కొవిషీల్డ్ https://te.wikipedia.org/wiki/%E0%B0%95%E0%B1%8A%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B7%E0%B1%80%E0%B0%B2%E0%B1%8D%E0%B0%A1%E0%B1%8D ఇది కోవిడ్-19 వ్యాధి నివారణకు భాగస్వామ్యంలో తయారైన కొవిషీల్డ్ వ్యాక్సిన్.ఇదిఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం , జెన్నర్ ఇన్స్టిట్యూట్ వద్ద అభివృద్ధి చేయబడిఎం, బ్రిటిష్ ఔషధ తయారీదారు ఆస్ట్రాజెనెకా నుండి లైసెన్స్ పొంది భారతదేశంలో సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూణే వద్ద ప్రయోగశాలలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ అభివృద్ధి చేయబడింది. భారతదేశంలో కోవిషీల్డ్ కోసం ఫేజ్ -3 క్లినికల్ ట్రయల్స్ నమోదు పూర్తయినట్లు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) నవంబరు 12 ,2020 న ప్రకటించాయి.క్లినికల్ ట్రయల్ సైట్ ఫీజులకు ఐసిఎంఆర్ నిధులు సమకూర్చగా, ఎస్ఐఐ కోవిషీల్డ్ కోసం ఇతర ఖర్చులకు నిధులు సమకూర్చింది.ఎస్ఐఐ, ఐసిఎంఆర్ లు దేశవ్యాప్తంగా 15 వేర్వేరు కేంద్రాలలో కొవిషీల్డ్ యొక్క రెండవ , మూడవ దశలలో క్లినికల్ పరీక్షలు నిర్వహిస్తున్నాయి.. ఈ దశలలోని క్లినికల్ ట్రయల్స్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ యొక్క భద్రత, సమర్థతపై డేటాను అందిస్తుంది. దీనివలన దేశంలోని అనేక ప్రదేశాలకు చెందిన జనాభాపై పరీక్షించడం వల్ల వ్యాక్సిన్ వివిధ ప్రాంతాల ప్రజల వివిధ విభాగాలపై ఎలా పనిచేస్తుందో బాగా అర్థం చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది.యునైటెడ్ కింగ్‌డమ్ ‌లో తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్, యుకె, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, యుఎస్‌ఎ లలో జరుగుతున్న ప్రయత్నాలలో కూడా పరీక్షించబడుతోంది.ఒక వేళ ఈ ప్రయత్నాలు విజయవంతం అయితే అవసరమైన రెగ్యులేటరీ అనుమతులు పొందిన తరువాత ఇది వాణిజ్య పరంగా విడుదల చేయబడుతుంది.ప్రస్తుతానికి భారత ప్రభుత్వ నియంత్రణ సంస్థల నుంచి వ్యాక్సిన్ గా మార్కెట్ లో ప్రవేశ పెట్టటానికి ఆమోదం రాలేదు.