ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం https://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AA%E0%B0%82%E0%B0%9A_%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A5%E0%B0%AE_%E0%B0%9A%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B8_%E0%B0%A6%E0%B0%BF%E0%B0%A8%E0%B1%8B%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B8%E0%B0%B5%E0%B0%82 ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబరు రెండవ శనివారం రోజున నిర్వహించబడుతుంది. ప్రథమ చికిత్సపై ప్రజల్లో అవగాహన పెంచడానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2000 సంవత్సరంలో ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్‌క్రాస్ అండ్ రెడ్‌ క్రెసెంట్ సొసైటీస్ (ఐఎఫ్ఆర్సి) ఈ దినోత్సవాన్ని ప్రవేశపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 100 రెడ్‌క్రాస్‌ సొసైటీల ద్వారా ప్రథమ చికిత్సలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రమాదాలు సంభవించినప్పుడు చేయవలసిన ప్రథమ చికిత్స గురించి విద్యార్థులకు తెలియజేయడంతోపాటు పాము కాటు, నీట మునగడం, అగ్నిప్రమాదం, మూర్చ, వడదెబ్బ లకు ప్రథమ చికిత్స ఎలా చేయాలో దృశ్యంగా చూపించడం. ప్రథమ చికిత్స ప్రాముఖ్యతను తెలుపుతూ విద్యార్థులతో ప్రథమ చికిత్స ప్రతిజ్ఞ చేయించడం