అమృతాంజనం https://te.wikipedia.org/wiki/%E0%B0%85%E0%B0%AE%E0%B1%83%E0%B0%A4%E0%B0%BE%E0%B0%82%E0%B0%9C%E0%B0%A8%E0%B0%82 అమృతాంజనం (ఆంగ్లం: Amrutanjan) అనునది నొప్పి నివారిణిగా వాడబడే ఔషధతైలం. ఇది అమృతాంజన్ హెల్త్ కేర్ అనే సంస్థకు చెందినది. అమృతాంజం పేరు అమృతం + అంజనం అనే రెండు తెలుగు పదాల కలయికతో ఏర్పడింది. అమృతాంజనం అనబడే ఈ ఔషధ తైలాన్ని 1893 లో భారత స్వాతంత్ర్య సమరయోధుడు, జర్నలిస్టు అయిన కాశీనాథుని నాగేశ్వరరావు కనుగొన్నారు. ఈ ఔషధంతో ఆయన ప్రసిద్ధి చెందాడు. ఆయన సంగీత కచేరీలలో ఉచితంగా సరఫరా చేసేవారు. ప్రస్తుతం కూడా ఈ ఔషధం ప్రసిద్ధి పొందినది. అమృతాంజన్ లిమిటెడ్ గా 1936 లో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా రూపుదిద్దుకొన్నది. ఈ ఔషధాన్ని తలనొప్పికి ఎక్కువగా వాడుతారు. ఈ ఉత్పత్తి అమృతాంజన్ హెల్త్‌కేర్కు చెందినది. ఇది ప్రస్తుతం శంభుప్రసాద్ (కాశీనాధుని నాగేశ్వరరావు గారి మనుమడు) చే నిర్వహింపబడుతున్నది.