1. 2. హలో. 3. శుభోదయం. 4. మీరు సాఫ్ట్‌ స్కిల్స్‌ (Soft Skills)ఉపన్యాసాలు విని ఆనందిస్తున్నారని నేను ఆశిస్తున్నాను.  5. ఇప్పుడు మనం ఈ మాడ్యూల్‌(module) లో టెలిఫోనిక్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌(telephonic communication skills) గురించి నేర్చుకుందాం. 6. టెలిఫోన్‌ (telephone) అందరి ఇళ్లలో తప్పకుండా ఉంటుంది. 7. ప్రస్తుత కాలంలో మనం టెలిఫోన్‌ ద్వారానే అందరితో కమ్యూనికేట్‌ చేస్తున్నాం. 8. మనిషి సాంఘిక జీవి. ఇతరులతో భాంధవ్యాలు నిలపుకోటానికి ఎప్పుడూ అందరినీ కలిసి మఖాముఖిగా మాట్లాడలేక పోవచ్చు. 9. కాబట్టి టెలిఫోన్ మనుషులని కలపడానికి ‌అవసరం అవుతుంది. 10. టెలిఫోన్‌ అనేది సందేశాలు పంపడానికి, మరియు రిసీవ్‌ చేసుకోవడానికి ఉపయోగపడే సాధనము. 11. మన బంధువులు, స్నేహితులు, సంబంధీకులు వేర్వేరు ప్రాంతాలలో, దేశాలలో దూరంగా విస్తరించి ఉన్నారు. వారితో సంభాషించడానికి టెలిఫోన్‌ అవసరం. మన నిజ జీవితంలోనే కాక, కార్యాలయాల్లో కూడా చాలా పనులు టెలిఫోన్ ఉపయోగించే పూర్తి చేస్తున్నాం. 12. వ్యాపార రంగంలో ఇది ప్రధాన పాత్ర వహిస్తుంది. 13. మనం ఒక సందేశం పంపించడం, రైల్వే టికెట్‌ బుక్ చేయడం, వస్తువులను ఆర్డర్ చేయటం, ఫీడ్‌బాక్‌ ఇవ్వడం మనం పొందిన వస్తువుల నాణ్యత పరిశీలించడం ఇటువంటి అన్ని పనులనూ ఒకేసారి వివిధ వ్యక్తులను కలిసి పూర్తి చేయలేం. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మనకు అంత వ్యవధి లేదు కాబట్టి మనం టెలిఫోన్‌ పై ఆధారపడతాం. 14. టెలిఫోన్‌ అత్యంత వేగంగా పనిచేసే సాధనం. 15. దీని ద్వారా మనం వ్యాపారస్థులు, పంపిణీదారులు, నిపుణులు, విద్యార్థులు ఇలా ఎవరినైనా సంప్రదించవచ్చు. 16. మనం ఆదూరాన్ని టెలిఫోన్‌ ద్వారా పూరించవచ్చు. 17. టెలిఫోన్ ద్వారా మనం సందేశాలను వేగంగా పంపటమే కాకుండా సమయాన్ని కూడా ఆదా చేసుకోవచ్చు. 18. మనం ఒక విషయం గురించి ఒక వ్యక్తిని కలిసి చర్చించి పొందదలుచుకున్న జ్ఞానాన్ని టెలిఫోన్‌ ఉపయోగించి అతి తక్కువ సమయంలో అతి తక్కువ ఖర్చుతో తెలుసుకోగలము. 19. టెలిఫోన్‌ వలన మనకు ప్రయాణం ప్రమాదాల నుండి కలిగే బాధలు తప్పాయి. మన విలువైన సమయం ఆదా అవుతుంది. మరియు తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో ఒకరినొకరు కమ్యూనికేట్ చేసుకోవడానికి సహాయపడుతుంది. 20. కాబట్టి టెలిఫోన్‌ కమ్యూనికేషన్‌ అనేక అత్యంత కీలకమైన ప్రధానమైన వస్తువే కాక అది జీవితం సారాంశం అయింది. 21. మీరు ఒక సంస్థలో పని చేస్తున్నట్లయితే టెలిఫోన్ యొక్క వాడకాన్ని, ఉపయోగాన్ని ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. 22. అంతకు ముందుగా మనం టెలిఫోన్‌ కమ్యూనికేషన్‌లో ఉన్న ప్రత్యేక అంశాల గురించి అర్ధం చేసుకోవాలి. ముఖాముఖి సంభాషణలో మనం అన్ని విషయాల గురించి వివరణ అడిగి తెలుసుకోగలం. మన ఉత్సుకతను, కోరికలను సందేహాలను వివరించవచ్చు. 23. మనం మన ప్రక్కన లేదా ఎదురుగా ఉన్న వ్యక్తితో మాట్లాడినపుడు వారి నుంచి తక్షణ ఫీడ్‌బాక్‌ పొందవచ్చు. అయితే టెలిఫోన్ లో మాట్లాడితే ఈ సదుపాయం ఉండదు. 24. కాని ఈ కాలంలో సైన్స్‌ &టెక్నాలజీలో(science & technology) వచ్చిన ఆధునిక పద్దతులు, అభివృద్ది వలన మనం ఇతరులతో మాట్లాడేటపుడు వారిని చూసే అవకాశం కూడా కలిగించడంలో విజయం సాధించారు. ఈ సదుపాయం అందరూ పొందలేరు ఎందుకంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న విషయం అందరికీ అందుబాటులో ఉండదు. 25. కాబట్టి మనం టెలిఫోన్‌ కమ్యూనికేషన్‌లో ఉన్న ప్రత్యేక అంశాల గురించి తెలుసుకుందాం. 26. మొదటిది, అతి ముఖ్యమైనది స్పష్టత.  27. ప్రతి కమ్యూనికేషన్ లో సెండర్‌(sender), రిసీవర్‌(receiver) అనే ఇద్దరు ఉంటారు. ఇది రెండు మార్గాల ప్రక్రియ. కాబట్టి మనం రిసీవర్‌(receiver) యొక్క ఇష్టాలను, భావాలను గుర్తించి వారి సహకారం పొందాలి. 28. కాబట్టి సమాచారం ఇచ్చినా, అడిగానా స్పష్టత అనేది ముఖ్యమైనది. 29. టెలిఫోన్‌ కమ్యూనికేషన్‌లో మొదటి అవసరం స్పష్టత. రెండవ లక్షణం  మర్యాద. 30. టెలిఫోన్ సంభాషణలో దూరం వలన మనం అవతలి వ్యక్తిని చూడలేము. 31. కాబట్టి మనం స్నేహ పూర్వకంగా ఉంటేనే కమ్యూనికేషన్‌ సఫలం అవుతుంది. 32. కాబట్టి మీరు టెలిఫోన్లో మాట్లాడుతున్నప్పుడు మర్యాద పూర్వకంగా ఉండాలి.  33. మనం మర్యాద పూర్వకమైన సంభాషణ పద్ధతులను తెలుసుకుందాం.  34. ముందుగా తెలుసుకోవలసినది మనం ఒక వ్యక్తికి ఎందుకు కాల్‌(call) చేస్తున్నాం? మనం కాల్‌(call) చేసే సమయం సరియైన దేనా? మనం అతనిని సంబోధించే పద్దతి, సమాచారం అడిగే పద్దతి, ఇచ్చే పద్దతి ఇవన్నీ సరియైనవేనా అని తెలుసుకోవాలి. టెలిఫోన్‌లో మాట్లాడేటప్పుడు ఈ సౌకర్యాలన్నీ చేర్చబడ్డాయి.  35. ఇప్పుడు పరిశీలన గురించి మాట్లాడుదాము. 36. మనం అవతలి వ్యక్తితో మాట్లాడేటపుడు మనకు అతని పరిసరాలు కనిపించవు.  37. కొన్ని సార్లు కొన్ని అవరోధాల వలన శబ్ధం స్పష్టంగా వినిపించదు. 38. వారు మనని బిగ్గరగా మాట్లాడమని పదే పదే అంటుంటారు. అదిమనకు చిరాకు కలిగిస్తుంది. అయితే మనం అవతలి వారి పరిస్ధితిని అర్ధం చేసుకోవాలి. మనం కూడా ఒకోసారి అదే పరిస్ధితి ఎదుర్కోవచ్చు. మీరు సరైన స్వరాన్ని పొందలేకపోయినప్పుడు సానుభూతి కలిగి ఉండాలి. మర్యాద మరియు పరిశీలన చాలా ముఖ్యం. 39. తరువాతి అంశం సంక్షిప్తత. 40. మనం టెలిఫోన్‌లో సంభాషించేటపుడు డబ్బు ఖర్చు చేస్తున్నాము.  అవతలి వారు కూడా ఖర్చు చేస్తారు. 41. కాబట్టి సంభాషణ సంక్షిప్తంగా లేదా క్లుప్తంగా మరియు నిర్దిషంగా ఉంటే బాగుంటుంది. కాబట్టి ఎక్కువ సేపు మాట్లాడలేము. . 42. మనం  ఎందుకొరకైతే అవతలి వ్యక్తికి కాల్‌(call) చేసామో అర్ధం చేసుకోవాలి. 43. ఇది డబ్బు కు సంబంధించినది మాత్రమే కాదు. అవతలివ్యక్తి మీ సందేశం అర్ధం చేసుకొనే పరిస్ధితి, పరిసరాలలో ఉన్నారో లేదో, సమాచారం ఇవ్వగలరో లేదో, అనుకూల వాతావరణం ఉందో లేదో మనం తెలుసుకోవాలి. కాబట్టి మిత్రులారా మనందరం టెలిఫోన్‌ కమ్యూనికేషన్లో  ఈ అంశాలు తప్పక పాటించాలి..  44. మనం సమాచారం ఇవ్వటానికి లేదా తీసుకోవటానికి రెండు పద్ధతులు ఉన్నాయి. 45. మనం కాల్‌ మాట్లాడేటపుడు కొన్ని మర్యాదలు పాటించాలి. 46. చాలా కార్యాలయాల్లో టెలిఫోనిక్ సౌకర్యాలు ఉన్నాయని మనకు తెలుసు. 47. మనకు సాంకేతిక అభివృద్ధి వలన ఇ-మె యిల్‌(Email) అనే సౌకర్యం మరియు ఇతర సౌకర్యాలు ఉన్నాయి.  48. మనం మౌఖిక సంభాషణ చేయాలంటే మనకు టెలిఫోన్‌ అత్యావశ్యకమైనది. 49. మనం ఒకరితో సంభాషించాలనుకున్నప్పుడు ముందుగా మనం ఆ సంభాషణలో పాల్గొనే వ్యక్తి చిత్రాన్ని ఊహించుకోవాలి. అతను అపరిచితుడైనా సరే, ఆ సంభాషణ ముఖాముఖి కాకపోయినా సరే, ఎందుకంటే మీ కమ్యూనికేషన్‌  నాణ్యత మీ సంస్థ యొక్క కీర్తి ప్రతిష్ఠలు వృద్ది చేసేవిగా ఉండాలి. 50. మీ సంస్థ యొక్క కీర్తి ప్రతిష్ఠలు వృద్ది చేసే ఆ సంభాషణ ముఖాముఖి అనే అనుకోవడం మంచిది. 51. టెలిఫోన్‌లో ముఖాముఖి సంభాషణ సాధ్యం కాకపోయినా మన స్వరమే మనకు ఎక్కువ సహాయకారి అవుతుంది. 52. మన స్వరం ద్వారా మనం భరోసా, నమ్మకం, ఒప్పించటం నిజాయితీ, సన్నిహితత్వం వంటి అనేక భావాలను ఇతరులకు తెలియజేస్తాం. 53. కానీ మనకు ప్రశ్నకు జవాబిచ్చేంత సమయం కూడా ఉండకపోవచ్చు. కాబట్టి టెలిఫోన్లో మాట్లాడేటపుడు మనం  ఎక్కువ సేపు  మౌనంగా  ఉండలేము. 54. మనం పంపించే సందేశం కాని అడగాల్సిన విషయాలు కాని ముందుగా మనం తయారుగా, సిద్ధంగా ఉంచుకోవాలి. 55. అంతేకాకుండా చాలా అత్యవసరం అయితే తప్ప కాల్‌ చేయడాన్ని మనం నివారించుకోవాలి.   56. ఎందుకంటే మనం కాల్‌ చేస్తే మనకు కొన్ని సవాళ్లు, పరిమితులు ఉంటాయి. మనం అపరిచితులతో మాట్లాడితే వారికి మన గురించి ఏమీ తెలియదు. 57. ఇలాంటి సందర్భాల్లో మీ ఏకాగ్రత, మర్యాదను చూపించే విధానము ఎంతో ఉపయోగపడుతుంది. 58. మనకు అవతలి వ్యక్తి నేపధ్యం తెలియనపుడు మీరు సాన్నిహిత్యాన్ని కొనసాగించండి. మరియు మన భాష, పదజాలం, వాక్యాల ద్వారా సన్నిహితత్వాని చూపించాలి. 59. మనం కాల్‌ చేసే ముందు కొన్ని మర్యాదలను నిర్వహించడం ఎల్లప్పుడూ మంచిది. 60. మిత్రులారా! మనము నీతిమంతుల యుగంలో జీవిస్తున్నాము. 61. ఇప్పుడు నెటికెట్‌'(netiquette) యుగంలో కొన్నిసార్లు ప్రాధమిక మర్యాదలను మరచిపోతాము. మనం వీటిని ఎప్పుడూ మరిచిపోకూడదు. 62. టెలిఫోన్‌(telephone) వాడకం ఎంత సాధారణం అయిపోయిందంటే మనం సమయానికి, మర్వాదకి విలువ ఇవ్వడం లేదు. కాబట్టి మనం కాల్‌ చేసే ముందు అది చాలా అత్యవసరమా లేక ముఖ్యమైనదా అని నిర్ణయించుకోవాలి. 63. సరైన సమయంలోనే కాల్ చేయాలి. 64. అంతకంటే ముందే మీరు మాట్లాడదలుచుకున్న అజెండా(agenda) తయారు చేసుకోవాలి. 65. అజెండా(agenda) అంటే మనం ఈ కాల్‌(call) ఎందుకు చేస్తున్నామో, దాని వలన లాభం ఏమిటో గుర్తించాలి.మనం తెలుసుకోవాలనుకున్న విషయాలు ఉన్నాయి. 66. విషయాలు వ్రాసుకోవడానికి ఒక కాగితం, కలం అమర్చుకోవాలి. 67. సంభాషణ యొక్క అంశాలను వ్రాయడంలో తప్పు లేదు. మనం వ్రాసుకోక పోతే కొంత సమాచారం వదిలిపెట్టబడి మనం మళ్లీ ఇంకొక కాల్‌ చేయాల్సి వస్తుంది. అది అవతలి వ్యక్తికి ఇబ్బంది కలిగిస్తుంది. 68. మనం అనేక సార్లు కాల్ చేస్తే వారు కలత చెందుతారు. మరియు పరద్యానంలో ఉండవచ్చు. 69. కాబట్టి కాల్ చేసేటప్పుడు ముందుగా మన అజెండా తయారుగా ఉండాలి. 70. అజెండా తయారుగా ఉంటే మనమే కాల్ చేస్తే మనమే మాట్లాడాటాం మంచిది. 71. మనం కాల్‌ చేసేటప్పుడు ముందుగా మనని మనం పరిచయం చేసుకోవాలి. మీ పరిచయం అయ్యాక అవతలి వ్యక్తి వివరాలు చెప్పి అతని గురించి అడగాలి. నేను డాక్టర్ బినోద్ మిశ్రాతో మాట్లాడుతున్నాను, హెచ్ఎస్ఎస్ డిపార్ట్మెంట్, ఐఐటి, రూర్కీ నుండి, నేను మిస్టర్ ఎక్స్ తో మాట్లాడగలనా? నేను మిస్టర్ వైతో మాట్లాడగలనా?"  మన వివరాలు తెలియజేస్తే దాని వలన మన గురించి ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. అవతలి వ్యక్తి స్నేహపూరిత, అనుకూల వాతావరణంలో మనకు జవాబిస్తాడు.  72. మీరు అవతలి వ్యక్తిని పేరుపెట్టి సంభాషిస్తే ఆ వ్యక్తితో మీకు స్నేహపూర్వక బంధం ఏర్పడుతుంది. 73. పేరులో ఏముందిలే అని పట్టించుకోనట్లుగా ఉండకూడదు. అంతా పేరులోనే ఉంటుంది. 74. పేరు సామరస్యాన్ని సూచిస్తుంది. 75. మనం సంస్థ కోసం ఏం చేసినా అది సంస్థ ప్రతిష్ఠను పెంచాలి. 76. కాబట్టి మనం మన పేరు, ఇతర వివరాలు చెప్పాక మనం ఎందుకు కాల్‌ చేస్తున్నామో తెలపాలి. మనం అవతల వ్వక్తిని మన సంస్థలో ఉపన్యాసం ఇవ్వటానికి ఆహ్వానించటం కోసం కాల్‌  చేసామని చెప్పాలి.  77. ఇలా చెప్పడం ద్వారా మనకు మంచి నేపధ్యం ఏర్పడుతుంది. కమ్యూనికేషన్‌ మృదువుగా సాగుతుంది. 78. మనం కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు సాధారణ ఫ్రేమ్ ఉండాలి.  టెలిఫోన్‌ సంభాషణలో చాల తక్కువ సమయం ఉన్నప్పటికీ మొదట్లోనే మనం ఒక నేపధ్యాన్ని ఏర్పరచుకోవాలి. 79. దీనికోసం మనం కొన్ని అనవసర ఫ్రశ్నలు, ఎలా ఉన్నారు? వాతావరణం ఎలా ఉంది వంటివి వదిలేయాలి, అధికారిక కమ్యూనికేషన్‌లో ఇవన్నీ అనవసరం. 80.  మరోసారి ఖర్చు ప్రశ్న , మరోసారి మర్యాద ప్రశ్న. కనుక దీనిని  దృష్టిలో ఉంచుకోవాలి. 81. అవతలి వ్యక్తి మన స్నేహితుడు కాదు. మనం మాట్లాడే వ్యక్తి బిజీగా ఉండే అధికారి అయితే మీరు కూడా వృత్తిపరంగా వ్వవహరించాలి. 82. ఎప్పుడైతే మీరు కూడా ప్రొఫెషనల్‌గా మారినప్పుడు మీరు మీ స్వరాన్ని చాలా బిగ్గరగా, అస్పస్టంగా కలవరం, పరధ్యానం కలిగించేదిగా అవతలివ్యక్తికి ఇబ్బంది కలిగేలా, ఉపయోగించరాదు. 83. కాబట్టి మీరు చర్చల్లో పాల్గొనేటపుడు, కమ్యూనికేట్ చేసేటపుడు స్పష్టంగా మాట్లాడాలి, మనం అనుమతించ బడిన టోన్ ఉపయోగించాలి.  84. మనకు అవసరమైన సమాచారం లభించగానే ఆ సంభాషణ అపేయాలి. కానీ అర్ధాంతరంగా, ఆకస్మికంగా అమర్యాదగా కాకుండా చక్కని భాషతో ముగించాలి. 85. ఉదహరణకు మీరు ఏమనవచ్చంటే మిస్‌ డిసూజా(Miss D'Souza) మీతో మాట్లాడటం చాలా సంతోషకరం, నాకు కావల్సిన సమాచారాన్ని పొందాను. 86. కాబట్టి మళ్లీ మీతో మాట్లాడే అవకాశం వస్తే చాలా ఆనందదాయకం. ఈ సంభాషణ మీరు ఎంత మర్యాదస్తులో ఇతరులకు ఎంత విలువ ఇస్తోరో మంచి పద్ధతులు ఎలా పాటిస్తారో తెలియజేస్తుంది. 87. ఒక్కొసారి ఒక సంభాషణలో ఇద్దరు వ్యక్తులు పాల్గోంటే , సంభాషణ పెరుగుతుంది.  88. భాగసౌమ్యం ఏర్పరచటానికి అవును, బాగా, దయచేసి, లాంటి  పదాలు వాడాలి. అవతల వారిని బాధపెట్టొద్దు. 89. ఒకోసారి మీరు కాల్‌ చేసి మాట్లాడినపుడు అవతలి వ్యక్తితో సరిగ్గా కనెక్ట్ అవలేరు.  90. దానికి కారణం మీరు కొన్ని అత్యవసర పనుల వల్ల ఎక్కువ సేపు మాట్లాడలేక పోవటం, అపుడు మీరు అవతలి వ్యక్తికి క్షమాపణ చెప్పి కాల్‌ముగించాలి.  91. మీరు పది నిమిషాల తరువాత కాల్‌ చేస్తామని చెపితే   తప్పక సమయాన్ని పాటించాలి. 92. ఇది కుదరకపోతే ఒక 'వాయిస్‌ మెయిల్‌'(voice mail) ఇవ్వాలి. అది సంపూర్ణంగా ఉండాలి. 93. మీరు వాయిస్‌ మెయిల్ను వదిలి కమ్యూనికేషన్ను కొనసాగించడం మంచిది. 94. ఈ కాలంలో చాలా మంది టెలిఫోన్‌ వాడటం వలన కనెక్షన్‌లో. లేదా  కనిక్టివిటీలో సమస్యలు ఉండవచ్చు. 95. కనుక కనెక్షన్‌లో. లేదా  కనిక్టివిటీలో సమస్యలు ఉండవచ్చు. 96. కాల్‌డ్రాప్‌, అంతరాయాలు లేదా కంజెషన్‌ వంటివి ఉంటాయి  97. కాబట్టి కాల్ సరిగ్గా చేరేట్లుగా జాగ్రత్త వహించాలి. అది మీ భాద్యత. 98. ఒకోసారి కాల్‌ వచ్చినపుడు ఆ వ్యక్తి అందుబాటులో లేకపోతే ఆ విషయం అవతలి వారికి తెలియజేయాలి. మరియు ఆ వ్యక్తి లేనట్లయితే, అతను ప్రస్తుతం తన డెస్క్‌లో లేడని చెప్పడం మీ బాధ్యత. 99. ఆ సందేశాన్ని గమనించి ఆ వ్యక్తి తిరిగి కాల్‌ చేస్తారు. 100. కొన్ని సార్లు మీరు కాల్ ని  వేరొకరికి బదిలీ చేయాల్సిరావచ్చు. 101. అపుడు మీరు ఖచ్చితంగా ఎందుకు కాల్ బదిలీ చేస్తున్నారో కారణం చెప్పాలి. 102. మీరు కాల్‌ని బదిలీ చేసిన ఉద్యోగి చాలా బిజీగా ఉంటే వారి పట్టికలో ఉండనవసరం లేదు. వారి అనుమతి తీసుకొని కాల్‌ ఇవ్వాలి లేదా ఆగిపోవాలి. 103. మీరు కాల్‌ని బదిలీ చేసిన ఉద్యోగి చాలా బిజీగా ఉంటే వారి  అనుమతి తీసుకొని కాల్‌ ఇవ్వాలి లేదా ఆగిపోవాలి. మిస్టర్ వై, నేను మిమ్మల్ని మిస్టర్ ఎక్స్ తో కనెక్ట్ చేయవచ్చా?  మనం కాల్‌ గురించి ఎదురుచూసినా కమ్యూనికేషన్ ఎప్పుడూ స్నేహపూరితంగా ఉండాలి. అది ఒక సంస్థకు జీవాన్ని అందిస్తుంది, సంస్థకు ప్రతీకగా ఉంటుందని  నేను పదే పదే చెప్పాను.  104. కాబట్టి మనం సహకారం, స్నేహభావం, నమ్మకం, ఒప్పుదల అనే భావాలు కలిగి ఉండాలి. కాల్స్ స్వీకరించేటప్పుడు లేదా బదిలీచేసేటప్పుడు చాలా స్నేహపూరితంగా ఉండాలి. 105. కొన్ని సార్లు డోర్ బెల్ మోగినా జవాబు ఉండదు. అప్పుడు మీరు బిజీగా ఉండవచ్చు. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఎంతో ముఖ్యమైన పని ఉంటేకాని కాల్‌ చేయరు. 106. కాబట్టి మీరు కాల్‌కు వెంటనే సమాధానం ఇవ్వాలి. మీరు టెలిఫోన్‌ కాల్‌ రిసీవ్‌ చేసుకునేటప్పుడు ఇంక ఏ ఇతర సంభాషణలో పాల్గొనరాదు. ఇది  ఒక రకమైన మర్యాద. ఇతరుల కాల్‌కి ప్రాముఖ్యత ఇవ్వాలి. 107. మనం ఒక కార్యాలయానికి కాల్‌ చేసినపుడు మరియు మీరు ప్రత్యుత్తరం ఇస్తున్నప్పుడు కూడా, వెంటనే మిమ్మల్ని మీరు గుర్తించండి. ఎందుకంటే నేను మిస్టర్ X కోసం డయల్ చేశానని ఎవరికి తెలుసు, కాని నేను మిస్టర్ Y మాట్లాడుతున్నాను వ్యక్తులు మారినా నంబర్లు మారవు కాబట్టి ముందుగా మీరు పరిచయం చేసుకోవాలి. 108. నేను ఎన్ పి టి ఇ ఎల్ నుండి మిస్టర్ జితేంద్ర అని అంటున్నారు. మీరు కాల్‌ రిసీవ్ చేసుకొని అవతలి వారికి ఏ విధంగా సాయపడగలమో అడగాలి. మీరు అవతలి వ్యక్తి గురించి ఒక మానసిక చిత్రాన్ని ఊహించుకోవాలి. 109. ఎందుకంటే మనం వారిని చూడలేము, వివరణ ఇవ్వలేము. కేవలం మన స్వరమే మన గుర్తింపు, కాబట్టి అవతలి వ్యక్తి పరిచయస్తుడనుకోవాలి. 110. కాబట్టి అవతలి వ్యక్తి పరిచయస్తుడని భావించి తగిన ధోరణి చేయాలి. మన స్వరం సంసిద్దతను తెలిపేలా ఉండాలి. 111. మన స్వరం సన్నిహితత్వం, నిజాయితీ, ఉత్సాహం, వ్యవహారశీలత, కాల్‌ తీసుకునే సంసిద్దతను తెలిపేలా ఉండాలి. కాల్ చేయడానికి సుముఖత చూపించే నాణ్యత. 112. మీరు మద్దతు పాత్రలో ఉన్నా కూడా పాజిటివ్‌గా స్పందించాలి. అది ఒక మంచి ప్రతిచర్య, వ్యాపారానికి ఉపయోగకరం, మీరు సందేశం తీసుకునేటపుడు అది ఇచ్చిన వ్యక్తి యొక్క పేరును కూడా సందేశంలో చేర్చాలి. 113. మనం మనకు ఇష్టంలేని వ్యక్తి నుండి కాల్‌ వస్తే కోపంగా, గట్టిగా మాట్లాడరాదు. అది మర్యాదకు వ్యతిరేకం. 114. మీరు మద్దతు పాత్రలో ఉంటే మరియు కాల్ చేసే వ్యక్తికి సమయం లేకపోయినా, సానుకూలంగా స్పందించడం మంచిది. కనుక దయచేసి సానుకూలంగా స్పందించండి. 115. ఒక మంచి ప్రతిచర్య, వ్యాపారానికి ఉపయోగకరం. 116. సందేశాన్ని జాగ్రత్తగా తీసుకోండి. ఆ సందేశం మీ కోసం కాకపోతే ఆ సందేశాన్ని జాగ్రత్తగా తీసుకోండి. 117. కాల్ చేసిన వ్యక్తి పేరు స్పష్టంగా వ్రాయాలి, మనం పేరు సరిగ్గా వ్రాయకపోతే అది వారిని అవమానం చేసినట్లే. 118. కాబట్టి మీరు పేరును సరిగ్గా తప్పులు లేకుండా వ్రాసి వారి టెలిఫోన్‌ నెంబరు కూడా వ్రాసి పెట్టుకోవాలి. 119. మీరు రిసీవ్‌ చేసుకున్న కాల్‌ చాలా అత్యవసరం అయి ఉంటుంది కాబట్టి మీరు వ్రాసిన సందేశాన్ని స్వయంగా మీరే అందించాలి. 120. మీరు కాల్ చేస్తున్నప్పుడు కాలర్ పేరును ఉపయోగించండి. కాలర్‌ చేసిన కాల్‌ని ఇతరులకు అందించేటపుడు ప్లీజ్, థాంక్స్ వంటి మర్యాద పూర్వక పదాలు వాడాలి. 121. నేను మిమ్మల్ని మిస్టర్ X కి కాల్‌ కనెక్ట్‌ చేయలేకపోతే 'క్షమాపణ' అడగటం తప్పేమీ కాదు. అతను వచ్చిన వెంటనే కాల్‌ కనెక్ట్‌ చేస్తా అని మీరు చెప్పవచ్చు. 122. కొన్ని వ్యాపార సంస్థలలో కస్టమర్ల నుంచి ఫిర్యాదుల రూపంలో కాల్స్‌ వస్తాయి. కస్టమర్లు కోపంగా దూకుడుగా మాట్లాడినా కూడా మీరు సహనంతో, నెమ్మదిగా వారి సమస్య విని వ్రాసుకొని త్వరలో తగిన చర్య తీసుకుంటామని వారికి తెలియజేయాలి. 123. మీరు మాట్లాడే భాష, పదజాలం శ్రావ్యంగా ఉండాలి. 124. టెలిఫోన్‌లో ముఖాముఖి సంభాషణ ఉండదు కాబట్టి, మీ స్వరానికి మీరు ఒక అంతర్జాతీయ నాణ్యత, మర్యాద, స్నేహశీలత అనే లక్షణాలు ఆపాదించాలి. 125. 'నో' అనే పదం అసలు వాడరాదు. ఎవరైన 'ఎక్స్' అనే వ్యక్తి కోసం కాల్‌ చేసినా, వేరే విషయాల గురించి చేసినా మీరు ప్రతికూల సమాధనం ఇవ్వాకూడదు. 126. మీరు ఆ సందేశాన్ని వ్రాసుకొని తప్పక ప్రతిస్పందిస్తామని చెప్పాలి. మీరు మాట్లాడే భాష అవతలి వారికి ఇబ్బంది కరంగా ఉండకూడదు. 127. మీరు సంభాషణలో ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకూడదు. మీరు దయచేసి, ఇలా చేయగలరా అని మాట్లాడాలి. 128. మీకు అవతలి వ్యక్తి, అవతలి వ్యక్తికి మీరు పరిచయం లేరు కాబట్టి మీ మర్యాదపూర్వక సంభాషణ మీపై మంచి అబిప్రాయం కలుగజేస్తుంది. 129. కాబట్టి మీరు ఉపయోగించే భాష విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. 130. ఎప్పుడూ కూడా చేయలేనని అనకుండా మీకు ఎలా సహాయపడగలనని అడగాలి. 131. మీ సందేశాన్ని తప్పక అందజేస్తానని చెప్పాలి. 132. మిత్రులారా మనం నివసించే ప్రపంచంలో మనకు సమయం తక్కువ ఉన్నప్పటీకి కమ్యూనికేట్‌ చేయాలనే అనుకుంటాం. 133. మనం ఇతరులతో చేసే సంభాషణ ఒక మంచి జ్ఞాపకంగా మిగలాలి. వ్యక్తిగతంగా అయినా, సంస్థ తరపున అయిన మీరు చేసే కమ్యూనికేషన్ ఒక గుర్తింపు తేవాలి. మీదైన ముద్ర వేయాలి. 134. దీనితో, మేము ఈ ఉపన్యాసం యొక్క మొదటి భాగం చివరికి వస్తాము మరియు ఉపన్యాసం యొక్క రెండవ భాగంలో, మనం సేల్‌ఫోన్ల ఉపయోగం గురించి ఇతర మాధ్యమాల గురించి కూడా తెలుసుకుందాం. 135. ధన్యవాదాలు! 136.