హెపటైటిస్ బి టీకా https://te.wikipedia.org/wiki/%E0%B0%B9%E0%B1%86%E0%B0%AA%E0%B0%9F%E0%B1%88%E0%B0%9F%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8D_%E0%B0%AC%E0%B0%BF_%E0%B0%9F%E0%B1%80%E0%B0%95%E0%B0%BE హెపటైటిస్ బి అనేది ఒక టీకా, ఇది హెపటైటిస్ బి నుండి కాపాడుతుంది. మొదటి మోతాదు పుట్టిన 24 గంటలలోపు రెండు లేదా మూడు మోతాదులతో వేయాలని సిఫార్సు చేయబడింది. రోగనిరోధక శక్తి యొక్క పనితీరు తక్కువగా ఉన్న హెచ్ ఐ వి /ఎయిడ్స్ గలవారిలో, నెలలు నిండకుండా పుట్టిన వారికి ఈ మోతాదు సిఫార్సుచేయబడింది. ఆరోగ్యకరమైన వ్యక్తులలో, 95% కంటే ఎక్కువమందిలో వ్యాధి నిరోధక శక్తిని కలిగించటానికి క్రమబద్ధంగా చేసే టీకాల యొక్క ఫలితాలు భద్రపరచబడ్డాయి. అధిక ప్రమాదం ఉన్నవారికి టీకా పని చేసిందని నిర్ధారించడానికి చేసే రక్త పరీక్షను చేయాలని సిఫార్సు చేయబడింది. రోగనిరోధక శక్తి యొక్క పనితీరు తక్కువగా ఉన్నవారికి అదనపు మోతాదు అవసరం కావచ్చు కాని చాలా మందికి దీని అవసరం లేదు. హెపటైటిస్ బి వైరస్ బారిన పడిన వ్యక్తులు అంటే వ్యాధి నుండి రక్షణ కోసం టీకా పొందనివారిలో, టీకాతో పాటు అదనంగా హెపటైటిస్ బి ఇమ్యూన్ గ్లోబులిన్ ఇవ్వాలి. టీకా కండరానికి ఇంజక్షన్ ద్వారా ఇవ్వబడుతుంది. హెపటైటిస్ బి టీకా ద్వారా వచ్చే తీవ్రమైన దుష్ప్రభావాలు చాలా అసాధారణంగా వస్తాయి. ఇంజక్షన్ చేసిన ప్రదేశంలో నొప్పి రావచ్చు. గర్భాన్నిధరించిన సమయంలో లేదా తల్లి పాలిచ్చే సమయంలో దీని వాడకం సురక్షితంగా ఉంది. దీనికి గుల్లెయిన్-బారే సిండ్రోమ్‌తో సంబంధం లేదు. ప్రస్తుత టీకా రసాయనిక రీత్యా మరల కలిపే DNA పద్ధతులతో ఉత్పత్తి చేయబడుతుతుంది. ఇవి ఒకటిగా, ఇతర వ్యాక్సిన్లతో కలిపి లభిస్తుంది. మొదటి హెపటైటిస్ బి వ్యాక్సిన్‌, అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 1981 లో ఆమోదించబడింది. సురక్షితమైన రకం 1986 లో మార్కెట్‌లోకి వచ్చింది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క అత్యవసరమైన మందుల జాబితాలో ఉంది, ఇది ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థలో అవసరమైన చాలా అతి ముఖ్యమైన మందు. 2014 నాటికి ఒక మోతాదుకు మొత్తం ఖర్చు 0.58 నుండి 13.20 అమెరికా డాలర్లు ఉంది. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో దీని ధర 50 నుండి 100 డాలర్ల మధ్య ఉంది.