1. భావోద్వేగ మేధస్సు మరియు క్లిష్ట ఆలోచన పద్దతి .  శుభోదయం మిత్రులారా! మీరు చాలా కాలంగా సాఫ్ట్ స్కిల్స్ ఆన్ లైన్ ఉపన్యాసాలు వింటున్నారు. 2. మనం చివరి ఉపన్యాసాల్లో భాగంగా మీకు చాలా ఆసక్తి కలిగించే మీకు నచ్చేటాపిక్ గురించి చర్చిద్దాం. అయితే అంతకు ముందు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలడుగుతాను, మీలో ఎంతమంది కొన్నిసార్లు భావోద్వేగం పొందుతారు? నేనీ పని చేయకుంటే బాగుండేది అని, మీ కార్యాలయంలో పనులు కానపుడు భావోద్వేగపు ఒత్తిడిలో ప్రవర్తించడం, మానసికంగా నిరాశకు గురి అవ్వడం గమనించారా. 3. 4. చాలామంది ఈ ప్రశ్నలకి అవుననే సమాధానం చెప్పారు. ఎందుకంటే మనందరికీ భావోద్వేగాలుంటాయి. కొన్నిసార్లు పనులు మనం అనుకున్న విధంగా జరుగవు. అయితే కార్యాలయంలో ఉన్నప్పుడు మనం కొన్నిసార్లు హెచ్చు తగ్గులుగా ఉన్న సందర్భాలలో సర్దుబాట్లు చేసుకోవాలి. భావోద్వేగాలు నియంత్రించుకోవాలి. 5. ఈ రోజు మనం భావోద్వేగ మేధస్సు మరియు క్లిష్ట ఆలోచన పద్దతి గురించి చర్చించబోతున్నాము.  6. నా ప్రియమైన మిత్రులారా మనమందరం ఏదో ఒక పనిచేయటానికి భూమిపైకి వచ్చాం. ఏదో ఒక సంస్ధతో, కంపెనీతో అనుబంధం కలిగి ఉంటాం. అపుడు మనచుట్టూ చాలామంది సహోద్యోగులుంటారు. 7. వారు మీ సీనియర్స్ లేదా జూనియర్స్ ఉన్నతాధికారులు, పురుషులు, స్ర్తీలు ఎవరైనా కావచ్చు. అందరికీ భావోద్వేగాలుంటాయి. 8. మీరేదైనా పని మొదలు పెట్టినపుడు, అనేక సందర్భాల్లో ఇతరుల భావోద్వేగాలవల్ల ఆ పని చేయడంలో కొంత భంగం కలుగుతుంది. అయితే ఎవరికైనా భావోద్వేగం వలన పని పూర్తి కాకపోవచ్చు.  9. అలాగే అందరినీ కలవరపరచే ప్రశ్న, భావోద్వేగ మేధస్సుఅంటే ఏమిటి?. ఇంకొక మేధస్సు వెంటనే మనకు గుర్తుకు వస్తుంది. 10. మీరు వినే ఉంటారు, మనకి మంచి ఉద్యోగం రావాలంటే చక్కని తెలివితేటలు ఉండాలి. ఇంతకు ముందు విన్నవి లేదా చాలా మండి చేపిన దాని ప్రకారం మనందరిలో కొంత తెలివి ఉంటుంది. 11. అందువల్ల, మీరు ఉద్యోగం పొడవలసి ఉందని మీరు తరచుగా విన్న వ్యక్తులు ఐక్యూ ఉండాలి అని అంటారు. అదే IQ (Intelligence Quotient) లేదా మేధోసూచీ. 12. చాలా సార్లు మనం వినేఉంటాం, IQ స్ధాయి బాగాలేదని. 13. ఉదాహరణకి ఒక వ్యక్తికి చాలా తెలివితేటలు ఉండి మంచి ఉద్యోగం పొందుతాడు. అయితే కార్యాలయానికి వచ్చాక కేవలo IQ మాత్రమే పనిచేయదు. అతనికి భావోద్వేగ మేధస్సు EI కూడా ఉండాలి. 14. EI------- ఎమోషనల్ ఇంటెలిజెన్స్.  15. మనం విజయం పొందాలంటే IQ & EI మధ్య సమతుల్యత సాధించాలి. మనం EI అంటే ఏమిటో, అది మన ఆలోచనల్లోకి ఎలా వస్తుందో చూద్దాం. రిచర్డ్ గోల్ మన్ తన పుస్తకం '' Working with Emotional Intelligence'' లో ఈ పదం EI ని ప్రస్తావించాడు.  16. ఈ భావోద్వేగ మేధస్సు మన భావాలను సరిగ్గా అమర్చుకునే శక్తిని సూచిస్తంది. 17. మనిషి ఒక భావోద్వేగాల మూట అని చెప్పచ్చు. భావోద్వేగాలు అనేవి లేకపోతే మనిషి ఎలా ఉంటాడు. మనందరికీ భావోద్వేగాలున్నాయి. 18. భావోద్వేగ మేధస్సు అంటే మన భావాలు, ఇంకా ఇతరుల భావాల్ని సరిగ్గా అమర్చుకునే శక్తి.  19. మన భావాలను, ఇతరులను ప్రోత్సహించే శక్తి, మన సంబంధాలను సమర్ధించుకొనే వీలు కల్పిస్తుంది. 20. మీరు ఎక్కడ పనిచేస్తున్నా, ఏపని చేస్తున్నా మీ భావాలు, ఇతరుల భావాల మధ్య సమతుల్యత లేకపోతే పనిని విజయవంతంగా పూర్తిచేయలేరు. 21. ఇంతకు ముందు ఉపన్యాసాల్లో చర్చించి నట్లుగా ఒక బృందంతో పని చేస్తున్నపుడు అందరికి కొన్ని అభిప్రాయాలు, భావాలు ఉంటాయి. వాస్తవానికి ఇది ఒక సవాలు.   22. ప్రతి ఒక్కరి అభిప్రాయాలు, భావాల నిర్ణయం మధ్య సమతుల్యతలో ఒక తీర్పుని సాధించటం చాలా కష్టం. 23. మిత్రులారా, ప్రతి ఉద్యోగంలో మీరు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. 24. మీరు చాలా తెలివైన వారైనా, కేవలం తెలివిపైన ఆధారపడి నిర్ణయం తీసుకుంటే సరిగ్గా ఉండకపోవచ్చు. కాబట్టే మనం సమావేశాలు ఏర్పాటు చేసి, చర్చించి, బృందంలో అందరితో ఏకాభిప్రాయం సాధించుతాం. 25. ఏకాభిప్రాయంతో  భావోద్వేగ నియంత్రణ ఉంటుంది. 26. ఈ కాలంలో సంస్ధలేవైనా ఉద్యోగాల స్వభావం చాలా మారిపోయి, డిమాండింగ్ గా ఉండి మీ భావోద్వేగాల పై ప్రభావం చూపిస్తాయి. దాని వలన మీరు పని చేయవద్దనుకుంటే మీకు అవరోధం ఏర్పడుతుంది. 27. ఇలాంటి పరిస్ధితి ఏర్పడినపుడు ఏ సంస్ధలో అయినా పురోగతి ఆగిపోతుంది. కాబట్టి ఒక రకమైన నియంత్రణ, ప్రోత్సాహం, నివారణ సమతుల్యత వలన పనిని మెరుగ్గా చేయటం ముఖ్యం. దీనిలో ప్రేరణ కూడా ఉంటుంది. 28. ఇక్కడ ఉన్న క్లిపింగ్ చూస్తే కొన్ని సార్లు భావోద్వేగం వలన కమ్యూనికేషన్ ప్రవాహం ఎలా కుంటు పడుతుందో అలాగే ఆలోచనల మార్పిడి, పని సరియైన పద్దతిలో సాగకపోవడం గమనిస్తాము. 29. ఈ క్లిప్పింగ్ గమనించి నట్లయితే అందులో 2-3 వ్యక్తులు చర్చిస్తున్నారు. 30. ఒక సంస్ధలో పని చేసేటపుడు, సమూహ సభ్యులందరి మధ్య పొందిక, పట్టు సాధించటం, వాళ్లలో కమ్యూనికేట్ చేయడం, ఆలోచనల మార్పిడి, ఇవన్నీ సహజం. కాని వీటి మధ్య భావోద్వేగాలు అడ్డువస్తే అది అవరోధంగా మారుతుంది. 31. నాకు ఈ గది మీటింగ్ కొరకు కావాలి. అంటే ఈ గదిలో మేము ఇప్పటికే ఉన్నాం.  32. కాబట్టి ఇంకొక గది వెతుక్కొండి. అన్ని కాన్ఫరెన్స్ హాల్స్ బుక్ అయి ఉన్నాయి. కాబట్టి మీ మీటింగ్ కి మా మీటింగ్ కి ఉన్న ప్రాధాన్యతని పోల్చిచూడాలి. 33. ఇక్కడ గమనిస్తే ఇద్దరు వ్యక్తులకు ఒకేసమయంలో ఒకే గది అవసరమైంది. ఎవరూ వెనక్కు వెళ్లడానికి ఒప్పుకోవట్లేదు. మీటింగ్ జరగాలి కాబట్టి ఆ గది ఎక్కువస్ధాయి మానేజర్ కి ఇవ్వ బడుతుంది. 34. ఇలాంటి పరిస్ధితి వస్తే అది ఇతరులకి బాధ కలిగిస్తుంది. ఈ మీటింగ్ ఏర్పాటు చేయటానికి చాలా నెలల సమయం పట్టిందని కోపం వస్తుంది. 35. కోపం వలన శత్రుత్వం ఏర్పడుతుంది. మనుషులు మనసులో చాలా, బాధ పడి అసలు ఇక్కడ ఏ మీటింగ్, ఏ పని ఎందుకు సరిగ్గా జరగదని అనుకుంటారు. 36. ఈ సంఘటన వలన మనం ఏం తెలుసుకున్నాంటే, భావోద్వేగాల ఘర్షణ వలన అది వివాదమై ఏ పనీ ముందు కెళ్లదు. అందుకే మన భావోద్వేగాలు నియంత్రించుకోవాలి. 37. తరువాతి స్లైడ్స్ లో మన భావోద్వేగాలు ఎలా నియంత్రించుకోవచ్చో తెలుసుకుందాం. అంతకంటే ముందు మనం ఇంకొక పదాన్ని అర్ధం చేసుకోవాలి అదే క్రిటికల్ థింకింగ్ పద్ధతి (Critical thinking). 38. మీ ఉద్యోగంలో అనేక రకాలైన పనులు చేయాలంటే మీకుండాల్సిన లక్షనాణ్ణి  క్రిటికల్ థింకింగ్ అంటారు. 39. మిత్రులారా, మీరొక నిర్ణయం తీసుకోవాలంటే థింకింగ్ అవసరం. వివిధ మనోభావాలు కలిగిన మనుషుల్తో వెంటనే, అత్యవసరంగా పని చేయించాల్సి వస్తుంది. 40. అప్పుడు మీరే చర్యలు పాటించాలన్నా కొంత క్రిటికల్ థింకింగ్ అవసరం. 41. క్రిటికల్ థింకింగ్ ని అనేకులు వివిధ రకాలుగా నిర్వచించినా, మనం ఒక పనిచేసే నిర్వచనం చూద్దాం. ఎందుకంటే ఈ కాలంలో సంస్ధల్లో పనికి మూలం కమ్యూనికేషన్. కేవలం మనుషులే కాక వారి కమ్యూనికేషన్ కూడా పని చేస్తుంది. 42. కనుక క్రిటికల్ థింకింగ్ అనేది ఏదైనా విషయం, సబ్జెక్ట్ గురించి చాలా నైపుణ్యంగా అందులోని అంతర్గత అమరికను తెలుసుకొని ఆలోచన పెంపోందించుకోవడం. 43. మనుషులుగా మన మందరం ఆలోచనలో  యంత్రాలం, కానీ కొన్ని సార్లు మనం సరిగ్గా ఆలోచించలేం. అవునా, కాదా? కొన్ని సార్లు మన ఆలోచనా సరళిలో లోపాలు ఉండవచ్చు. సమూహ చర్చలు గమనిస్తే ఒక వ్యక్తి ఇతరుల ఆలోచనలని అంగీకరించడు. కొందరు తల్ల క్రిందులుగా, కొందరు పక్షపాతంలో ఆలోచిస్తారు. కాబట్టి సమూహ సభ్యులందరూ తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి, అభివృద్ది చేసుకోవాలి. మేధో ప్రామాణికతను వారికై వారు పెంచుకోవాలి. 44. ఇది  క్రిటికల్ థింకింగ్ యొక్క శక్తి. ఒక యువతగా ఒక  సంస్ధ లేదా, ఇనిస్టిట్యూట్ లేదా, కార్యాలయం లేదా, ఒక ప్రొఫెషనల్ గా  ప్రవేశంచినా,  మనం ఎప్పడూ ఏదో ఒకటి నేర్చుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. 45. ఒకోసారి ఎంత నేర్చుకున్నా దాన్ని విడిచి పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు నేర్చుకున్నదంతా మాత్రమే సరియైనదని అనుకోకూడదు. మనని మనం విలువకట్టుకొని స్వీయపాండిత్యం పెంచుకోవటానికి ప్రయత్నం చేయాలి. 46. క్లిష్ట ఆలోచనలో ఉన్న వివిధ అంశాలను పరిగణించాలి. అందులో మొదటిది ఊహాశక్తి. ఊహా శక్తి లేని మనిషి ఉండదు. మనందరికీ ఉంటుంది. 47. మీ-ముందు ఏదైనా పని వచ్చినపుడు చాలా ఉత్సాహంగా ఏమౌతుందా అని ఊహించండి. ఉదాహరణకి మీరొక మీటింగ్ వెళ్లేటపుడు మీకు కేవలం అజెండా తెలుసు. కానీ మీరు ఈ విషయంపై ఏం చర్చిస్తారు, ఏం జరుగుతుంది, నాదగ్గర ఏం పాయింట్స్ ఉన్నాయి. నేను ఎలాంటి సమగ్ర అభిప్రాయాలు చెప్పాలి, ఎలా అన్నీ శ్రద్దగా పరిశీలించాలి, ఇతరులు మాట్లాడుతుంటే, వారి వద్ద నుంచి తెలివిగా ఎలాంటి ఆలోచనలు గ్రహించి వాటిపై చర్చించాలి, ఒక పరిష్కారం లేదా ముగింపు ఎలా ఇవ్వాలి అని ఆలోచిస్తే మీకు సరైన ప్రశ్నలడిగే స్ధాయిలో ఉంటారు. 48. అందరికీ చాలా విషయాలు నేర్చుకోవాలనే కుతూహలం ఉంటుంది. కానీ ఇక్కడప్రశ్న, మనకు సరైన సమయంలో ప్రశ్నలడిగే శక్తి ఉందా అని. ఎందుకంటే సరైన సమయంలో సరైన ప్రశ్నలడగకపోతే తప్పులు జరుగుతాయి. 49. మీరక్కడ ఇతరులు చెప్పేది వినటానికే కాకుండా, అందరి ముందుకీ ఒక అసంగతమైన ఆలోచనా పద్దతిని తెలియజేయటానికి ప్రయత్నించాలి. 50. సరైన ప్రశ్నలడగటం వలన మీరొక ఆలోచనలో ఉన్న కృత్రిమత్వం, లోపం గురించి ఎత్తి చూపే గైడ్ గా ఉంటారు. మీ ఆలోచనలను అభిప్రాయాలను ముందుకు తెస్తారు. మీరు ప్రభావితులై మాట్లాడరాదు. మీకు క్లిష్ట ఆలోచన ఉంటే వ్యక్తులను సరైన పరిశీలన లేకుండా జడ్జ్ చేయరు. అలా చేస్తే అది తప్పవుతుంది. 51. తక్కువ సమయంలో లేదా హాడావిడిగా జడ్జ్ చేస్తే అది భయం కలిగిస్తుంది. 52. కాబట్టి సరైన ప్రశ్నలనే అడగండి. అసంబద్ధమైన ప్రశ్నలు విషయాల్ని త్యజించడానికి మీకు స్వేచ్ధ ఉందా కానీ వదిలేసే ముందు దాని విలువ ఏంటో తెలుసుకోవాలంటే మీకు కొంత అనుభవం ఉండాలి. 53. దానికి కొంత సమయం పడుతుంది. మొదటి దశ లో అంత అనుభవం ఉండదు. 54. మిత్రులారా అనుభవం చాలా మంచి బోధకుడు. 55. మీ అనుభవాల నుండి నేర్చుకోండి. మీ కార్యాలయంలో మీ బాస్, సహోద్యోగి లేదా మీ సహచరులు వేరే వ్యక్తి, ఎవరైనా కావచ్చు. ఏమైనా అంటే,  56. వారితో మీకున్న సంబంధాన్ని గుర్తించండి. అంటే వాక్యాలకు అభిప్రాయాలకు మధ్య కాదు. వ్యక్తుల మధ్య ఉన్న సంబంధం వలన నిర్ణయాలు తీసుకుంటాం. 57. కాబట్టి సంబంధాలను పరిశీలించండి. మీరు ఒక నాయకుడిగా ఉంటే, అందరి అభిప్రాయాలని సమీకరించాలి. అందరికీ తమ ఆలోచనలని సమర్ధించుకోటానికి సరైన అవకాశం ఇవ్వాలి. 58. మిత్రులారా, తటస్ధత అనేది నాయకుడి యొక్క నాణ్యతా చిహ్నం. కొన్నిసార్లు అవసరాన్ని బట్టి ముందడుగు వేయవచ్చు. ఇవన్నీ మీకు క్రిటికల్ ధింకర్ గా వృద్ది అవటానికి, ఈ సమాజంలో జీవించటానికి చాలా అవసరం. 59. ఇపుడు మనం మళ్లీ భావోద్వేగ మేధస్సు గురించి ఆలోచిస్తే మీరు మీ భావోద్వేగాల్ని నియంత్రించుకుంటే కాని క్రిటికల్ ధింకర్ కాలేరు. 60. పరిశీలకులు ఏమంటారంటే సాధారణంగా స్ర్తీలు తమ భావోద్వేగాల గురించి చాలా జ్ఞానం కలిగి ఉంటారు. సానుభూతి ప్రదర్శిస్తారు. వ్యక్తుల మధ్య సంబంధాల గురించి ప్రావీణ్యత కలిగి ఉంటారు. 61. ఎప్పుడైతే మాట్లాడ్తామో అప్పుడే చెప్తాము. 62. ఒక రకమైన సంభాషణ అంటే, ఇద్దరు వ్యక్తులు ఒకే రకమైన సంభాషణను కలిగి ఉన్నారు. నలుగురు ఒకే రకమైన సనూహ చర్చ లో ఉన్నారు. 63. ఎంతమంది చర్చించినా అందులో ఒకరు పరిణితి లేకుండా మాట్లాడవచ్చు. కానీ మీరు భిన్నంగా ఆలోచించి సానుభూతి చూపాలి. మీరు ఎక్కువగా మాట్లాడి ఇతరులకి అవకాశం ఇవ్వకపోతే, ఇతరుల పట్ల జాలి లేకుండా మీ భావాలు వారిపై గుప్పిస్తున్నారని అర్ధం. 64. అలాగే మనం భావోద్వేగ సూచీ (EQ) భావోద్వేగ మేధస్సుతో కొలిచేది, ఇంకా మేధో సూచీ (IQ) మధ్య ఉన్న తేడాల గురించి తెలుసుకుందాం. మనం భావోద్వేగాల్ని కొలిస్తే అది EQ అలాగే మేధస్సుని కొలిచేది IQ. మేధో సూచీ ఆధారంగా తీర్పు ఇవ్వవచ్చు. 65. రెండిటికీ కొన్ని పరీక్షలుంటాయి. EQ మరియు IQ భావోద్వేగ మేధస్సు సూచిస్తాయి. EQ మీ భావోద్వేగాలకు సంబంధించినది అయితే IQ మీ మేధస్సు, తెలివి తేటలకి సంబంధించినది. 66. భావోద్వేగ మేధస్సు మీ భావాలను అర్ధం చేసుకోడంలో సహాయం చేయటమే కాక స్వీయ విశ్లేషణలో కూడా తోడ్పడుతుంది. 67. భావోద్వేగ మేధస్సు మీ మానసిక సామర్ధ్యం లేదా తెలివితేటలపై  ఆధారపడిన భావోద్వేగాలకు ఇది మరింత పరిమితం. 68. మీరు మీ భావాలే కాక ఇతరుల భావాలు మిమ్మల్నెలా ప్రభావితం చేస్తాయో తెలుసు కుంటారు. ఎక్కువ IQ చదువులో ప్రావీణ్యాని సూచించి మంచి ఉద్యోగం వచ్చేలా చేస్తుంది. కానీ ఉద్యోగంలో విజయం సాధించాలంటే మంచి EQ ఉండాలి,  69. ఎందుకంటే అది సంబంధాలపై ఆధారపడి ఉంటుంది. ఒక నిజమైన నాయకుడు EQ పైనే ఆధారపడతాడు, అయితే IQ ని నిర్లక్షo చేయడు. కానీ మంచి నాయకుడు అవ్వాలంటే EQ, IQ మధ్య సమతుల్యాన్ని నిర్మంచాలి. 70. అయితే EQలో ఉన్న వివిధ అంశాలేంటి?.  71. ముందుగా తెలుసుకోవాల్సిన అంశం 'అవగాహన' అంటే ఏమిటి? స్వీయ అవగాహన, స్వీయ నియంత్రణ అంటే మీ గురించి మీరు తెలుసుకోవడం, మీ భావాలు, పోత్సాహం, సానుభూతి ఇంకా సాంఘిక నైపుణ్యాలు. 72. మనం (self awareness) స్వీయ అవగాహన గురించి మాట్లాడేటపుడు మీ స్వీయ భావోద్వేగ అవగాహన పై శ్రద్ద చూపాలి. మీరు కొన్ని సార్లు ఎలా భావోద్వేగం పొందుతున్నారు. చాలా భావాలు ఉన్న ఒక వ్యక్తి మీకు ఎంతకాలం నుంచి తెలుసు. అందరికీ భావోద్వేగాలుంటాయి. 73. మీ భావాలు తెలుసుకొని తర్వాత ఇతరుల స్ధానంలో ఉండి ఆలోచించండి. ఇద్దరు వ్యక్తుల మధ్య భావోద్వేగాల వెల్లడి ఎక్కవ అయితే దాని వలన జరగవలసిన పని లేదా పురోగతికి అవరోధం కలుగుతుంద. 74. మీకు మీరు సహాయం చేసుకోండి. ఇంతకు ముందు చెప్పినది వింటే మీకు మీరే ఎలా సహాయపడతారనే విషయం తెలుస్తుంది. 75. అంటే ఇక్కడ మీరు మీ విద్యార్హతలు కాకుండా మీ భావోద్వేగాలను అర్ధం చేసుకుంటే వాటి ప్రతిచర్యలు మీ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలుస్తుంది. 76. మన అవగాహన యొక్క ముఖ్యమైన అంశాలలో స్వీయ విశ్వాసం ఒకటి.  77. మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్లినా, సమూహంతో పని చేసినా, ప్రసంగం ఇచ్చినా, నివేదిక చదివినా, అన్ని సందర్భాల్లో మీకు ఉండాల్సిన స్వీయ విశ్వాసం అవసరం.  78. మీకు స్వీయ విశ్వాసం లేకపోతే ఇచ్చిన పనిని సకాలంలో పూర్తి చేయలేరు. 79. స్వీయ విశ్వాసం తయారీ వలనే కాకుండా మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోడం వలన కూడా వస్తుంది. నేను చేయగలను అనే వైఖరి వలన అధి సాధ్యం. 80. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రేరణాత్మక ఉపన్యాసాలు ఇస్తునారు. అక్క డ వారు మీ విశ్వాస స్థాయిని పెంచడానికి నిజంగా ప్రయత్నిస్తున్నారు. 81. తగిన విద్యార్హతలున్నా లేకున్నా స్వీయ విశ్వాసం ఉంటే కానీ విజయం లభించదు. 82. తరువాతి అంశం స్వీయ నియంత్రణ.  83. నేను చెప్పినట్లుగా మనిషి భావోద్వేగాల మూట అన్నిరకాల భావాలుంటాయి. 84. భావోద్వేగాలు ---- అన్నిరకాల భావోద్వేగాలు, అయితే మనం ఎపుడూ దయచేసి మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి అంటాం. కానీ అది పనిచేయదు. 85. మిత్రులారా, మనం ఎప్పుడూ మన భావోద్వేగాల్ని మోస్తూనే ఉంటాం. మీరు ఏదైనా ప్రసంగం ఇచ్చేటపుడు ఉన్నట్టుండి ఏదైనా భావోద్వేగం కలిగితే మీ మాటలు మర్చిపోతారు. మీరు వేదకపై నత్తిగా, వ్యాకులంగా మాట్లాడితే మీ మాటలెవరూ వినరు.  86. మీకు స్వీయ నియంత్రణ లేక ఇలా జరుగుతుంది. కాబట్టి మీరు స్వీయ నియంత్రణ పాటించాలి. mఅరియు భావోద్వేగాలను నియంత్రించాలి. 87. తరువాతి అంశం విశ్వసనీయత.  88. విశ్వసనీయత అంటే ఏమిటి. ఒక బృందంలో మీరు మాటలు చెప్పినంత నిజాయితీగా ఉంటేనే నమ్ముతారు. 89. నమ్మకం సమయంతో వృద్ది చెందుతుంది. మీరు చెప్పేమాటలు చేసే పనులు వ్యతిరేకంగా ఉంటే ఆ వ్యక్తి అపనమ్మకంగా, అనూహ్యంగా అనిపిస్తాడు. సమయం వచ్చినపుడు అతనిని మీరు అంగీకరించలేరు. ఎందుకంటే మాటలకి, పనులకి మధ్య సంబంధం చూస్తారు. 90. తరువాతి అంశం మనస్సాక్షి. అంటే మీకు మంచికి చెడుకి మధ్య భేదం తెలుసుకునే నైతికత ఉండటం. ఇది మనం 'ఎధిక్స్' లో చర్చించాం..   91. మనకి ఏదైనా పని ఇస్తే దాన్ని మనం నైతిక ప్రామాణికతో పూర్తి చేయాలి. అవగాహన ఉండాలి భావోద్వేగాలతో ప్రభావితం కారాదు.  నైతికత లేకపోతే పక్షపాత భావన వస్తుంది. 92. అపుడు మీకు మంచి, చెడుకి మధ్య భేదం తెలియదు. తరువాతి అంశం అనుకూలత. కార్యాలయంలో ఏ నిమిషమైనా ఏ మార్పు అయినా జరగవచ్చు, సందర్భాలు మారచ్చు. అపుడు తక్షణ చర్య తీసుకోవాలంటే మీకు అనుకూలత  ఉండాలి.  93. మిత్రులారా, మీరు అనుకూలతగా  ఉండ.టానికి.   94. మేము మీతో ఒక విధమైన అనుకూలతను కలిగి ఉండాలి. మిమ్మల్ని మీరు సందర్భానికి అనుగుణంగా మార్చుకోవాలి. 95. అనువశ్యతని మనం ఫ్లెక్సి బిలిటీ అనవచ్చు. మీరు అనుగుణ్యత కలిగి ఉంటేనే కార్యాలయంలో పని చేసే వ్యక్తులు, ఆ సందర్భాల గురించి తెలుసుకోగలరు. ఇతరుల స్ధానంలో మిమ్మల్ని ఊహించుకో గలిగితే ఇది సాధ్యం. వారి పరిస్ధితి అర్ధం చేసుకోగలరు. అపుడే మీరు బాధ్యత కల వ్యక్తిగా గౌరవం పొందుతారు. అందరూ స్వీకరించి, గౌరవించి, నమ్మకం పెంచుకుంటారు. తరువాత ఆవిష్కరించబడతాయి. 96. మీకు ఆవిష్కరణ ఉందా, మీకు ఖచ్చితంగా భావాలు ఉన్నాయి. మీరొక ప్రసంగం ఇవ్వటానికి వెళ్లినపుడు హఠాత్తుగా మీలో భావోద్వేగం పెరిగి నెర్వస్ అవుతారు. 97. కాబట్టి ముందు చెప్పినట్లుగా మీ నరాలను నియత్రించుకొని, అంతా బానే వుందని, భూమి, అకాశం క్రుంగిపోవని, ఏమీ జరగదని అనుకోవాలి. 98. ప్రతీదీ క్రమంలో ఉండని మాత్రమే మీరు చెప్పాలి. 99. మీ భావోద్వేగాలను నియంత్రించుకుంటే దాన్నే స్వీయ నియంత్రణ అంటారు. 100. తరువాత ప్రేరణ - ఒక వ్యక్తి అన్ని విధాలుగా తయారుగా ఉండి, తన మాటలు, చేతల మధ్య సంబంధం ఉంటే అతను తప్పక ఇతరులకి ప్రేరణ కలిగించగలడు. 101. ఈ వ్యక్తి కేవలం కుర్చీలో కూర్చొని ఇతరులకు ఆజ్ఞలు, సూచనలు ఇవ్వటం, పనులు అప్ప చెప్పడమే కాకుండా చొరవ తీసుకునే శక్తి కలిగి ఉండాలి. 102. మనం నివసించే ఈ ప్రపంచంలో భారతదేశాన్ని ఒక పరిశుభ్రత పాటించే దేశంగా పేరు పొందింది. స్వచ్ఛ భారత్ అభియాన్ అనే కార్యక్రమం ఒక వ్యక్తి చొరవ వలన మొదలుపెట్టబడి అన్ని సంస్ధలు, వ్యక్తులు పరిశుభ్రత అనే ఆలోచనని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇదెలా సాధ్యం ఇది ఒక వ్యక్తి సాధించిన కార్యంగా భావించవచ్చు. 103. నేనొక కొత్త విషయం కనిపెడతాను, అని ముందుకు వస్తే అందరూ అనుసరిస్తారు. అలాంటి చొరవ ఒక నాయకుడిలో ఉంటుంది. అనుచరులు అనుసరిస్తారు. 104. అయితే మీరు ఖచ్చితంగా నిబద్దత కలిగి ఉండాలి, దానికై కొంత త్యాగం అవసరం. 105. చొరవ అనేది చాలా ముఖ్యం. ఆశావాదంతో మనం కొత్త విషయాలు చేయగలం. భయం ఉంటే ఏం చేయలేం. విశ్వాసం  ఉన్న వ్యక్తి, పట్టుదలతో ముందుకెళ్లగలడు. కలలు నెరవేర్చుకోగలడు.  106. మొదటి విషయం ఏమిటంటే మీరు ఒక ద్రుడమైన నిశ్చయాన్ని కలిగి ఉండాలి. పట్టుదల ఉన్న నాయకుడు తననే కాక ఇతరులకు కూడా ప్రేరణ కలిగించగలడు.  107. కాబట్టి కార్యాలయంలో విజయం సాధించాలంటే మీకు వ్యక్తిగత సామర్యలే కాక సాంఘిక సామర్ధ్యాలు కూడా ఉండాలి. 108. వ్యక్తిగత సామర్ధ్యాలు - గురించి తెలుసుకున్నాము. 109. ఇప్పుడు మనం కొన్ని సామాజిక సామర్ధ్యాల గురించితెలుసుకుందాం. 110. మీరు అధికార స్ధాయిలో కార్యాలయంలో ఉంటే మీకు వ్యక్తిగత సామర్ధ్యాలు, కార్యసాధక శక్తి, చొరవ, పనిచేసే ప్రేరణ, ఇలాంటి అన్ని రకాల సాంఘిక నైపుణ్యాలుండాలి. 111. సాంఘిక నైపుణ్యం అంటే ఇతరులని అర్ధం చేసుకోవటం మీరొక బృందంలో పని చేస్తునపుడు ఎవరైనా వంద శాతం కృషి చేయకపోతే ఏదైనా సమస్య ఉందేమో తెలుసుకోవాలి. 112. మీ ఈ విధంగా విచారించి, వ్యక్తుల సమస్యలు తెలుసుకోవాలి. మీరు వారితో మాట్లాడితే భావోద్వేగ విషయాలు బయటికి వస్తాయి. 113. మీరు ఇతరుల భావాలు, సంకటాలు, బాధలు తెలుసుకొని సానూభూతి చూపించాలి.  114. అలాగే ఒక పరిష్కారం కనుగొనాలి. 115. మీరు కేవలం సమస్యలు తెలుసుకోడానికే కాకుండా పరిష్కారాలు చెప్పి అది ఎలా సాధించాలో వివరించాలి. 116. మీ వృద్ది అవుతూ ఇతరులనూ వృద్ది చేయాలి. దానికై సేవాభావం అవసరం. ఎవరికి ఏ పని చేయాలో చెప్పాలి. కొన్నిసార్లు మీకు  నిబద్దత, స్ధాయి కూడా అవసరం. 117. మీ గురించి, కంపెనీ గురించి ఇతరులు ఏం అనుకుంటున్నారో, మీ చుట్టూ ఉన్న విభిన్న సంస్కృతులు, రుచులు, నమ్మకాలు, విశ్వాసాలు ఉన్న వ్యక్తుల గురించి తెలుసుకోవాలి.  118. మీరు సమ్మిళితం చేసుకుంటేనే నాయకుడిగా ముందుకు సాగగలరు. అలాగే సాంఘిక అవగాహవ నైపుణ్యాలు ఉంటాయి. ఏదైనా తప్పు జరిగినా, ఎవరైనా కుట్రలు చేసినా, దాన్ని అందరినీ పరిశీలించటం ద్వారా తెలుసుకోవాలి. దాని అర్ధం మీకు మూడోనేత్రం ఉందని కాదు. మీరు అధికారి అని కాదు. 119. ఇలాంటి ప్రతికూల సందర్భాల్లో వ్యక్తులు ఎలా ప్రతిస్పందిస్తారో ఒక సోదరునిగా ఆలోచించాలి. 120. కాబట్టి కార్యాలయంలో విజయం సాధించటానికి వ్యక్తిగత  సామర్థ్యం, సామాజిక సామర్థ్యం అవసరం. ఇప్పుడు  ఈ సామాజిక సామర్థ్యం ఏమిటి? 121. అందులో మొదటిది ప్రభావం. మనం ఎలా ప్రభావవంతం అవగలం. దానికోసం మీ ఆలోచనలు, చేతల మధ్య తేడా ఉండరాదు. వ్యవహారాల్లో న్యాయంగా, పక్షపాతం లేకుండా, వివక్షత వైఖరి లేకుండా కమ్యూనికేషన్ సరళంగా ఉండాలి. 122. సాంఘిక జీవులుగా మనందరి మధ్య కమ్యూనికేషన్ చాలా అవసరం. డికార్ట్స్ ఇలా అంటాడు. భాషకి ధన్యవాదాలు. దానివలనే మనిషి, మనిషి అయ్యాడు. 123. అనగా మీరు ఉపయోగించే భాష, వ్యక్తీ కరించే భావాలు, మీరు ఎంచుకునే పదాలు, అవన్నీ మిమ్మల్ని ఒక మంచి కమ్యూనికేటర్ గా చేసి ప్రభావవంతంగామారుస్తాయి. 124. మీరు మనుషులను గెలిచి, మీ నిజమైన సహకార వైఖరి ద్వారా వారిని ప్రభావం చేయగలిగితే సంఘర్షణను ఆపగలరు. 125. ఎందుకంటే కార్యాలయాల్లో వచ్చే సంఘర్షణను మీరు తగ్గించాల్సి వస్తుంది. అది ఇతరుల అభిప్రాయాలు విని తెలుసుకుంటేనే సాధ్యం. దానికై మంచి వినికిడి నైపుణ్యాలుండాలి. దానిలో మీరు ఇప్పటికే అభివృద్ధి అయి ఉండాలి. 126. కార్యాలయంలో దానిని ఒకసారి అభివృద్ధి చేయబోతున్నారు.   127. ఆ తరువాత నాయకత్వం, నాయకుడు అంటే అందరి బాధలు, ఫిర్యాదులు విని, తెలుసుకొని సంస్ధ కోసం, అన్నీ పరిగణించి ప్రవర్తించాలి. 128. అపుడే అతను మార్పుకి ప్రేరకం, ప్రతినిధి కాగలడు. అంటే మీ సంస్ధ లేదా కార్యాలయంలో వ్యక్తులు సమయానికి రావట్లేదు. దానికై మీరే పరికరం కనిపెడతారు.  129. మీ బాస్ సమయాని కంటే ముందే వస్తే అందరూ సమయానికి వస్తారు. సమయాన్ని గౌరవిస్తారు. విభిన్న ఆలోచనలు, అభిప్రాయాలున్న వ్యక్తుల మధ్య సత్సంబంధాలు ఉండేలా చూడాలి. మీపని ఇదంతా జరిగి సమతుల్యత ఉండేలా చూడటమే. 130. మీరు ఇతర సంస్ధల నుండి ఏదైనా సహకారాన్ని పొందుతున్నారా లేక ఇతర సంస్ధలకి అందిస్తున్నారా? మీరు ఆలోచించే సహకార ప్రాజెక్టలలో చాలా మంది సంభావ్య శక్తి ఉన్న ఉద్యోగులు కూడా ఇమిడే ఉంటారు. 131. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే మీరు టీమ్ మనిషి. మిత్రులారా ఈ కాలంలో ఒక టీమ్ వ్యక్తిగా ఉండటం చాలా అవసరం. బృంద సంక్షేమం గురించి ఆలోచించి, బృంద సభ్యులకు విలువనిచ్చే వ్యక్తి లా ఉండాలి. అలా కాకుండా బృంద విజయాన్ని స్వంత విజయంగా భావించరాదు. తన భావోద్వేగాల్ని నియంత్రించుకోవాలి. వ్యక్తిగత, సాంఘిక భావాల మధ్య సమతుల్యత పాటించి, తన ఆవిర్భావ ఇంకా క్లిష్ట ఆలోచనా నైపుణ్యాలతో మంచి నిర్ణయాలు తీసుకోవాలి. 132. మిత్రులారా భావోద్వేగాలు మనతోనే ఉంటాయి. షేక్స్ పియర్ అన్నట్లుగా మనిషి ఒక సృజనాత్మక రచన. మనిషిలో ఉన్న అపారమైన శక్తి, కోరిక వలన తను నిర్ణయించుకుంటే సూర్యుడి వద్దకు ప్రయాణం చేయగలడు. 133. 134. ఈ కాలంలో మార్స్ గ్రహానికి వెళ్లడం కూడా సాధ్యమే. 135. ఇదంతా వ్యక్తుల పట్టుదల, ఉత్సాహం, ఆవిష్కరణ సామర్ధ్యాలవలనే, సాధ్యమైంది. 136. మీరు ప్రత్యేకంగా, యోగ్యంగా ఉండాలంటే రాబర్ట్ ఫ్రాస్ట్ తన పద్యంలో చెప్పింది అనుసరించాలి. ఒక అడవిలో రెండు విభిన్నమార్గాలున్నాయి. నేను అందరూ తక్కువగా నడిచే మార్గాన్నే ఎన్నుకున్నాను. 137. తక్కువ మంది నడిచే అంటే మీరు అందరిలాంటి రోజువారీ సాధారణ వ్యక్తిలా కాకుండా అసాధారణంగా ఉండాలి. 138. మీరేదైనా అసాధారణ పని చేస్తే, ఒక అడుగు ఎక్కువగా వేస్తే అది తప్పక చాలా వ్యత్యాసం చూపిస్తుంది. 139. కాబట్టి మిత్రులారా. ఫ్రాస్ట్ చెప్పినట్లు two roads diverged in a wood.  140. ఇక్కడ wood అంటే అనిశ్చితి లేదా గందరగోళం.. కొన్నిసార్లు మీ భావోద్వేగాల వలన మీకే గందరగోళం ఏర్పడుతుంది. అయితే మీరు ఒక అసాధారణ వ్యక్తి చేసే పని చేశారు కాబట్టి అది చాలా వ్యత్యాసం చూపిస్తుంది. 141. మిత్రులారా, అభిప్రాయ బేధాలు మంచివే. కాని దానిలో కూడా గౌరవం ఉండాలి. తేడాలుండవచ్చు కాని ఉదాసీనత ఉండరాదు. అది చాలా చెడ్డది. 142. మీరొక భావోద్వేగ స్ధితిలో ఉన్నపుడు ఎలా ఆలోచిస్తారో చూద్దాం. అలాగే ఇతరులు అలాంటి సందర్భంలో ఎలా ఉంటారో తెలుసుకోవాలి. 143. కాబట్టి, ఒక రకమైన సమతుల్యతను సృష్టించడం అవసరం. 144. మీరు మీ భావోద్వేగాల్ని మేధస్సు, తెలివి మధ్య సమతుల్యత పాటిస్తారని అనుకుంటాను. 145. మీరు అందరూ గొప్ప, మంచి, ఆవిష్కరణ, సమస్యా పరిష్కారం చేయగల నాయకులౌతారని ఆశిస్తాను. 146. ధన్యవాదాలు! మీ అందరికీ మంచి రోజు కావాలని కోరుకుంటున్నాను.