బి. సి. జి టీకా https://te.wikipedia.org/wiki/%E0%B0%AC%E0%B0%BF._%E0%B0%B8%E0%B0%BF._%E0%B0%9C%E0%B0%BF_%E0%B0%9F%E0%B1%80%E0%B0%95%E0%B0%BE బాసిల్లస్ కాల్మెట్-గురిన్ (బిసిజి) వాక్సిన్ అనేది ప్రధానంగా క్షయ వ్యాధిని నిరోధించటానికి ఉపయోగించే టీకా. క్షయ వ్యాధి లేదా కుష్టు వ్యాధి సాధారణంగా ఉన్న దేశాలలో, ఆరోగ్యకరమైన శిశువులకు వారు పుట్టిన సమయాన్ని బట్టి వీలైనంత త్వరగా ఒక మోతాదు వారికి వేయాలని సిఫార్సు చేయబడింది. హెచ్‌ఐవి/ఎయిడ్స్ ఉన్న పిల్లలకు టీకాలు వేయకూడదు. క్షయవ్యాధి సాధారణం కాని ప్రదేశాలలో, క్షయవ్యాధి యొక్క అనుమానాస్పద కేసులు ఒక్కొక్కటిగా పరీక్షించబడి, చికిత్స చేయబడే సమయంలో అధిక ప్రమాదం ఉన్న పిల్లలు మాత్రమే ప్రత్యేకంగా అంటువ్యాధుల నుంచి రక్షణ పొందుతారు. క్షయవ్యాధి లేని, ఇంతకుముందు అంటువ్యాధుల నుంచి రక్షణ పొందని, కానీ తరచుగా వ్యాధికి గురయ్యే వయోజనులు అంటువ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. బిసిజికి బురులి అల్సర్ ఇన్ఫెక్షనుకు, ఇతర నాన్టబెర్క్యులస్ మైకోబాక్టీరియా ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడగలిగే కొంత ప్రభావాన్ని కలిగియుంది. అదనంగా ఇది కొన్నిసార్లు మూత్రాశయ క్యాన్సర్ చికిత్సలో భాగంగా ఉపయోగించబడుతుంది. రక్షణ రేట్లు విస్తృతంగా మారుతూ ఉంటాయి, అవి గడచిన పది నుంచి ఇరవై సంవత్సరాల మధ్యవి అయి ఉంటాయి. పిల్లలలో 20% మంది వ్యాధి బారిన పడకుండా ఇది నిరోధిస్తుంది, వ్యాధి బారిన పడిన వారిలో వ్యాధి పెరగకుండా సగం వరకు రక్షిస్తుంది. ఇంజెక్షన్ ద్వారా చర్మానికి టీకా ఇవ్వబడుతుంది. సాక్ష్యం ద్వారానైనా అదనపు మోతాదులకు మద్దతు లభించదు. ఇది కొన్ని రకాల మూత్రాశయ క్యాన్సర్ల చికిత్సలో కూడా ఉపయోగించబడుతుంది. తీవ్రమైన దుష్ప్రభావాలు చాలా అరుదు. ఇంజెక్షన్ చేసిన ప్రదేశంలో తరచుగా ఎర్రగా అవటం, వాపు, తేలికపాటి నొప్పి ఉంటుంది. మానిన తరువాత కొంత మచ్చతో ఒక చిన్న పుండు కూడా ఏర్పడవచ్చు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో దుష్ప్రభావాలు చాలా సాధారణంగా, మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. గర్భధారణలో సమయంలో ఉపయోగించటానికి ఇది సురక్షితం కాదు. ఈ టీకా మొదట మైకోబాక్టీరియం బోవిస్ నుండి అభివృద్ధి చేయబడింది, ఇది సాధారణంగా ఆవులలో కనిపిస్తుంది. ఇది బలహీనపడినప్పటికీ ఇప్పటికీ ఇది ప్రత్యక్షంగా ఉంది. బిసిజి వ్యాక్సిన్ వైద్యపరంగా 1921 లో మొదటసారి ఉపయోగించబడింది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క అత్యవసరమైన మందుల జాబితాలో ఉంది, ఇది ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థలో అవసరమయ్యే చాలా అతి ముఖ్యమైన మందు. 2014 నాటికి ఒక మోతాదుకు అయ్యే మొత్తం ఖర్చు 0.16 అమెరికా డాలరుగా ఉంది. యునైటెడ్ స్టేట్లలలో దీని ధర 100 నుండి 200 డాలర్లుగా ఉంది. ప్రతి సంవత్సరం సుమారు 100 మిలియన్ల పిల్లలకు ఈ టీకా ఇవ్వబడుతుంది.