డిడనొసిన్ https://te.wikipedia.org/wiki/%E0%B0%A1%E0%B0%BF%E0%B0%A1%E0%B0%A8%E0%B1%8A%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8%E0%B1%8D Didanosine, డిడనొసిన్ (2',3'-dideoxyinosine, ddI, brand name Videx®) అనేది HIV-1 చికిత్సలో ఉపయోగించె nucleoside reverse transcriptase inhibitors (NRTIs) అనె తరగతికి చెందిన ఒకానొక ఔషదము.దీనికు DDI పొడిపేరు. ఇది FDA (Food and Drug Administration of USA ) వారిచే HIV చికిత్స కోసం 31-Oct-2000 రోజున అమోదించబడింది. Didanosine టాబ్లెట్లను ఉదయం, సాయంత్రం తీసుకోవాల్సి వుంటుంది.. ఈ మందును పిల్లలకు టాబ్లెట్ ల రూపంలో ఇవ్వటానికి వీలులేదు, పౌడరు రూపంలో ఇవ్వవలసి ఉంటుంది. ఈ మందును తినకముందు మాత్రమే వేసుకొవాలి. తిన్న తర్వాత వేసుకుంటె ఈ మందు శరీరంలో సరిగ్గా కరగదు. ఈమందును ఒక్కదానినే వెసుకొకూడదు దీనితో పాటుగా ఇదే తరగతికి చెందిన కనీసం ఒక మందును అలాగే NNRTI కి చెందిన ఒక మందుతొ కలిపి వేసుకుంటెనే వైరస్ రెజిస్టెన్స్ ను నివారించవచ్చు.ఒక వేళ మీరు మీ డొసేజ్ ను మరిచిపొతె గుర్తుకు వచ్చిన వెంబడె వేసుకొనండి కాని రెండవ డొసు వెసుకొనే సమయం దాదాపు దగ్గరకు మొదటిడొసును వదిలివేయండం మంచిది. HIV తొ ఉన్న పెద్దలకు డొస్ 200 mg ( 60 Kgs కంటే ఎక్కువ బరువు వున్నవారికి) టాబ్లెట్ రెండుసార్లు ప్రతిరోజు వేసుకొవాలి.60 Kgs కంటే తక్కువ బరువు వున్నవారికి 125Mg టాబ్లెట్ రెండుసార్లు ప్రతిరోజు వేసుకొవాలి ఈ దుష్ప్రబావాలు (Side Effects ) అనెవి మందుల వల్ల వచ్చేవి, ఇవి అందరికి ఒకేలా ఉండవు. కొందరికి కొన్ని రావచ్చు అసలు రాకపోవచ్చు. కొన్ని దుష్ప్రబావాలు ప్రాణాంతకమైనవి వీటిని సరైన సమయంలో గుర్తించి రాకుండా వెరెమార్గాలను అన్వేషించవచ్చు. కళ్ళకు హాని: ఇది రావటం అరుదు. సాధారణంగా చిన్నపిల్లల్లో వస్తుంది. Pancreatitis: ఇది రావటం చాల అరుదు కాని విపరీత పరిణామాలకు దారి తీస్తుంది. కడుపునొప్పి, విరేచనాలు, వాంతులు, వాంతివచ్చేటట్టు అనిపించటం దీని ప్రధానలక్షణాలు. Pheripheral Neauropathy (నరాల బలహీనత) : Didanosine వల్ల వచ్చే దుష్ప్రబావాలలో ఇది సాధారణం. కాళ్ళు మొద్దుబారటం ( తిమ్మిర్లు) అలాగే జలదరించటం. అరికాళ్ళలో మంటలు. ముఖ్యంగా ఈ లక్షణాలు రెండుకాళ్ళలో కనిపిస్తుంది. ఈలక్షణాలను మొదట్లొనొ కనిపెట్టి ఈ మందును వాడటం అపివేసె ఇదే తరగతికి చెందిన (NRTIs) వెరె మందును మందును వాడి Pheripheral Neauropathy నివారించవచ్చును. ఈలాగె వాడితె నొప్పులు శాశ్వతంగా ఉండిపోయె ప్రమాదం ఉంది. ఈ లక్షణాలు కనిపిస్తె ఈ మందును మార్చడం కాని Dosage Adjustment చెయడం తప్ప వేరె ప్రత్యామ్నాయం లేదు. Lactic acidosis: ఇది NRTIs తరగతి మందుల తిసుకునే వారిలో వస్తుంది. రక్తంలో Lactic Acid ఉండవలసిన దానికంటె ఎక్కువ అవుతుంది (సాధారణంగా 0.50-2.20 mmol/L మధ్యలో వుండాలి). చాల అరుదుగా వస్తుంది. ప్రాణాంతకమైనది. వాంతులు, కడుపులో నొప్పి, నిస్సత్తువ, అలసట, శ్వాస తీసుకొవటంలో ఇబ్బంది వంటివి వీటి ప్రదాన లక్షణాలు. ఈ లక్షణాలు కనక కనిపిస్తే వెంబడె రక్తంలో Lactat Levels ను చూసి మీడాక్టరు ఈ వ్యాధి తీవ్రతను నిర్ణయిస్తాడు.మహిళలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. Lipodystrophy: కొన్ని NRTI తరగతికి చెందిన మందులవల్ల ఈ సమస్య వస్తుంది. కాళ్ళల్లొ, చెతుల్లో, మొహంలో కొవ్వు కుంచించికుపొతుంది. ఇది దీర్ఘకాలికంగా వాడినప్పుడు మాత్రమే వస్తుంది. కాళ్ళు, చేతులు సన్నబడిపోతున్నట్టు అనిపిస్తె వెంబడె మీ డాక్టరుగారిని సంప్రందించండి.అలాగే మీ శరీరంలో ఎక్కడైన కొవ్వు కుంచించుకు పోయినట్టు అనిపించిన మీ డాక్టరు గారిని సంప్రందించండి. సాధారణంగా వచ్చే దుష్ప్రబావాలు: వాంతులు, కడుపునొప్పి, విరేచనాలు, తలనొప్పి, ఆకలి మందగించటం. ఇవ్వన్ని కొన్ని రోజుల్లో మాయమవుతాయి.ఈ మందును వెసుకునేముందు మీడాక్టరుకు చెప్పాల్సిన విషయాలు. మీకు ఎదైన లివర్, కిడ్ని సమస్యలు వుంటె, ఇంతకు ముందు క్లొమ లోపం వచ్చివుంటె, ఇంతకు ముందు మీకు ఎప్పుడైన ఉన్నదానికంటె Lactate Levels ఎక్కువగా ఉండి ఉంటె, ఇంతకు ముందు Pheripheral Neauropathy (నరాల బలహీనత) ఇంతకు ముందు ఉండివుంటె.వీటిలో ఎదైన సమస్య ఉన్న వాళ్లు ఈ మందును తీసుకొకపొవచ్చు లేదా ప్రత్యేక పర్యవేక్షణలో తీసుకొనవలసి ఉంటుంది ఇది FDA వారిచే ప్రెగ్నెన్సి తరగతి B గా వర్గీకరించబడ్డది. అంటె దినిని జంతువల పై ప్రయొగించినపుడు పరీక్షలలో తెలినది ఏమిటంటె గర్బం లోని పిండానికి హాని చేకురుస్తుంది . కాని మనుషుల పైన సరియైన, కచ్చితమైన సమాచారం లేదు. గర్బిణి మహిళలు ఈ మందును వెసుకునెముందు డాక్టరుతొ చర్చించడం ఉత్తమం అలాగే బాలింత మహిళ పాలలో ఈ మందు ప్రాబవం పిల్లలపై ఎలా వుంటుంది అనే సమాచారం లేదు. అయితే HIV Positive గర్భవతి మహిళ తమ పిల్లలకు పాలు ఇవ్వకపొవడం మంచిది.