నిర్మూలించాలి. రెండు, మూడు నెలలుగా విషజ్వరాలు మన సమాజాన్ని పట్టిపీడిస్తున్నాయి. వైద్య, ఆరోగ్య శాఖ డాక్టర్లు ఈ జ్వరాలకు సమర్ధవంతంగా వైద్యం చేస్తున్నారు. అయితే, ఈ జ్వరాలు రాకుండా చేయడంగానీ, చాలా వరకు తగ్గించడం గానీ, సాధ్యం కాదా? దగ్గినప్పుడో, గాలి ద్వారా ఫ్లూ, క్షయ వంటి వ్యాధులు వ్యాపిస్తాయి. మానవ మలమూత్రాల వల్ల, మురుగు వల్ల, రక్షణలేని తాగునీటి వల్ల కలరా, అతిసార, టైఫాయిడ్‌ కామెర్ల వంటి జబ్బులు వ్యాపిస్తాయి. వెక్టర్‌ బోరన్‌ డిసీజెస్‌ : దోమల వల్ల వ్యాపించే మలేరియా, ఫైలేరియా (బోదకాలు), డెంగ్యూ, చికున్‌ గున్యా, మెదడు వాపు వంటి వ్యాధులు. గాలి ద్వారా వ్యాపించే క్షయ, ఫ్లూ జ్వరాలకు టీకాలు వేయవచ్చు. మిగతా అంటువ్యాధలను నివారించే మార్గాలు చర్చించాలి. వ్యర్థాలను సక్రమంగా పారవేద్దాం పరిసరాలను శుభ్రంగా ఉంచుకుందాం అంటువ్యాధుల్ని తరిమేద్దాంబహిరంగ మల విసర్జన : ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైన ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించకపోతే ఈగలు, పురుగుల ద్వారా విసర్జిత మలం నీటిలోనికి, ఆహారంలోకి చేరి తద్వారా నోటిలోనికి చేరి అంటువ్యాధులు వ్యాపిస్తాయి. దీని వల్ల వచ్చే జబ్బులైన టైఫాయిడ్‌, కలరా, అతిసార, కామెర్లు వంటి వ్యాధుల్ని అరికట్టలేం. దీనికి ఏకైక పరిష్కారం వ్యక్తిగత మరుగుదొడ్ల వాడకం మాత్రమే. కేరళలో 40ఏళ్ల క్రితమే ప్రతి ఇంటికి సెప్టిక్‌ లెట్రిన్‌ అమరింది. అక్కడ బహిరంగ మలవిసర్జన లేదు. వ్యక్తిగత మరుగుదొడ్డి ఉన్న వాళ్లకు కూడా అది లేని వారితో ప్రమాదమే. అందుచేత నూటికి నూరుమంది మరుగుదొడ్లు ఉండాల్సిందే ! బహిరంగ మురుగుపారుదల వ్యవస్థ : పరిసరాల పరిశుభ్రతే మన తొలిప్రాధాన్యం కావాలి. బహిరంగ మురుగుపారుదల స్థానంలో మూసిన పారుదల అత్యవసరంగా ఏర్పడాలి. దీనికి వేలకోట్ల ఖర్చయ్యే మాట నిజమే. కానీ ప్రజల నుండి ఒత్తిడి వస్తే, పాలకులకుచిత్త శుద్ధి ఉంటే, వేలాది కోట్ల స్కామ్‌లను ఆపగలిగితే అసాధ్యం కానే కాదు. ప్రస్తుతం మాత్రం కనీసం మురుగుకాల్వలలో నీరు నిల్వఉండ కుండానైనా జాగ్రత్తలు తీసుకోవాలి. టీ కప్పులు, మంచినీళ్ల గ్లాసులు, విస్తర్లు మొదలైన ప్లాస్టిక్‌ వ్యర్థాలను మురుగు కాల్వలలో వేయకూడదు. ఇంకా దోమల నిర్మూలనకు చేపట్టాల్సిన కార్యక్రమాలు అన్ని ప్రారంభించాలి.