ఐసోనియాజిడ్ https://te.wikipedia.org/wiki/%E0%B0%90%E0%B0%B8%E0%B1%8B%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE%E0%B0%9C%E0%B0%BF%E0%B0%A1%E0%B1%8D ఐసోనియాజిడ్ (Isoniazid) లేదా ఐసోనికోటినైల్ హైడ్రజిన్ (isonicotinylhydrazine / INH), ఒక రకమైన మందు. ఇది క్షయవ్యాధి నివారణ, వైద్యంలో మొదటి శ్రేణిలో భాగంగా కీలకపాత్ర పోషిస్తుంది. ఇది మొదటిసారిగా 20వ శతాబ్దం మొదటి భాగంలో తయారుచేశారు, కానీ దీనియొక్క క్షయవ్యాధి నిరోధక లక్షణాలను 1950ల్లో గాని గుర్తించలేదు. మూడు బహుళార్థ ఫార్మసీ కంపెనీలు పేటెంట్ల కోసం ప్రయత్నించి విఫలమయ్యాయి (the most prominent one being Roche, which launched its version, Rimifon, in 1952). ఐసోనియాజిడ్ టాబ్లెట్లు, సిరప్, ఇంజక్షన్ రూపంలో లభ్యమౌతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా చౌకగా అందుబాటులో వుంటుంది.