1. ప్రభావవంతమైన కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ (Effective Communication Skills). మునుపటి మాడ్యూల్‌లో(module) మనం మన నిజ జీవితంలో మరియు వ్యాపార రంగంలో సాప్ట్‌ స్కిల్స్‌ (soft skills)యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాము. 2. అంతేకాకుండా కమ్యూనికేషన్‌ స్కిల్స్‌(communication skills), సాప్ట్‌స్కిల్స్‌లో(soft skills) ఒక ముఖ్యాంశం అని నేర్చుకున్నాము. 3. ఈ మాడ్యూల్‌లో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ను మరింత ప్రభావవంతంగా ఎలా చేయాలో చర్చిద్దాము. 4. మీ అందరికి తెలిసినట్ట్లుగా సాప్ట్‌స్కిల్స్‌. 5. డాక్టర్ బినోద్ మిశ్రా డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రూర్కీ లెక్చర్ - 03 ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ గత మాడ్యూల్‌లో, జీవితం మరియు వ్యాపారంలో సాఫ్ట్ స్కిల్స్ యొక్క ప్రాముఖ్యత గురించి మీరు తెలుసుకున్నారు. 6. అంతేకాకుండా కమ్యూనికేషన్‌ స్కిల్స్‌(communication skills), సాప్ట్‌స్కిల్స్‌లో(soft skills) ఒక ముఖ్యాంశం అని నేర్చుకున్నాము. 7. ఈ మాడ్యూల్‌లో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ను మరింత ప్రభావవంతంగా ఎలా చేయాలో చర్చిద్దాము. 8. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌(communication skills) అన్ని రంగాలలో, జీవితం లేదా వ్యాపారంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. 9. మనం కమ్యూనికేషన్‌(communication) చేసినపుడల్లా అది చాలా సమర్ధవంతంగా ఉన్నదని మన సందేశం సరిగ్గా అందినదని భావిస్తాము. 10. ఒక ప్రముఖ నాటకరచయిత కమ్యూనికేషన్‌ స్కిల్స్‌(communication skills) గురించి మాట్లాడుతూ, ''కమ్యూనికేషన్‌ స్కిల్స్‌(communication skills) లో ఉన్న ఒక గొప్ప భ్రమ దాన్ని మనం పూర్తిగా సాధించామని అనుకోవటమే'' అన్నారు. 11. మిత్రులారా, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌(communication skills) లో ప్రధానాంశం ఏమిటంటే, సమర్ధవంతమైన కమ్యునికేషన్‌ గురించి తెలుసుకోవాలంటే ముందు అది ఎలా ఉండాలో, ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి. 12. జీవితం యొక్క ప్రతి దశలో మనకు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌(communication skills) చాలా ముఖ్యమైనవి. 13. అవి జీవితంలో మరియు వ్యాపారంలో మంచి సంబంధ భాంధవ్యాలు నెలకోల్పడానికి తోడ్పడుతాయి. 14. కమ్యూనికేషన్‌(communication) అంటే మన ఆలోచనలను కోరికలను మరియు అంచనాలను వ్యక్తీకరించడం. 15. కమ్యూనికేషన్‌(communication) అనే పదం లాటిన్‌(Latin) భాష నుండి తీసుకోబడింది. దాని అర్ధం 'ప్రసారం' లేదా 'పంచుకోవడం'. 16. కమ్యూనికేషన్‌ యొక్క ఉద్దేశ్యం ఆలోచనలు, అనుభవాలు లేదా నిజాలను పంచుకోవడం. మేము కొన్ని అనుభవాలను పంచుకుంటాము. 17. మనం ఏ విధంగా కమ్యూనికేట్‌(communicate) చేసినా ఇతరులు దాన్ని అర్ధం చేసుకున్నప్పుడే అది సఫలమైందని భావించాలి. 18. కమ్యూనికేషన్‌(communication) యొక్క ముఖ్య లక్ష్యం సమాచారాన్ని అందించడం మరియు సమాచారాన్ని ప్రసారం చేయడం. 19. కాబట్టి కమ్యూనికేట్‌ చేయడం అంటే మన ఆలోచనలను కోరికలను మరియు అంచనాలను వ్యక్తీకరించడం. 20. మన జీవితంలో పలురకాలైన సందర్భాలు, సమాచారాలు లేదా విషయాలు ఉండవచ్చు. 21. ఉదాహరణకు మనం కొన్నిసార్లు సంతోషంగా, భాధగా, ధైర్యంగా భయం లేదా తిరస్కార భావాన్ని మనం వ్యక్తపరచవచ్చు. 22. దాన్ని మనం ఎప్పుడు భాష/పదాల ద్వారానే కాక సంకేతాలు, చిహ్నాల ద్వారా కూడా  వ్యక్తపరచవచ్చు. 23. ఇంకా మనుషులు మరియు జంతువులు కూడా కమ్యూనికేట్‌ చేస్తాయి. 24. ఒక శిశువు ఆకలి వేసినపుడు ఏడుస్తాడు. 25. తన కోరికను వ్యక్తపరుస్తాడు. 26. తల్లికి మాత్రమే ఆ ఏడుపుకి అర్ధం తెలుస్తుంది. 27. అయితే కొన్ని సార్లు శిశువు నిరంతరంగా ఆపకుండా ఏడుస్తే తల్లికి కారణం తెలియక పోవచ్చు. 28. కాని కొన్ని సందర్భాలలో ఒక వైద్యుడు మాత్రమే కొన్ని సూచనలు, చిహ్నాల ద్వారా శిశువు యొక్క అనారోగ్యాన్ని గుర్తించగలుగుతాడు. 29. మనుష్యులు పదాలను ఉపయోగించి లేదా చిహ్నాల ద్వారా కూడా కమ్యూనికేట్‌ చేయవచ్చు. 30. కాని కేవలం పదాలను ఉపయోగించడం ద్వారా మానవ కమ్యూనికేషన్‌(communication) క్లిష్టతరంగా జటిలంగా మారుతుంది. మీరొక మంచి పుస్తకం చదివి లేదా ఒక మంచి సినిమా చూశాఋ. 31. ఆ సంతోషాన్ని, ఉత్సాహాన్ని మీ స్నేహితులతో పంచుకోవాలని అనుకున్నారు. 32. ఈ ఉత్సాహాన్ని మీ స్నేహితులతో పంచుకున్నప్పుడు మీ స్నేహితులు సహకరిస్తున్నారా లేదా అని గమనించాలి. 33. ఆ సమయంలో మీ స్నేహితుడు చేసే శబ్దాల ద్వారా, మాటల ద్వారా మీరు అతని ఉద్దేశాన్ని పూర్తిగా తెలుసుకోలేకున్నా అతని ముఖంలో కనిపించే భావాలు, స్పందన వలన అది స్పష్టమౌతుంది. 34. అపుడే మీ కమ్యూనికేషన్‌(communication) సఫలం అయిందో లేదో తెలుస్తుంది. 35. అయితే మీరు మీ కమ్యూమికేషన్‌(communication) కోసం మీ స్నేహితుడినే ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకంటే అతనికి మీ అంత వయసు, అనుభవం, జ్ఞానం ఉన్నాయి కాబట్టి, కమ్యూనికేషన్‌(communication) విజయవంతం కావాలంటే అవతలి వ్యక్తి రుచులు, అభిరుచులు మనకి తెలిసి ఉండాలి. 36. అంటే ఏ సంభాషణలో అయినా ఒక సాధారణ సూచిక ఉండాలి. 37. కాబట్టి కమ్యూనికేషన్‌ ఒక ప్రక్రియ అని చెప్పవచ్చు. 38. మనమందరం కూడా కమ్యూనికేషన్‌(communication) లో సెండర్‌(sender) లేదా ఒక సోర్స్‌(source)గా పాత్రని కలిగి ఉంటాము. 39. మీరు సెండర్‌ అయితే ఒక ఆలోచన, అనుభవం కోరిక లేదా సమాచారం ఉంది. 40. పంపిన వ్యక్తిగా మీరు మీ ఆలోచనను రూపొందిస్తారు.   41. ఆలోచనను రూపొందించాక, మీరు మీ ఆలోచనను ఎన్‌కోడ్‌ (Encode) చేస్తారు. దీనికై మీరు రిసీవర్‌(receiver) యొక్క నేపద్యాన్ని, సమాచారం చేరే గమ్యస్థానం గురించి ఒక ఆలోచనని రూపోందించుకొని ప్రవర్తిస్తారు. ప్రతి కమ్యూనికేషన్‌ వ్యవస్థలో ఒక సెండర్‌ మరియు ఒక రిసీవర్‌(receiver) ఉంటారు. 42. సెండర్‌ సందేశాన్ని రూపొందించుకున్నాక ఒక ఛానెల్‌ని కూడా ఎంచుకుంటారు. 43. ఈ కాలంలో అనేక ఛానల్స్‌ అందుబాటులో ఉన్నాయి. అయితే సెండర్‌ తన సందేశానికి అనుగుణమైన అవసరమైన ఛానెల్‌ని మాత్రమే ఎంచుకంటాడు. 44. సందేశం ఈ ఛానెల్‌ ద్వారా సెండర్‌ నుండి రిసీవర్‌ కి చేరుతుంది. 45. అయితే కొన్ని సార్లు ఛానెల్లో ఉన్న అడ్డంకుల వలన సందేశంలో కొంత మార్పు కలిగి రిసీవర్‌కి చేరవచ్చు. ఒకోసారి మనం ఎంచుకున్న భాషా, పదజాలం కమ్యూనికేషన్‌ యొక్క స్వరూపాన్ని మార్చి దాన్ని సులువుగా లేదా కష్టతరంగా చేయవచ్చు. 46. తనకి అందిన సందేశాన్ని రిసీవర్‌ డీకోడ్‌ (Decode) చేస్తాడు. 47. సెండర్‌ తను పంపిన సందేశం యొక్క సఫలత గురించి వచ్చే ప్రతి చర్య కోసం ఎదురు చూస్తూంటాడు. ఆ ప్రతిచర్య మాత్రమే సఫలతను తెలియజేెస్తుంది మరియు కమ్యూనికేషన్‌  ప్రక్రియ పూర్తి అయినట్లు సూచిస్తుంది. 48. మనం ఎప్పుడు కమ్యూనికేట్‌ చేసిన అది విజయవంతంగా పూర్తయిందని భావిస్తాం. కానీ, చాలా సందర్భాలలో మీకు స్పందన రాదు, అంటే కమ్యూనికేషన్ ప్రక్రియ పూర్తి కాలేదని కాదు. కాని, ఇందులో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. అందుకే ప్రతిస్పందన జరగలేదు, అందువల్ల, పంపినవారు సందేశాన్ని పంపినప్పుడు, పంపినవారికి ఒక విధమైన అవగాహన ఉంటుంది. . 49. సెండర్‌ ఒక ఆలోచనను ఏర్పరుచుకోని ఒక ఛానెల్‌ ఎంచుకొని ఎంతో బాధ్యతగా ఒక సందేశం రిసీవర్‌ కి పంపిస్తాడు. 50. రిసీవర్‌ కూడా అంతే బాధ్యతగా ఆ సందేశాన్ని గ్రహించి కమ్యునికేషన్‌ ప్రక్రియ పూర్తి చేస్తాడు. 51. కాబట్టి వీరిద్దరి మధ్య ఒక సుహృద్భావం, సహకారం అత్యావశ్యకం. ఇది వారి నేపధ్యం ఇంకా అనుభవం పై ఆధారపడి ఉంటుంది. 52. ఉదాహరణకు మీరు ఒక సందేశాన్ని రూపొందించినపుడు ఎవరి కోసం ఇది తయారు చేశారో గమనించాల్సి ఉంటుంది. 53. మీరు ఒక తమిళ వ్యక్తికి బెంగాలీలో సందేశం పంపిస్తే ఆ కమ్యునికేషన్‌ ప్రక్రియ విఫలం అవుతుంది. 54. కొన్నిసార్లు ఇతరుల నేపధ్యం తెలుసుకోకుండా సందేశం పంపిస్తే అది విఫలమౌతుంది. 55. కాబట్టి సందేశం సంపూర్తిగా కమ్యూనికేట్‌ చేయటానికి మనం ఎంచుకున్న భాషా, పదజాలం చక్కగా సమకూర్చుకోవాలి. 56. అంతే కాకుండా మనం ఒక ఆలోచనని పంచుకునేటపుడు సెండర్‌ మరియు రిసీవర్‌ యొక్క  అవగాహన శక్తి ఒకే విధంగా ఉండకపోవచ్చు. 57. ఇద్దరూ ఒక సందేశం పట్ల ఒకే మాదిరిగా స్పందించలేక పోవచ్చు. అంతే కాక వారి నేపధ్యాలు కలవక పోతే కమ్యూనికేషన్‌ ప్రక్రియలో అవరోధాలు ఏర్పడవచ్చు. 58. కనుక ఇద్దరి వ్యక్తుల మధ్య అవగాహన ఒకే విదంగా ఉండదు. 59. కొన్ని సందర్భాలలో వాతావరణం కూడా ప్రభావాన్ని చూపించుతుంది. 60. అనుకూలమైన వాతావరణం వల్ల మీ సందేశం మంచిగా చేరుతుంది. 61. ఉదాహరణకి మనం టెలిఫోన్‌ ద్వారా సందేశం పంపించేటపుడు దగ్గరలో ఒక మార్కెట్‌ ఉంటే అక్కడి శబ్దాల వలన చాలా అవరోధం కలిగి రిసివర్‌ సందేశాన్ని సరిగ్గా అర్ధం చేసుకోలేడు. కాబట్టి సరియైన వాతావరణం ఉండటం చాలా అవసరం. 62. అదే విధంగా, మీరు మీ స్నేహితులతో లేదా బంధువులతో మాట్లాడుతున్నప్పడు, వారు వింటున్నా కూడా సరిగ్గా స్పందించకపోతే దానికి కారణం వాళ్లు ఆ సందేశాన్ని సరిగ్గా అర్దం చేసుకోలేక పోవటమే. 63. ఈ విషయంలో మనం ఎంచుకున్న మాధ్యమం కూడా ముఖ్యమే. 64. ఈ కాలంలో ఈ-మెయిల్‌ ద్వారా అన్ని సందేశాలను సులభంగా త్వరగా పంపించగలము, అది ఉత్తమ మాధ్యమమని చాలామంది భావిస్తారు. 65. మీరు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మీ ఉపాధ్యాయునికి ఒక ఈ-మెయిల్‌ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తారు. కాన్ని ఎన్ని రోజులైనా మీకు ఏమీ ప్రతిస్పందన లభించదు. 66. ఆ తరువాత ఒక రోజు మీరు ఫోన్‌ చేసి విషయంతెలుసుకోవాలని ప్రయత్నించినపుడు మీ ఉపాధ్యాయునికి ఈ-మెయిల్‌ అందలేదని అర్ధమౌతుంది. 67. కాబట్టి మనం సరియైన మాధ్యమం ఎన్నుకోవడం ఎంతో అవసరం. 68. కొన్ని సార్లు మీరు సందేశాన్ని మౌఖిికంగా లేదా వ్రాతపూర్వకంగా పంపవచ్చు. 69. వ్రాతపూర్వక సందేశాన్ని పంపేటపుడు అది క్లిష్టంగా ఉండి రిసీవర్‌కి తగిన విద్యార్హత లేకపోతే అతను ఆ సందేశాన్ని సరిగ్గా అర్ధం చేసుకోలేడు. 70. కాబట్టి రిసీవర్‌ నేపధ్యం మరియు సందేశం పంపించే మాధ్యమం గమనించాలి. 71. మనం సందేశాన్ని తయారు చేసేటప్పుడే ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకంటే కమ్యూకేషన్ లో పర్యావరణం ముఖ్య పాత్ర పోషిస్తుంది. 72. సందేశం ఎంత స్పష్టంగా ఉంటే రీసీవర్‌ దాన్ని అంత బాగా అర్థం చేసుకోగలడు. 73. సందేశం యొక్క స్పష్టత చాలా ముఖ్యం. 74. ఎందుకంటే సందేశం స్పష్టంగా ఉంటే, అది గ్రహీతకు మంచి ఆదరణ లభిస్తుంది. ఆ తర్వాత మీరు ఛానెల్‌ని నిర్ణయించినప్పుడు, ఈ ఛానెల్ గ్రహీతకు చాలా ఆసక్తికరంగా ఉండాలి లేదా గ్రహీత దానికి బానిసగా ఉండాలి, లేకపోతే కమ్యూనికేషన్ అంత ప్రభావవంతంగా ఉండదు. 75. మరాఠీ వారికి తమిళంలో లేదా తమిళ వారికి మరాఠీలో మనం సందేశం పంపించలేము. 76. 77. అంతేకాకుండా మనం వాడే పదజాలం ఎంత సామాన్యంగా ఉన్నప్పటికీ ఇతరులకు అర్ధంకాకపోవచ్చు. మీ భాష యొక్క సాదారణ పదం మరొక భాషకు కష్టం కావచ్చు. 78. కనుక మీరు భాషను ఎన్నుకోవడం లో జాగ్రత్త వహించాలి. 79. మీకు ఆంగ్లంలో సందేశం పంపినపుడు, రిసీవర్‌కి మంచి ఆంగ్లం తెలిసినా కూడా ఏదైనా కఠినమైన పదం వచ్చినపుడు వెంటనే నిఘంటువు ( Dictionary) ఉపయోగించరు కదా! 80. కాబట్టి పదాలను ఎంచుకోవటంలో ఎంతో జాగ్రత్త వహించాలి. 81.  కనుక పదాలను ఎన్నుకునేటప్పుడు మరియు పదాలను ఉపయోగించేటప్పుడు ఇద్దరికీ అర్ధమయ్యే భాషను మాత్రమే ఉపయోగించడంలో స్పష్టత ఉండాలి. 82. మీరు వ్రాసిన లేదా మౌఖిక ద్వారా పంపే సందేశం పూర్తయిందో లేదో కూడా చూడాలి. ఎందుకంటే కొన్నిసార్లు మౌఖిక సంభాషణలో వ్యక్తులు సగం వాక్యమే మాట్లాడవచ్చు. 83. కాని లిఖిత కమ్యూనికేషన్‌లో సగం వాక్యాలు వ్రాస్తే అర్ధం చేసుకోవటం చాలా కష్టం.మౌఖిక సంభాషణలో వివరణ అడిగి తెలుసుకోవచ్చు. కానీ, వ్రాత సందేశంలో వివరణ అడిగే అవకాశం ఉండదు. 84. కనుక మీ సందేశాలను ఎన్నుకునేటప్పుడు ఆ అనుభవాలు పూర్తయియేలా చూసుకోవాలి. 85. అంతేకాకుండా చాలా క్లిష్టమైన సుదీర్ఘ వాక్యాలు ఉపయోగిస్తే సందేశం పూర్తిగా అర్థమవదు. 86. సంక్షిప్త వాక్యాలు వాడటం కమ్యూనికేషన్‌ యొక్క ముఖ్య లక్షణం. నిర్దుష్టమైన సరియైన పదాలు చిన్న వాక్యాలు ఉపయోగించండి. 87. ప్రభావవంతమైన  కమ్యూనికేషన్‌ అంటే ఇదే. 88. ఆంగ్ల భాష ఉపయోగించేటపుడు వ్యాకరణ దోషాలు  ఉంటే, అది మీ నేపథ్యాన్ని కూడా చూపిస్తుంది. 89. స్పందన కూడా అనుకూలంగా ఉండదు.   90. మనం అనేక సందర్భాలలో వివిధ స్థాయిల్లో ఉన్న వ్యక్తులతో, మనకంటే వయసులో పెద్దవారితో కమ్యూనికేట్‌ చేస్తాము. 91. అటువంటి పరిస్థితులలో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలి. 92. రిసీవర్‌ని దృష్టిలో ఉంచుకొని కేవలం మర్యాద సూచించే పదాలను కొన్నిసార్లు ఉపయోగించలేకపోవచ్చు. వాడాలి, దీని వలన కొన్నిసార్లు సందేశంలో స్పష్టత లోపించవచ్చు. 93. కమ్యూనికేషన్‌ సఫలం అవాలంటే మర్యాద పూర్వకంగా వ్యవహరించాలి. 94. మీరు మీ రిసీవర్‌తో కూడా సానుభూతి పొందాలి. 95. అయినప్పటికీ కమ్యూనికేషన్‌ సఫలం అవాలంటే రిసీవర్‌ యొక్క నేపథ్యం మరియు జ్ఞానానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. 96. ప్రభావవంతమైన కమ్యూనికేషన్‌ లో ఉండవలసిన 7Cs కమ్యూనికేషన్‌ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. 97. అందులో ముఖ్యమైనది నిష్కపటత (Candidness), స్పష్టత చాలా అవసరం. 98. ప్రస్తుత కాలంలో కేవలం ఒక్క పదప్రయోగం వలన సమస్యలు రావచ్చు. 99. మీరు ఒక ప్రొఫెషనల్ అయితే సామర్ధ్యపరంగా రాణించడానికి ప్రయత్నిస్తున్నారు. 100. మనం ఒక సంస్థలో పని చేసేటపుడు సంస్థాగత కమ్యూనికేషన్‌, సాధారణ కమ్యూనికేషన్‌కి భిన్నంగా ఉంటుంది. 101. ఈ వ్యత్యాసం అర్ధం చేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 102. మనం మన స్నేహితులలో, బంధువులతో సాధారణ కమ్యూనికేషన్‌ చేస్తాము. కొన్నిసార్లు మీకు పదాలపై ఎక్కువ నియంత్రణ ఉండదు, కొన్నిసార్లు మీరు అనధికారికంగా మారతారు, కొన్నిసార్లు మీరు వేర్వేరు అర్థాలతో ఉన్న పదాలను ఉపయోగిస్తారు. మనం వాడే పదాలు ఎలా ఉన్నా వారు అర్ధం చేసుకుంటారు. 103. కాని సంస్థాగత కమ్యూనికేషన్‌లో స్పష్టత ఉండాలి. ఎందుకంటే ఆధునికి సంస్థలలో విభిన్న మతాలు, నమ్మకాలు, ఇష్టాలు, అనిష్టాలు, రుచులు ఉన్న వ్యక్తులు ఉంటారు. 104. అక్కడ ఏపదం కష్టతరంగా ఉంటుందో తెలియదు. 105. ఒక సంస్థలో ఉద్యోగులు సమూహాలలో (Teams) పని చేస్తారు. వారి స్థాయి వేరైనప్పటికీ అందరూ ఒక లక్ష్యం కోసమే కలిసికట్టుగా కృషిచేస్తారు, ఇటువంటి సందర్భంలో మనం మాట్లాడే ఒక్కమాట ఆ నిర్దిష్ట లక్ష్యానికి వ్యతిరేకంగా ఉండకూడదు. ఒక సామూహిక బాధ్యతను సాధించే విధంగా ఉండాలి. 106. ఇప్పుడు సంస్థలో ఎలాంటి కమ్యూనికేషన్‌ జరుగుతుంది అనేది ఒక ముఖ్యమైన విషయం. 107. ఒక సంస్థలో కమ్యూనికేషన్‌ వివిధ స్థాయిల్లో ఉన్న వ్యక్తుల మధ్య జరుగుతుంది. ఇది అంతర్గతంగా  లేదా బహిర్గతంగా ఉండవచ్చు. 108. అంతర్గత కమ్యూనికేషన్‌ అయితే ఇది సంత మరియు ఉద్యోగులతో ఉంటుంది. 109. సంస్ధాగత కమ్యూనికేషన్‌లో మనం అధికారిక (Formal) లేదా అనధికారిక (Informal) మాధ్యమాన్ని ఉపయోగించవచ్చు. ఉదాహరణకు. మీరు కొన్ని కంపెనీ విధానాల గురించి కూడా మాట్లాడుతున్న ప్రోగ్రామ్ గురించి మాట్లాడుతున్నారు, అయితే ఇవన్నీ అంతర్గత సమాచార మార్పిడి. 110. మీరు అంతర్గత కమ్యూనికేషన్ చేస్తున్నప్పుడు మీరు విభజించగలరని కూడా గుర్తుంచుకోండి.కాని ప్రతిసంస్థలో ఒక ఇంట్రా (Intra) కమ్యూనికేషన్‌ (communication) కూడా ఉంటుంది. 111. అంతర్గత కమ్యూనికేషన్‌ పైకి ఉంటుంది. 112. ఉదాహరణకి ఒక సంస్థలో కొత్త ప్రణాళిక ప్రకారం జీతంలో ఇంకా DA లో పెంపు ప్రకటించారు. 113. ఈ సమాచారం సంస్థలో నిలువుగా లేదా సమాంతరంగా ప్రసరించవచ్చు. 114. సంస్థాగత ప్రణాళికల గురించి చర్చించేటపుడు ఆ కమ్యూనికేషన్‌ నిలువుగా (Upward communication) ప్రసరిస్తుంది. 115. కొన్నిసార్లు ఇది మరొక విభాగంలో జరగవచ్చు. 116. అంతర్గత కమ్యూనికేషన్‌ అయితే ఉద్యోగులు ఒకరినొకరు కలిసి తమ అభిప్రాయాలు వెల్లడించి వివరణలను తెలుసుకుంటారు. ప్రస్తుత కాలంలో ఒక అనధికారిక కమ్యూనికేషన్‌ ప్రమాదాన్ని సృష్టిస్తోంది. 117. మిత్రులారా అధికారిక కమ్యూనికేషన్‌ సూటిగా, స్పష్టంగా ఉంటుంది. కాని ఉద్యోగులు అనధికార మాధ్యమం ద్వారా సమాచారాన్ని పొందుతారు. దాన్ని వదంతులు లేదా గ్రేప్ వైన్‌ (Grapevine) అంటారు. 118. గ్రేప్ వైన్‌ ద్వారా వచ్చే అనేక కమ్యూనికేషన్‌లు   అనధికారికంగా ఉంటాయి. 119. చాలామంది నిర్వాహకులు ఈ గ్రేప్ వైన్‌ ని చాలా తెలివిగా వాడుకుంటారు. 120. ఈ గ్రేప్ వైన్‌,  వదంతులు పుకార్లుగా మారి సమాచారం పలు రూపాంతరాలు చెందుతుంది, అయితే గ్రేప్‌వైన్‌ (grapevine) అన్ని సార్లూ ప్రతికూలంగా ఉండదు. ఇప్పుడు మనము బాహ్య కమ్యూనికేషన్‌,(External communication)గురించి మాట్లాడుతాము. 121. బాహ్య కమ్యూనికేషన్‌, ద్వారా క్లయింట్‌, కస్టమర్స్‌ ప్రభుత్వ ఏజన్సీలతో మరియు ప్రజలతో ఒక బాంధవ్యం ఏర్పడుతుంది, మీ సంస్థ ఒక కొత్త ఉత్పత్తిని మార్కెట్‌లో ప్రవేశ పెట్టినట్లయితే ఈ బాహ్య కమ్యూనికేషన్‌ ద్వారా అందరికీ సంస్థ యొక్క లక్ష్యాలను తెలియజేయవచ్చు. మనం సంస్థయొక్క వెబ్‌సైట్‌ ద్వారా కూడా మన లక్ష్యాలు ప్రణాళికలు ఉత్పత్తులు గురించి అందరికీ విశదంగా ప్రచారం చేయవచ్చు. ఈ పద్ధతి ద్వారా సంస్థకు ఒక అనుకూల వాతావరణాన్ని కల్పించాలి. ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. 122. కొంతమంది ఉద్యోగులు తమ అసహనంతో అసంతృప్తితో ఈ భావాన్ని ప్రతికూలంగా మార్చవచ్చు, కాని సంస్థలో పని చేసే ప్రతి ఉద్యోగి ఆ సంస్థ యొక్క ప్రతినిధిగా ప్రతీకగా ఎల్లప్పుడూ ఒక పాజిటివ్‌ ఇమేజ్‌ సృష్టించటానికే కృషి చేయాలి. అప్పుడే బయటి ప్రపంచంలో మీ సంస్థకి ఒక ఉన్నతమైన గుర్తింపు వస్తుంది. 123. కాబట్టి మీరు గ్రేప్‌వైన్‌ నుండి మీరు దూరంగా ఉండాలి. ఎందుకంటే మీరు కూడా దానిలో భాగం కావచ్చు. 124. చాలా సంస్థలలో గ్రేప్‌వైన్‌(grapevine) చాలా బలంగా ఉన్న్ప్పుడు అది రాజకీయ కుట్రదారుల సమూహాన్ని ఏర్పరిచి దాని ద్వారా కలహాల విభజనని సృష్టిస్తుంది. 125. కాబట్టి గ్రేప్‌వైన్‌(grapevine) ద్వారా వచ్చే సమాచారాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించాలి. 126. ఆ సమాచారాన్ని సంస్థ గుర్తింపుని పెంచటానికే కాని తగ్గించడానికి ఉపయోగించకూడదు. 127. ఒక సంస్థలో సమాచారం ఉత్తరాలు, కరపత్రాలు మరియు కంపెనీ ఇంటర్నెట్‌ వైబ్‌సైట్‌ ద్వారా ప్రసారమవుతుంది. 128. నేటి ప్రపంచంలో మనుగడా సాగించలంటే సమర్ధవంతంగా మాట్లాడాలని మేము ముందే చెప్పాము. 129. సమర్ధవంతమైన కమ్యూనికేషన్ ఒక వ్యక్తిగా మీకు మాత్రమే ఉపయోగపడదు. ఆధునిక కాలంలో ఎవరైతే చక్కని ప్రభావంతమైన కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు కలిగి ఉంటారో వారు పదోన్నతి పొందగలుగుతారు. 130. వారు వివిధ స్థాయిల్లో ఉన్న వ్యక్తులలో నేర్పుగా సంభాషించి మంచి అవకాశాలు దక్కించుకుంటారు. మీరు ఒక ఖచ్చితత్వాన్ని నిర్వహిస్తారు, మీరు కూడా ఒక రకమైన సహనాన్ని కొనసాగిస్తారు, మీరు సమతుల్యతను సమతుల్యం చేయటానికి కమ్యూనికేట్ చేస్తున్నారు. 131. ప్రియమైన మిత్రులారా, సానుకూల చిత్రాన్ని రూపొందించడానికి కమ్యూనికేషన్ వచ్చింది. 132. కమ్యూనికేషన్‌ మనం వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించినా, అది మన వ్యక్తిత్వానికి ప్రతీకగా ఉండి మనం జీవితంలో ప్రగతి సాధించడానికి తోడ్పడుతుంది. 133. ఇప్పటివరకు మనం ఈ మాడ్యూల్‌ లో ప్రభావవంతమైన కమ్యూనికేషన్‌(communication) గురించి తెలుసుకున్నాం. 134. మనం సమర్ధవంతంగా కమూనికేషన్‌ చేయటం ద్వారా జీవితంలో, ఉద్యోగంలో ఎంత ప్రగతి సాధించగలము. 135. కమ్యూనికేషన్‌ అనేది ఒక రమైన వ్యక్తీకరణ అమృయు మీరు ఒక సంస్థలో ఉన్నప్పుదూ మీరు ప్రవాహంతో ఉన్నారని మరియు ఆ ప్రవాహనికి వ్యతిరేకంగా లేరని చెబుతుంది. 136. కాబట్టి ఒక సంస్థలో మీరు మీ వ్యక్తిత్వాన్ని, జ్ఞానాన్ని మీ కమ్యూనికేషన్‌ ద్వారా అందరికీ గుర్తుండిపోయేలా ప్రవర్తించి సంస్థలో ఒక భాగమైపోవాలి. 137. మీకు చాలా చాలా ధన్యవాదాలు. 138. మన నిజ జీవితంలో మరియు వ్యాపార రంగంలో కమ్యూనికేషన్‌నైపుణ్యాలు ముఖ్యమైనవి. 139. మనం కమ్యూనికేషన్‌(communication) చేసినపుడల్లా అది చాలా సమర్ధవంతంగా ఉన్నదని మన సందేశం సరిగ్గా అందినదని భావిస్తాము. 140. ధన్యవాదాలు!